TDP challenges Jagan’s YSR Cong
News pulse, Politics | admin | May 27, 2011 at 4:38 am
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇచ్చిన ఆఫర్ ను స్వీకరించగలిగే ధైర్యం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఉందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం.చంద్రబాబునాయుడు దమ్ముంటే గవర్నర్ కు జగన్ కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల జాబితాను ఆ ఎమ్మెల్యేల సంతకాలతో సహా సమర్పించాలని , తద్వారా అవిశ్వాసాన్ని ప్రకటించాలని జగన్ కు సవాల్ విసిరారు.
దానికి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు శోభా నాగిరెడ్డి, అంబటి రాంబాబు, గోనె ప్రకాశ రావు వంటి వారు దానికి సిద్దపడ్డట్లుగా చెప్పలేదు. అవిశ్వాస తీర్మానం పెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీదేనని వాదించారు. కాంగ్రెస్ తో కుమ్మక్కు కావడం వల్లనే వారు పెట్టడం లేదని ఆరోపించారు. అయితే ఇక్కడ నిజంగా జగన్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో డబ్బై మంది కనుక ఉండి ఉంటే కచ్చితంగా వారు గవర్నర్ కు అవిశ్వాసం సమర్పించవచ్చు.కావాలంటే తెలుగుదేశంపార్టీని కూడా తమతోపాటు ఒకేసారి అవిశ్వాసం లేఖ ఇస్తే, రెండూ కలిపి ఇస్తే ప్రభుత్వం పడిపోయినట్లే అవుతుంది. ఎందుకంటే టిడిపిఎమ్మెల్యేలు తొంభైమంది.
జగన్ వర్గం ఎమ్మెల్యేలు డబ్బై మంది ఉంటే అప్పుడు ప్రభుత్వం మైనార్టీలోపడిపోయినట్లే. అంటే ప్రభుత్వానికి మద్దతు లేనట్లే అవుతుంది. అలా చేయగల ధైర్యం జగన్ కు ఉందా అన్నది ప్రశ్న.గోనె ప్రకాశరావు అన్నట్లు అవిశ్వాసం లేఖ ఇస్తే అనర్హులవుతారని అంటున్నారు. కర్నాటకలో కూడా ఇదే తరహా లో జరిగింది. గవర్నర్ తలచుకుంటే రెండు రోజులలో లేదంటే నాలుగు రోజులలో బలపరీక్షకు ఆదేశిస్తే అప్పుడు సాంకేతికంగా వీరికి వారం రోజుల నోటీసు ఇవ్వకుండా అనర్హులను చేసినా చెల్లదని సుప్రింకోర్టు తీర్పు ఇచ్చింది.
అందువల్ల ఆ సమస్య కూడా ఉత్పన్నం కాదు. లేదూ అనర్హత వేటు వేస్తారనుకున్నా కూడా అప్పుడు డబ్బైమందిని అనర్హులను చేశాక ప్రభుత్వం మెజార్టీలో ఎలా ఉన్నట్లు అవుతుంది. ఎందుకంటే టిడిపికి తొంభైమంది ఉన్నారు. కాంగ్రెస్ కు ఎనభైఐదు మందే ఉంటారు. ఇతరపార్టీలను కలుపుకున్నా వంద మంది కన్నా ఎక్కువ ఉండరు.ఇంకా అప్పుడు నైతికంగా గాని, సాంకేతికంగా కాని కాంగ్రెస్ కు పాలించే అర్హత ఉండదు. అనివార్యంగా మధ్యంతర ఎన్నికలు వస్తాయి. అయితే ఇక్కడే ఉంది చిక్కు. అటు కాంగ్రెస్ కాని, ఇటు జగన్ వర్గం కాని, లేదా తెలుగుదేశం పార్టీ కాని మధ్యంతర ఎన్నికలకు సిద్దంగా లేవు.కోట్లు ఖర్చుపెట్టి గెలిచిన ఎమ్మెల్యేలు మళ్లీ కోట్లు ఖర్చుపెట్టాలని భయపడుతున్నారు. అందువల్ల నేతలు ఇలా డ్రామాలు కొనసాగిస్తారు.
Related posts:
- Will Cong T politicians split?
- Split in Cong T MPs?
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Superstar Krishna into YSR cong?
- Chiranjeevi to be CWC member?
- What did the Governor tell the center?
- Balanaagi Reddy drama
- Jagan towards BJP?
- Congress ku August bhayam


Tweet This
Digg This
Save to delicious
Stumble it