Who are Telangana drohis?
News pulse, Politics | admin | May 12, 2011 at 4:58 am
తెలంగాణ కోసం మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న మంత్రి కృష్ణారావు ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ వచ్చేదాక పిసిసి అధ్యక్ష పదవికాని, ఉప ముఖ్యమంత్రి పదవి కాని ఎవరూ తీసుకోరాదని ఆయన సూచిస్తున్నారు.
తాజాగా మెదక్ జిల్లాకు చెందిన మంత్రి దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి రావచ్చని వార్తలు వస్తున్ననేపధ్యంలో మంత్రి కృష్ణారావు ఈ ప్రకటన చేయడం గమనించదగిన అంశం. అయితే కృష్ణారావు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే రోశయ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పదవీ బాద్యతలు తీసుకున్నారు.
కాకపోతే తనకు ఇష్టం లేని దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇవ్వడం ఆయనకు కష్టంగా మారింది.దాంతో అసంతృప్తి చెంది తెలంగాణ గళాన్ని వినిపిచడం ఆరంభించారు.మంత్రి పదవికి రాజీనామా చేశామని చెప్పినా ఇప్పటివరకు దాని ఆమోదం కోసం ఆయన పట్టుబట్టకపోవడం ఒక ప్రత్యేకత. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మంత్రిగానే ఈ పాదయాత్ర చేస్తున్నారు. ఈయనను రాజ్ భవన్ వద్దకు పాదయాత్ర చేయమని కెసిఆర్ సలహా ఇచ్చి ఎద్దేవా చేశారు.
ఆయన మంత్రి పదవిలో కొనసాగుతూ మరెవ్వరిని పదవులు తీసుకోరాదని, తీసుకుంటే తెలంగాణ ద్రోహులవుతారని ప్రకటించడమే విశేషం.ఎవరు తెలంగాణ ద్రోహులో, ఎవరు కాదో తేలడం కష్టమే.
Related posts:
- Telangana thappademo?
- Harish Rao fires on Subbarami and Renuka
- Telangana politicians who did not resign, listing
- There will be no use with ‘Dy CM’
- Damodar Raja Narasimha cannot be Dy CM
- KK’s bheeshana keka
- Jaipal Reddy to resign for T?
- Jagan’s money with Nagam Janardhan?
- Did CBN change his strategy on T?
- Jupally starts his Telangana yatra


Tweet This
Digg This
Save to delicious
Stumble it