Telangana Naatakaala mela

News pulse, Politics | admin | May 24, 2011 at 4:15 am

Telangana

ఈ సారి నాటక రంగంలో ఎవరికైనా విశిష్ట పురస్కారాలు అందించ తలచుకుంటే, మన తెలంగాణా నాయకులందరిని పంపించ వలెను, జురి లో చిదంబరం, సోనియా, ప్రణబ్,ఆజాద్, చిట్టా చివరగా మన మన్ మోహన్..ఉత్తమ నటుడు గోస్ టు…….. , నాటకాల కంపని, కాంగ్రెస్ , టిడిపి, సిపిఎం, సిపియి, టిఅరేస్.. మొదలైన రణ గోన భేరీలు, నగారాలు, నాగం ల హల్చల్ లు, కాంగ్రెస్స్ లో పాదయాత్రల లోల్లిలు. అరునక్క నా సామ్రాజ్యం లోకి నువ్వెట్ల వస్తవ్ అని ఒక సవాల్ విసిరింది, నేనెట్ల రాను అని అన్న ఇంకొక సవాల్ విసిరిండు ..సరికొత నాటకానికి తెర తీసిన్రు, ఇంతకీ దర్శకుడు ఎవరో తెలుస్తలేదు. ఒక వైపు ఎలక్షన్లు , వారి జాతకాలు బయట పడనే పడ్డాయి ..ఇంక మన వారి వ్యూహాత్మక మౌనాలు కొనసాగుతూనే ఉన్నవి. ఆరు వందల పానాలు ఘోషిస్తూనే అల్లాడుతున్నై, అసలు మీటింగుల తోటి, పాద యాత్రల తోటి తెలంగాణా వస్తదా? అమెరికాల అన్నలు వచ్చిన పతోక్కని తోటి మీటింగ్ పెడతారు, పార్టీల తోటి వాళ్ళ పనితోటి సంబంధం లేకుండా, ఎక్కడనో ఆశ ఉంటాదేమో బహుషా..సరే చిదంబరం చెప్పిన్రో లేకపోతె అమ్ముడు బోయిన మన నాయకులే చెప్పిన్రో చివరాకరికి జూన్ రానే వస్తుంది , ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది..సినిమా లెవెల్ల నేను చేస్తా మీటింగ్ అంటే నేన్ చేస్తా అని తెలుగు దేసపోల్లు కొట్టుక చస్తున్రు, ఒకడు జెండా అంటడు , ఇంకోడు నో జెండా అంటడు..మరి ఫరక్ ఏందో ఎవలకి తెలుస్తలేదు..చంద్రబాబు అంతటి మహనీయుడి ఫోటో పెట్టుకుని చేస్తా అంటే కూడ మద్దతు ఇస్తం, ఎంతైనా దయార్ద్ర హృదయులం కదా..నాగ సార్ ని చూస్తె కడుపు తరుక్క పోతుందీ, అయన అంత కష్ట పడి అన్డ్ల ఉండక పొతే ఏందో ఇప్పటికి అర్థం ఐతలే, పోతానికి దిక్కు లేదు ..జగన్ నయం అని మాత్రం అనకున్రి సారూ, మీ కల్మోక్తం గని, ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు మాకొద్దు, ఈ ఏడుపుగొట్టు , దగుల్బాజీ , దగాకోరు రాజ కీయాల తోటి ఎం చేయాలనో తోచక పానాలు తీసుకుంటున్నాం..

అరే మహబూబ్ నగర్ల పాద యాత్ర తప్ప ఇంక లోల్లిలు లేవా..పాలమూర్ వలస కూలీల గురించి కొట్లాడుకోవచ్చు కదా, ఆగమైతున్న చెంచు బతుకులు, ఎన్ని సమస్యలు లేవు? అవన్నీ తెలంగాణా కి సంబందించినవి కావా..ఎస్సై పరీక్షలకి ఎసరు పెడుతున్రు, మాల్లో జగన్నాటకాలు , ఎవడికి ఎం పట్టలేదు..అపుడు ఒకడే చెన్నారెడ్డి, ఇపుడు అందరు చెన్నారెడ్డి లే, ఒక్కడు ఆమరణ నిరాహార దీక్ష అనడు..ప్రజలలో చైతన్యాన్ని రగిలించాడు..పాపం పెద్ద మనుషులు , స్వాతంత్ర సమర యోధులు ఎండల పడి, తెలంగాణా అని సచ్చే ముందన్న తెలంగాణాని సూద్దామని తిరుగుతున్రు, చాల టీవిల కనపడవు ఈ వార్తలు, మన టీవిలో కూడ ఎపుడో ఒక సారి, పేపర్ల చిన్నగా ఏడనో వస్తది..కష్ట పడి మన జర్నలిస్ట్ మిత్రులు డిల్లి దాంక పొతే ఆడ కూడా మీడియా పట్టించు కోదు, ఇక ఇక్కడి ద్రామాలకి అంతు లేకుండా చూపిస్తాది ..ఎంతటి అవమానం అని కుంగుతూ క్రుషిస్తూ మన వాళ్ళు మళ్లీ వస్తారు..ఇంతకీ మనకు కలిగే పెద్ద సందేహం ఏందంటే, వీళ్ళు ఈ కళా జాతాలల్ల బడి మల్లా తెలంగాణాకి మోసం చేస్తే పోయిన పానాలకి, పడ్డ వేదనలకి ఎవరు సమాదానం ఇస్తరు? ఇపుడు నాయకులు అతి చాక చక్యంగా పక్క దారి పట్టిస్తున్నారు, మొత్తం కరీంనగర్ ని ఎడారి గా మార్చే మైనింగ్ల ఉన్న గంగుల అన్న తెలంగాణా తెస్తా అంటాడు..అన్న నీ మైనింగ్ ఆపితే మా వోల్లు దుబాయి పోవడం ఆపుతారు, జిల్లా ఎడారి కాక ముందే జర ఈ ధన దాహం ఆపరాదే, అందరం కల్సి నీకు పైసల్ ఇస్తం కాని, అసలు ఏ ఒక్క రాజ కీయ నాయకుడికి మైనింగ్ కాని, వనరుల దోపిడిలో భాగం కాని ఉండనికి వీలు లేదు, ఉంటె రాజ కీయల్లోకి రావొద్దు..మరో ‘గాలి’ గాళ్ళు తెలంగాణాల అవసరం లేదు .. ఇక్కడ కూడ మనకి తెలంగాణా కనపడది..దుబాయ్ ల ఉన్న తమ్ముళ్ళు ఒక్క తీరగా మొత్తుకున్తున్రు, పని లేక వచ్చినం అక్క, మేము ఇక్కడ కష్ట పడక పొతే అక్కడ మా అయ్యఅవ్వలు, పెళ్ళాం పిల్లలు ఆకలి సావులు సస్తరు అని..ఇట్లా అంటే ఒక పెద్ద మనిషి ఉద్యమాలు రక రకాలుగా ఉండును, అని ఒక సిద్ధాంతం పట్టుకొని వస్తారు, ఎవరినైనా గ్రామాల్లో అడుగుండ్రి తెలంగాణా అంటే ఏందో, నీళ్ళు , భూములు, ఉద్యోగాలు అని చెప్తారు..అంతే కాని, నాగం ని ఎవరు తిట్టిన్లు, అరునక్కని ఎవరు బాద పెట్టినరు, కెసిఆర్ కి జరం ఎందుకొచ్చింది అని ఎవరు అడగరు. అయిన కేంద్రం ఇపుడు డిప్యుటీ సిఎం అంటుంది, మంత్రి వర్గ విస్తరణ అంటుంది..అన్నలు యాష్కీలు, వివేక్లు, పొన్నం లు ఏమ్చేస్తారో ఏమో కాని, మల్లా రెండో ఎస్సార్సీ అని కొత్తగా తీసుకచ్చిన్రు..

చిదంబరం సారూ మా స్టాండ్ మారలేదు అంటున్రు..అన్న అన్టేందో జర అర్థం అయేటట్టు చెప్పరాదే.! ఎప్పటిదాకా మారలేదు, ఏది దాక మారింది? అందరికి అర్థం అయింది ఏందంటే మొతానికి అందరు అమ్ముడు పాయింరని, నెక్స్ట్ ఎలక్షన్ల దాక సరిపడా కలెక్షన్లు వచ్చినాయని అప్పటిదాకా మేళాలు, జాతాలు, అపుడపుడు ఆరోగ్యం కోసం కొంచెం నడవాలి కదా..రేపు మల్లా నేను కూడ మీటింగ్ పెట్టినా తమ్మి అని చెప్పల్నాయే, ఒక వైపు కేంద్రం ఏమి తెలుస్తలేదు , చెప్పేంత దమ్ము లేదు, రాజీనామాలు చేస్తాం అనేతోడు ఎవడు చేయడు..అన్ని పార్తీలోల్లు ఒక్క తానికొచ్చి కొట్లాడరు..ఇంక జాక్ లు ఉంటె..నేను ఆ విషయం మాట్లాడక పొతే మంచిది..ఎందుకు అందరి నోట్ల చెడ్డ డాన్ని కావలె, నిజం చెప్తే ఎపుడు నిష్టూరమే అన్న! పోయే పానాలు, పోతున్న భూములు, సంపద ని ఎవరూ ఆపరు, ఏందంటే మేము తెలంగాణాల మస్తు అలిసి పోఇనం అంటరు..ఎం అలిసి పోఇంరో, ఎండాకాలం ఒక్కల్లన్న ఎండల కన పడలే..చివరికి పండించిన నాలుగు వడ్ల గింజలు అమ్ముకొనే దిక్కు లేక రోడ్ల మీద పడి ఏడుస్తుండు రైతన్న, కరీం నగర్ లో అత్యదికంగా పండింది ఈసారి అని ఏడిస్తే ఏమైంది, దాసుకున్టానికి జాగా లేదు, విదేశాలకి ఎగుమతి చేయాలని ఒక్క పాట్లు పడతలేదు మనోళ్ళు..ఈ తీర్గ డబ్బులు తింటున్రు, పతోక్క నాయకుడు వాళ్ళ వాళ్ళ జాగలల్ల పేదోల్లకి కొని ఇస్తే కనీసం పెరుచేప్పుకొని నాలుగు రోజులు తింటున్రి కదా..అమ్మో అంత పెద్ద కోరికలా? నో నో , యువర్ ఆనర్, ఏదో కొన్ని రోజులన్న మావోల్లు తిండి కోసం కష్ట పడరని బ్రమ పడ్డాను, ముక్కి పొఇ, కుళ్ళి పొఇన బియ్యం పేదోల్లకి ఇయ్యక పొతే, రేషన్ షాపుల్లో మంచి గా పంపియ్యోచ్చు కదా..మళ్లీ అత్యాస? కనీసం సుప్రీం కోర్ట్ కి అయిన ఈ ఐడియా వచ్చింది, పేద వాళ్లకి పంచి పెట్టమని..

ఇక ప్రస్తుత కర్తవ్యమ్..అందరి మెడలు వంచి ఉద్యమం చేపియ్యడమే మన పని, ప్రజలు చేయరు..రాజీనామాలు చేయాలి, కేంద్రం పై వత్తిడి తేవాలి, ఏసీ రూముల్లో సల్లగ కూసుంటే తెలంగాణా రాదు, బయటికి వచ్చి, జరుగుతున్న నష్టాలను అరికట్టాలి, పోలవరంలను, ప్రానహితలను నష్టం లేకుండా పునరిద్దరించాలి..లేక పొతే, లగాంచి దంచుడే..కొట్టుడే, కొట్లాడుడే..దొరికితే దెబ్బల్ లేకుంటే తెలంగాణా తమ్మి, ఏదో ఒకటి కానియ్..అయ్యా పెద్ద మనుషులు, దయ చేసి అన్ని పార్టీలకి దూరంగా రండ్రి, డేడ్ లైన్ పెట్టండి, లేకపోతె తెలంగాణా విడిచి పొమ్మని చెప్పున్రి..నాటకాలడితే తెలంగాణా రాదు, పానాలు పోతేనే దిక్కు లేదు..రోజుకో జగాల నగారా, రణ భేరి లు, మీటింగ్లు పెడితే వస్తాదే? ఆలస్యం చేస్తే మరో అరవై తోమ్మ్మిది ఐతది..ఈసారి భయంకర మైన విప్లవ రూపాలని చూడాల్సి ఉంటుంది..

జూన్ల అన్ని పార్టీల వాళ్ళు రాజీనామాలు చేసి ఒక దగ్గరికి వచ్చి పోరాటం చేసేట్టు చేద్దాం! ఉద్యోగస్తులు తడాకా చూపిస్తాం అంటున్రు, ఎట్లా చూపిస్తారో అడుగుదాం..విద్యార్థుల అవసరం ఈ సారి లేదు, పార్టీల తోనే పని, ఒక పార్టీలోనే ఉండి వాళ్ళు వాళ్ళు నాటకాలు ఆడుతుంటే చూడడానికి ఇది సినిమా కాదు..జీవితం..

ఆలోచిన్చండ్రి..లడాయి కి సిద్దం కండ్రి..

Related posts:

  1. Ayomayam lo Azad and Co.
  2. Prajala chethila Telangana udyamam
  3. Telangana in cross roads
  4. Deeksha viraminchandi – KCR
  5. Ningi ki egasina Telangana keratam
  6. Dhaari thapputhunna Telangana
  7. Telangana Raktha Kanniru
  8. Telangana katha modhatiki vacchindhi
  9. Telangana Amaraveerulu
  10. New story ‘Jai Bolo Telangana’

Leave a Reply

Spam protection by WP Captcha-Free