Nagam nu veli veshnam
News pulse, Politics | admin | May 21, 2011 at 8:05 amనాగం కు మతిబ్రమించించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష ఉప నాయకుడు మోత్కుపల్లి నరసింహులు విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో ఉండి, అన్ని పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీ అధికారంలో లేనంతమాత్రాన ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని మోత్కుపల్లి నరసింహులు అన్నారు.
ఆయన వెంట ఎవరూ వెళ్లడానికి సిద్దంగా లేరని అర్దమై ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని ఏదోరకంగా బలి చేయాలని ప్రయత్నిస్తున్నారని, అది సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం జెండాతో తాము తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతామని, తెలంగాణ సాధించేవరకు పోరాడుతామని అన్నారు. సోనియాగాందీ ఇంతవరకు మాట్లాడలేదని, పిసిసి అద్యక్షుడు డి.శ్రీనివాస్ ఒక్క మాట మాట్లాడలేదని , వారి గురించి నాగం లాంటివారు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
అవసరమైతే రాజీనామాలకు సిద్దమవుతాని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు కలిసి రాజీనామాకు సిద్దమైతే తాము కూడా సిద్దమేనని అన్నారు. తాము ఇచ్చిన రాజీనామాలు నాగం సూట్ కేసులోనే ఉన్నాయని అన్నారు. శుక్రవారంనాడు తెలంగాణ ఫోరం సమావేశంలో నాగం జనార్దనరెడ్డిని వెలివేశామని, ఇంకా ఆయన గురించి మాట్లాడనవసరం లేదని, ఇలాంటి ఫ్యూడల్స్ వల్లే తెలంగాణ రావడం లేదని నలబై ఏళ్ల క్రితమే ఉద్యమం చేశానంటున్న ఈయన తొమ్మిదేళ్లు మంత్రిగా ఉన్నపుడు ఏమి చేశారని మోత్కుపల్లి ప్రశ్నించారు.వేరే పార్టీలో చేరే ఉద్దేశ్యంతోనే నాగం అవాకులు,చెవాకులు పేలుతున్నారని నరసింహులు ఆరోపించారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Nagam says he will support Jagan if…
- Did Cong T politicians set a deadline?
- Revanth Reddy, samaja bhahishkarana – Cong
- Nagam is in full demand
- Jagan’s money with Nagam Janardhan?
- Did CBN change his strategy on T?
- Another MLA gives shock to CBN
- SKC is a luccha committee – Nagam
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it