Kuthuhalamma comments on CM
News pulse, Politics | admin | May 18, 2011 at 4:01 amకాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే,సీనియర్ దళిత మహిళానేత అయిన కుతూహలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్‌ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రి పదవిని ఆశించారు. తాను సీనియర్‌ను కనుక మంత్రి పదవి వస్తుందని ఆశించారు కానీ ఇవ్వకపోవడంతో అప్పటినుంచి అసంతృప్తుల జాబితాలో చేరిపోయారు.
అంతేకాకుండా జగన్‌కు ఇంకా పూర్తిగా దగ్గరవ్వలేదు కానీ అవసరమైతే వెళ్లడానికి కూడా సంకేతాలు ఇస్తున్నారు. కిరణ్ సీఎం అయితే సొంతజిల్లా చిత్తూరులో కూడా ఎవరూ సంతోషించడం లేదని, మరి మిగతా జిల్లా నేతలు ఏమనుకుంటున్నారో అందరికీ తెలిసినదేనన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ప్లాన్ లేదు, యాక్షన్ లేదని ఘాటుగా విమర్శించారు.
సోనియానే తెలియదన్నవాళ్లు కాంగ్రెస్‌లో ఉన్నారు, మరికొంతకాలం పోతే కాంగ్రెస్సే తెలియదంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని కుతూహలమ్మ వాపోయారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Chances of Chiranjeevi to be CM?
- We will show the power of Hyderabad – Cong T ministers
- There will be no use with ‘Dy CM’
- Revanth Reddy, samaja bhahishkarana – Cong
- Sonia sets deadline for CM, Kiran?
- Who are Jagan’s coverts in cabinet?
- Will CM, Kiran be a CM until 2014?
- What did the Governor tell the center?
- Kandula brothers jump into Congress


Tweet This
Digg This
Save to delicious
Stumble it