Konda Surekha on cloud 9
News pulse, Politics | admin | May 15, 2011 at 10:08 am
గుంటూరులో వై.ఎస్.జగన్ చేపట్టిన రెండు రోజుల దీక్షకు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖ హాజరైనప్పుడు సభికుల నుంచి పెద్ద ఎత్తున హర్షద్వానాలు వినిపించాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఏ అర్హత ఉంటే ముఖ్యమంత్రి పదవి వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలని మాజీ మంత్రి కొండా సురేఖ సూచించారు.జగన్ గెలుపు పాలపొంగు అని ముఖ్యమంత్రి అంటున్నారని, పాల పొంగు గురించి కిరణ్ కు ఎలా తెలుసో అంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు.ఆయనే వంటింట్లో పాలను వేడి చేసుకుని తాగుతారేమోనని సురేఖ వ్యాఖ్యానించారు.
దీక్షలకు ప్రజలను తరలిస్తున్నారని కొందు విమర్శిస్తున్నారని,ఇక్కడకు మిమ్మల్ని ఎవరైనా తరలించారా?అని ప్రజలను ప్రశ్నించారు. వారు ఎవరూ తరలించలేదు అని బదులు చెప్పారు. జగన్ మెజార్టీని చూసైనా అనవసర విమర్శలు చేయకండన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారన్నది ముఖ్యం కాదని, ఈ దీక్షలు శాసనసభ్యుల సంఖ్యపెంచుకోడానికి కాదు.
ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లడమే లక్ష్య మని ఆమె వివరించారు. రాహూల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో రైతులకు అన్యాయం జరుగుతోందంటూ , మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దర్నాలు చేస్తున్నారని సురేఖ విమర్శించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట జరుగుతున్న అన్యాయాలు చూడకుండా అక్కడ ధర్నా చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
మేమున్నా లేకున్నా ప్రజలు,రైతులు జగన్ వెంట ఉన్నారని కొండా సురేఖ అన్నారు.కొండా సురేఖ ఉపన్యాసానికి జనం నుంచి మంచి స్పందన లభించింది.
Related posts:
- We will show the power of Hyderabad – Cong T ministers
- Jayasudha avoiding Jagan’s party?
- Sonia sets deadline for CM, Kiran?
- Will CM, Kiran be a CM until 2014?
- Congress ku August bhayam
- I will be the first one to resign – Konda Surekha
- Konda Surekha to support Gaddar?
- DS angry on Konda Surekha
- Konda Surekha still showing her loyality
- Will Konda Surekha be suspended?


Tweet This
Digg This
Save to delicious
Stumble it