Who are Jagan’s coverts in cabinet?
News pulse, Politics | admin | May 19, 2011 at 4:05 amనల్లగొండ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లోక్ సభ సభ్యుడు రాజగోపాలరెడ్డిలపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ జగన్ కోవర్టులని ఆయన అభిప్రాయపడ్డారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి పరక్షంగా మద్దతు ఇస్తూ కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ లో పదవులలో కొనసాగుతున్నారని గోవర్ధనరెడ్డి ఆరోపించారు.
పాల్వాయి గోవర్ధనరెడ్డి గత కొంతకాలంగా వై.ఎస్.రాజశేకరరెడ్డిని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అయితే మంత్రి కోమటిరెడ్డి సోదరులు జగన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుతుంటాయి. అదే విషయాన్ని గోవర్ధనరెడ్డి బహిరంగ పరిచారు.అయితే ఇందులో జిల్లా రాజకీయం కూడా ఉంది.
గోవర్ధనరెడ్డి, ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి వంటి సీనియర్ నాయకులను పక్కనబెట్టి అప్పట్లో యువకుడైన రాజశేఖరరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఏకంగా మంత్రి పదవినే కేటాయించడం చర్చనీయాంశం అయింది. అయితే ఎన్నికల సమయంలో కూడా వెంకటరెడ్డి చక్రం తప్పి తనతోపాటు మరో ఇద్దరికి టిక్కెట్లు ఇప్పించుకున్నారు. తన సోదరుడు రాజగోపాలరెడ్డికి భువనగిరి లోక్ సభ టిక్కట్ రావడం ఆయన కూడా గెలవడం జరిగింది.దాంతో కోమటిరెడ్డి సోదరుల హవా జిల్లాలో పెరిగిపోవడం సీనియర్ నాయకులకు నచ్చడం లేదు. అయినప్పటికీ పరిసెట్టుకుంటూ వచ్చారు.
ఇప్పుడు జగన్ కు సరోక్షంగా మద్దతుదారులుగా కోమటిరెడ్డి సోదరులు ఉన్నారని ప్రకటించి వారిని ఇరుకున పెట్టాలని పాల్వయి గోవర్ధనరెడ్డి ,మరికొందరు సీనియర్లు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు జగన్ కు ఫలానా మంత్రి కోవర్టు అని బహిరంగంగా ప్రకటించింది పాల్యాయేనని చెప్పవచ్చు. గతంలో పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి మంత్రులు తాము జగన్ మనుషులమని బహిరంగంగానే చెప్పారు.
ఆ ప్రకారమే వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వారికి ఉద్వాసన చెప్పారు. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మొదటిసారిగా ఓ మంత్రిపై ఈ ఆరోపణలు రావడం విశేషం మరి ఇప్పుడు కోమటిరెడ్డి సోదరులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Nagam says he will support Jagan if…
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Jaipal Reddy to resign for T?
- Jagan gives shock to Ambati and Gone
- Kuthuhalamma comments on CM
- Jagan behind me, no no – Nagam
- Jagan towards BJP?
- New style of canvassing, do not talk
- Congress ku August bhayam


Tweet This
Digg This
Save to delicious
Stumble it