SI exams issue again
News pulse, Politics | admin | May 9, 2011 at 4:08 pmమళ్లీ ఎస్.ఐ రాత పరీక్షలపై మళ్లీ గొడవ ఆరంభమైంది.పద్దెనిమిది వేల మంది అభ్యర్దులు రాత పరీక్షలకు క్వాలిఫై అయ్యారని, వారంతా ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలవడానికి వెళ్లినప్పుడు అక్కడ ఎస్.ఐ పరీక్షలు జరపాలంటూ పలువురు విద్యార్దులు అక్కడ కలిశారని వారి గోడు వింటే బాధ అనిపించిందని రాజగోపాల్ అన్నారు. జోన్ ఐదు లో ఐదువేల మంది, జోన్. ఆరు లలో ఆరువేల మంది ఉద్యోగార్దులు ఉన్నారని, వారంతా హైదరాబాదు, పరిసర తెలంగాణ జిల్లాల వారేనని, వారంతా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. ఎందకు తెలంగాణ నాయకులు ఈ రాత పరీక్షలను వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని విద్యార్ధులు వాపోయారన్నారు.
ఫ్రీజోన్ తేల్చకుండా ఎస్.ఐ రాత పరీక్షలు నిర్వహించడానికి వీలు లేదని తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణవాదులు పట్టుబడుతున్నారు. విచిత్రంగా తెలంగాణ విద్యార్దులకే నష్టం కలుగుతోందన్నప్పటికీ వారు తమ పట్టు వదలకుండా వివాదాన్ని కొనసాగిస్తున్నారు.ముఖ్యంగా తెలంగాణ వాదులైన కాంగ్రెస్ వారు కూడా వారికి వంత పాడుతుండడంతో ప్రభుత్వం నిస్సహాయంగా మిగిలి పరీక్షలను వాయిదా వేస్తోంది.
తెలంగాణ ఉద్యమానికి, ఉద్యోగాల భర్తీకి సంబందం లేదని, ప్రతినెల ఐదు వేల రూపాయలు ఖర్చుచేసుకుంటూ కోచింగ్ తీసుకుంటూ ఇక్కడ జీవితం గడుపుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నతెలంగాణ పిల్లలకు తెలంగాణవారే అన్యాయం చేయడంలోఅర్ధం లేదని రాజగోపాల్ అన్నారు. ఫ్రీజోన్ పేరుతోనో, ఏదో ఒక అంశం పేరుతోనో తెలంగాణలో వేడి కొనసాగించడమే లక్ష్యంగా తెలంగాణ వాదులు పెట్టుకున్నారు.
వారుతెలంగాణ వారికి నష్టం కలుగుతుందో లేదో గమనించి, ఇతర ప్రాంతాల వారు జోన్ ఆరులో ఉన్నారా అన్న విషయాన్ని పరిశీలించి అభ్యంతరం చెబితే మంచిది కాని, ప్రతిదానికి అడ్డుతగిలి తెలంగాణ విద్యార్ధులకే నష్టం చేస్తే వారి సానుభూతిని ఏదో ఒక రోజు కోల్పోక తప్పని స్థితి వస్తుంది. దానిని గమనించి వాస్తవాలకు అనుగుణంగా వీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిది.
Related posts:
- We will not contest from Banswada – TDP
- Will Cong T politicians split?
- ఇంకెక్కడి సమైక్యత!
- L Rajagopal avatharaalu velladistha
- Jayashankar blessed me – Errabelli
- KK’s bheeshana keka
- T supporters pull mike from Revanth Reddy
- Nagam nu veli veshnam
- 75 lakhs release order issued for Tank Bund statues
- What did KCR do for Telangana – Erraballi


Tweet This
Digg This
Save to delicious
Stumble it