Nagam is in full demand
News pulse, Politics | admin | May 26, 2011 at 2:00 pmతెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నాగం జనార్థన్‌రెడ్డిని ఆకర్షించడానికి ఆయా పార్టీలు తమవంతు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతకాలంపాటు టిడిపిలో ఉండి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న మాజీ బీజేపీ ఎంపీ జితేందర్‌రెడ్డి కొద్దిసేపటిక్రితం(గురువారం ఉదయం 11గంటలు) భేటీ అయ్యారు. టిఆర్‌ఎస్ లో చేరాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. జితేందర్‌రెడ్డి,నాగంలు వ్యక్తిగతంగా కూడా స్నేహితులేనని ,అందువల్లే కలిశారని నాగం సన్నిహిత వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
కాగా బిజేపికి చెందిన మాజీ కేంద్రమంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు కూడా నాగం జనార్థన్‌రెడ్డికి మద్ధతు ప్రకటించారు. నాగంను టిడిపి నుంచి సస్పెండ్ చేయడమంటే తెలంగాణను అడ్డుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. కరీంనగర్‌లో తెలంగాణ రణబేరి సభ జరపడం ద్వారా ఈ ప్రాంతంలో తప్పుడు సంకేతాలు వెళ్లాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు ఎబివిపి విద్యార్థి నేతగా ఉన్న నాగంకు పరోక్షంగా విద్యాసాగర్‌రావు ఆహ్వానం పలికినట్లే ఉంది. కాగా తెలంగాణకు మద్ధతిస్తే జగన్‌తో కలిసి పనిచేయడానికైనా ఇబ్బంది లేదని ప్రకటించడం ద్వారా నాగంకు ఆ పార్టీ వైపు నుంచి కూడా డిమాండ్ ఉందేమోనన్న సందేహం వస్తుంది.
అయితే ఇవన్నీ కాకుండా నాగం సొంతపార్టీ పెట్టుకుంటాడా..లేక ఏదైనా పార్టీలో చేరతాడా లేక తెలంగాణ జేఏసీతో కలిసి పనిచేస్తారా అన్నది త్వరలోనే తెలుస్తుంది.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Will Cong T politicians split?
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Did CBN change his strategy on T?
- Jagan behind me, no no – Nagam
- SKC is a luccha committee – Nagam
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it