SKC is a luccha committee – Nagam
News pulse, Politics | admin | May 9, 2011 at 4:12 pm
నాగర్ కర్నూల్ లో తెలంగాణ నగారా మోగించిన సీనియర్ టిడిపి ఎమ్మెల్యే డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి శ్రీకృష్ణ కమిటీపై విరుచుకుపడ్డారు. ఏకంగా లుచ్చా కమిటీ అని శ్రీకృష్ణ కమిటీని అబివర్ణించారు. తెలుగుదేశం జెండా లేకుండానే ఆయన సభను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా పార్టీ ఆదేశాలతో నిమిత్తం లేకుండా ఇతర జిల్లాల నుంచి కొందరు టిడిపి ఎమ్మెల్యేలను. ఇతర నాయకులను ఆకర్సించగలిగారు. ఆదిలాబాద్ జిల్లా ముదోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి, పార్టీ హైదరాబాద్ నాయకుడు విజయరామారావు, హరీశ్వర్ రెడ్డి తదితరులు కూడా ఈ సభకు హాజర్యారు.తాను ఓబులాపురం అంశంలో తాను పార్టీకోసం నిలబడితే, తనతో ఎవరు కలిసి రాలేదని అన్నారు.
తెలంగాణ అంశంలో రాజీ పడే ప్రస్తక్తి లేదని, కేంద్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోయినా, టిడిపి అనుకూలంగా లేకపోయినా, రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటానని అన్నారు. ఆంద్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, ఆంద్ర పెట్టుబడి దారులకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. అందరు తెలంగాణ ఉద్యమానికి కలిసి రావాలని ఆయన పిలుపు ఇచ్చారు.తమ ఉద్యమం అహింస పద్దతిలోనే సాగుతుందన్నారు. కొందరు పార్టీ నేతలు తనపై లేనిపోనివి చెబుతున్నారని, వాటిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో తాను నక్సలైట్ నేనని ఆయన అన్నారు. కాగా ఇదే సమయంలో పార్టీ జెండా లేకుండా సభను నిర్వహించిన నాగం పై చర్య తీసుకోవాలని పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఒత్తిడి వస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Nagam is in full demand
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Jagan behind me, no no – Nagam
- Pocharam’s resignation accepted
- Kodandaram’s Delhi trips
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it