Telangana Rana Ratham

News pulse, Politics | admin | May 28, 2011 at 10:38 pm

Telangana

కదిలింది కదిలింది తెలగాణ రణ రథం
ప్రత్యేక రాష్ట్ర పోరు పథం !! కది !!

సిధాంతకర్త ‘జయ శంకర’ భీష్మ పిత
తెలగాణ ‘జాతి పిత’ అయి ఆశీర్వదించగా …
ప్రచండ భాస్కరుడు ‘చంద్రశేఖరుడు’ తోడు రాగ
కొండంత అండ ‘కోదండ రాము’ సారధి ఆయె !! కది !!

తెలగాణ కురుక్షేత్ర వీర పుత్రులు ‘తారక’ ‘హరీషు’లు అశ్వముల కాగా ..
ఉద్యోగ JAC జండా పై కపిరాజు ఆయె.
వీర విధ్యార్ది JAC వీరాత్వం అలుమగా …
ఘర్జించిన గద్డరన్న గాండీవం మాయే !! కది !!

దాశరథి కవితా జోరు వారసుడు మన ‘దేశపతి’
కాళోజీ కాలానికి పునర్జన్మ మన ‘అంధేశ్రీ’
బడుగు ప్రజా నాడి ప్రతి ధ్వని మన ‘నందిని’
కవులందరు చేరి రణ శంఖము పూరించగా !! కది !!

బళ్ళెం అయి దిగదా ‘అల్లం’ రాసిన వ్యాసం
దివిటిగా మారి దారి చుపదా ‘లక్ష్మయ్య’ వాఖ్యానం
గణ గణ గంటల ఘర్జన ల మోత ‘గంటా’ చెక్రాపాణి గళం
జన నాడి జాడ ఎరిగి నగారా మోగించిన ‘నాగం’

పోరు పాట చురకత్తులు ‘రసమయీ’ ‘విమలక్క’లు
రాటు దేలిన పాటల తూటాలు మన రమా కిశోర్ లు…
సంస్కృతి కాపాడ యువత వెన్ను తట్టి లేపె మన జాగృతి ‘కవిత’ !! కది !!

కవులు కళా కారులందరు కాకలు తీరిన వీరులు
మలి దశ ఉద్యమాన మడిమలు తిప్పని యోధులు
లేరా వీరందరు మనకు..కారా ప్రత్యేక రాష్ట్ర సాధన ధీరులు
కదిలింది తెలంగాణా ర ణ రధం
ప్రత్యేక రాష్ట్ర పోరు పథం !!

Courtesy – Sudhendra Bhargava, thank you for sharing.

Related posts:

  1. Telangana thappademo?
  2. Rana, hottest ever looks – in pic
  3. TDP, Tandur Rana Bheri was a flop
  4. TDP T Rana Bheri is Samaikyavadi’s trick
  5. Will Rajini’s ‘Rana’ be stalled?
  6. Telangana increment – KCR
  7. Rana and Illeana, lip lock – in pic
  8. Batta bayalaina rahasya kutra
  9. We need development of Telangana
  10. Aagadhu Naa Telangana Poru

Leave a Reply

Spam protection by WP Captcha-Free