Sonia sets deadline for CM, Kiran?
News pulse, Politics | admin | May 21, 2011 at 8:29 am
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎ.ఐ.సి.సి. అధ్యక్షురాలు సోనియాగాంధీ తో భేటి అయ్యారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జీ గులాం నబీ అజాద్, సోనియాగాందీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కూడా ఈ సమావేశంలో పాల్గాన్నారు.శనివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ సమావేశం ఆరంభమైంది.కీలకమైన ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు,చేర్పులు,తెలంగాణ కు సంబందించిన అంశం, వివిధ పదవుల భర్తీ తదితర నిర్ణయాలను తీసుకోవచ్చని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్దిగా పులివెందులలో పోటీచేసి ఓడిపోయిన వై.ఎస్.వివేకానందరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తిరిగి మంత్రి పదవి ఇచ్చే విషయం కూడా చర్చకు రావచ్చు. కొత్త పిసిసి అద్యక్షుడి నియమాకం గురించి కూడా మాట్లాడవచ్చు. పిసిసి అద్యక్షుడుగా ఉన్న డి.శ్రీనివాస్ బదులు కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కిరణ్ కోరుతున్నారు.
డి.శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లకుండా హైదరాబాదులోనే ఉండడం గమనించదగిన విశేషం.వై.ఎస్.జగన్ ప్రభావం ఎలా ఉంటుంది. దానిని నిరోదించడం, జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఏమి చేయాలన్న వాటితోపాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, కిరణ్ ప్రభుత్వ పనితీరు మొదలైన విషయాలపై చర్చించి కిరణ్ కు కొత్త డెడ్ లైన్ పెట్టవచ్చు.. ఆ తర్వాత పరిస్థితి మారకపోతే సి.ఎమ్.నే మార్చవచ్చని హెచ్చరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Related posts:
- Chances of Chiranjeevi to be CM?
- Jaipal Reddy to resign for T?
- Jayasudha avoiding Jagan’s party?
- Who are Jagan’s coverts in cabinet?
- Will CM, Kiran be a CM until 2014?
- Kuthuhalamma comments on CM
- Konda Surekha on cloud 9
- Who are Telangana drohis?
- Jupally starts his Telangana yatra
- Jagan towards BJP?


Tweet This
Digg This
Save to delicious
Stumble it