Nara Lokesh into active politics

News pulse, Politics | admin | May 23, 2011 at 5:50 pm


చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్‌ రాజకీయ అరంగ్రేటానికి రంగం సిద్ధమవుతుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి లోకేష్‌ను ఇన్‌ఛార్జ్ చేయాలంటూ ఆ ప్రాంత టిడిపినాయకులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని చిత్తూరు జిల్లా పార్టీ సమావేశంలో పెట్టి ఆమోదించజేస్తామని చెప్తున్నారు.

ఆ తరువాత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయనతో కూడా ఒప్పిస్తామని వీరు చెప్తున్నారు. గత పదిపదిహేనేళ్లగా చంద్రగిరికి సరైన ఇన్‌ఛార్జ్ లేక టిడిపి ఇబ్బంది పడుతుందని , ఆ లోటును భర్తీ చేయడానికి నారాలోకేష్‌ అయితేనే సమర్థుడని వీరు వాదిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలు లోకేష్‌కు గానీ, చంద్రబాబుకు గానీ తెలియకుండా చేయరు. చంద్రబాబు కూడా లోకేష్ రాజకీయాల్లోకి రావడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు.

అతనికి ఆసక్తి ఉంటే అతని ఇష్టమేనని వ్యాఖ్యానిస్తూ వచ్చేవారు. పైగా కొద్దికాలం క్రితం తెలుగుదేశం వారసుడెవరు అన్న అంశంపై జూనియర్‌ఎన్టీఆర్‌, లోకేష్‌ల మధ్య పోటీ కూడా ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ను ఇన్‌ఛార్జ్‌గా పెట్టాలని చంద్రగిరి ప్రాంతనేతలు తీర్మానం చేయడానికి ప్రాధాన్యత ఉంటుంది.

Related posts:

  1. Vinay Kumar’s another attempt in politics
  2. TDP all set for No-Trust move
  3. Harikrishna argues with Yanamala, exits Mahanadu
  4. TDP challenges Jagan’s YSR Cong
  5. Jagan’s money with Nagam Janardhan?
  6. Did CBN change his strategy on T?
  7. Balanaagi Reddy drama
  8. What did KCR do for Telangana – Erraballi
  9. Kandula brothers jump into Congress
  10. I will be back to active politics – Allu Arvind

Leave a Reply

Spam protection by WP Captcha-Free