What did the Governor tell the center?
News pulse, Politics | admin | May 10, 2011 at 2:55 pmరాష్ట్ర గవర్నర్ నరసింహన్ కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో పర్యటించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరంతో పాటు హోంశాఖ కార్యదర్శి, ఐబి ఛీఫ్ వంటి ప్రముఖులతో కూడా ఆయన భేటి అయ్యారు. ఒకప్పుడు పోలీసు అధికారి అయిన నరసింహన్ ఐబి ఛీఫ్ గా కూడా పనిచేశారు. ఆ పాత పరిచయాలను గవర్నర్ నెమరువేసుకోవడానికి వెళ్లలేదు. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలపై ఆయన వారితో మాట్లాడారన్నది సమాచారం. అయితే ఈ సందర్భంగా తెలంగాణపై ఆయన ఏమి చెప్పి ఉంటారన్నదానిపై రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కొందరు రాజకీయ ప్రముఖులు చెబుతున్నదాని ప్రకారం తెలంగాణ ఉద్యమ తీరుతెన్నులపై ఆయన తన అంచనాలను నివేదించారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం జోరు తగ్గిందని, మళ్లీ పాత స్థాయిలో ఉద్యమం పునరుద్దరించడం కష్టమని గవర్నర్ చెప్పారని అంటున్నారు.ఒక వేళ తెలంగాణ ఉద్యమం మళ్లీ వచ్చినా దానిని నియంత్రించడం కష్టం కాదని అన్నారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కాని, కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీ ల నేతలలో కూడా దీనిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.
గవర్నర్ ను టిఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శింస్తుంటారు. కాబట్టి గవర్నర్ వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదన్నది వారి వాదన. అయితే తెలంగాణపై నిర్ణయం రాజకీయంగా తీసుకోవలసిందే తప్ప గవర్నర్ చెప్పేదానిబట్టి, ఆయన వద్దంటే ఆపేది, అవునంటేనో ఇచ్చేది కాదని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
Related posts:
- Telangana thappademo?
- KCR and Nagam at Cong deeksha
- Is KK’s proposal valid?
- Nagam says he will support Jagan if…
- Jaipal Reddy to resign for T?
- Differences between Prof and KCR again?
- T supporters pull mike from Revanth Reddy
- Why did KVP meet Governor?
- 75 lakhs release order issued for Tank Bund statues
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it