T supporters pull mike from Revanth Reddy

News pulse, Politics | admin | May 25, 2011 at 3:44 pm

తెలుగుదేశం పార్టీ యువఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కరీంనగర్ లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తెలంగాణ నగారా సభలో మాట్లాడుతుండగా ఓ ఇద్దరు తెలంగాణవాదులు వేదికపైకి వచ్చి ఎవరు మాట్లాడినా ఫర్వాలేదు కానీ రేవంత్ రెడ్డి అంటే ఊరుకోమని అతని చేతిలో ఉన్న మైకును లాక్కున్నారు.

అయితే వేదికపై ఉన్న ఇతరనేతలు తీసుకొని మళ్లీ రేవంత్ కు ఇవ్వడంతో తిరిగి ప్రసంగం ప్రారంభించారు.తెలంగాణ కోసం పనిచేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో పడుకుంటే, కేసీఆర్ ఇంట్లో పడుకున్నారని ఆరోపించారు. తెలంగాణపై వారిద్దరకి చిత్తశుద్ధిలేదని, మేం తెలంగాణ కోసం ఎవరుకలిసి వచ్చినా పోరాడుతామని, మమ్మల్ని శంకిచాల్సినవసరం లేదని ఆయన చెప్పారు.

కేసీఆర్ సోనియా నాయకత్వంలో పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.భగ్గుమన్న ఉద్యమాన్ని బుగ్గిపాలు చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఒకవేళ కేసీఆర్ కు తెలంగాణపై చిత్తశుద్ది ఉంటే ఈరెండేళ్లలో ఒక్కసారి కూడా పార్లమెంట్ లో తెలంగహాణ బిల్లుపై నోరు మెదపలేదని ఆయన ఆరోపించారు. అయితే చివరగా ప్రసంగం ముగిస్తూ జై తెలంగాణ అని, ఈ వాయిస్ కేసీఆర్, సోనియాలకు వినపడాలని కోరారు.

ఇక అంతకంటే ముందే మాట్లాడిన భువనగిరి ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశానికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉందని చెప్పడానికి తెలంగాణ నగారా ఏర్పాటు చేసి, మీ ముందుకు వస్తున్నామనిచెప్పారు.

Related posts:

  1. KCR and Nagam at Cong deeksha
  2. I dare Nagendar, Mukesh to come out of Hyd
  3. Revanth Reddy, samaja bhahishkarana – Cong
  4. Jaipal Reddy to resign for T?
  5. Revanth Reddy’s stupid explanation
  6. Jagan behind me, no no – Nagam
  7. Another MLA gives shock to CBN
  8. What did the Governor tell the center?
  9. What did KCR do for Telangana – Erraballi
  10. Panthulla madhya chicchu

Leave a Reply

Spam protection by WP Captcha-Free