Nagam’s SMS hulchal at Mahanadu
News pulse, Politics | admin | May 28, 2011 at 10:30 pm
నాగం జనార్దనరెడ్డి మహానాడులో తన ఉనికిని చాటుకున్నారు. రాజకీయ నేతలకు ఎప్పుడూ ఐడియాలో ఉండాలి. అలా అయితేనే నిత్యం జనంలో ఉండగలుగుతారు. అలాగే మీడియాలో కూడా ప్రాధాన్యత తెచ్చుకుంటారు.అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి పార్టీలో ఉన్నప్పుడు పార్టీపై చేసే విమర్శలకు సహజంగానే ప్రాధాన్యత వస్తుంది.
సస్పెండ్ అయ్యాక పార్టీనుంచి బయటపడ్డాక ఆ విమర్శలకు అంత ప్రాముఖ్యత రాదు.అందువల్ల కొత్త ఐడియాలకు వెళ్లాలి. అలాంటి ఐడియా నాగం జనార్దనరెడ్డికి వచ్చింది. ఇంతకాలం ప్రతి మహానాడులో పాల్గొని హడావుడి చేసే నాగం ఈసారి దూరం అయ్యారు.
అయితే అలా దూరం కారాదని అనుకున్నారో,ఏమో , తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఆయన సెల్ ఫోన్ ద్వారా మెస్సేజీలు పంపించారు. తెలంగాణపై చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని ఆ ఎస్.ఎమ్.ఎస్.లో కోరారు.తెలంగాణ కు అనుకూలంగా మహానాడులో తీర్మానం చేయించాలని ఆయన ఆ సందేశంలో కోరారు. ప్రస్తుతం మహనాడు ప్రాంగణంలో ఆ ఎస్.ఎమ్.ఎస్. హల్ చల్ చేస్తున్నాయి.
మొత్తం మీద ఈ రకంగా నాగం జనార్దనరెడ్డి మహానాడులో పాల్గొన్నారన్నమాట.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Nagam says he will support Jagan if…
- Jai Telangana in TDP’s Mahanadu
- Harikrishna argues with Yanamala, exits Mahanadu
- Nagam is in full demand
- How can I join hands with Jagan?
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Jagan behind me, no no – Nagam
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it