Why did KVP meet Governor?

News pulse, Politics | admin | May 16, 2011 at 3:50 pm

ప్రభుత్వ సలహాదారు కె.వి.పి.రామచంద్రరావు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ను కలిశారు.ఇది ఆసక్తికరమైన విషయమే. ఎందుకంటే రామచంద్రరావు ప్రభుత్వ సలహాదారుగా రాజీనామా చేసినప్పటికీ ప్రభుత్వం ఇంకా పెండంగులోనే ఉంచింది.కెవిపి ఈమధ్య కొంచెం అస్వస్థతకు లోనై శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రామచంద్రరావు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈయనతో పెద్దగా సంబందాలు పెట్టుకోలేదు. ఈ నేపద్యంలో గవర్నర్ తో రామచంద్రరావు బేటి అవడం సంచలనంగా ఉంది.రామచంద్రరావును గవర్నర్ పిలిచారా? లేక రామచంద్రరావు కావాలని గవర్నర్ ను కలిశారా అన్నది స్పష్టంగా తెలియడం లేదు.

రామచంద్రరావును గవర్నర్ రమ్మని ఆహ్వానించారని, కెవిపి సన్నిహితులు చెబుతుటే, గవర్నర్ సాదారణంగా ఎవరిని ప్రత్యేకించి పిలవరని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదేమైనప్పటికీ వీరిద్దరి మద్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చి ఉంటాయన్నదానిపై పలు కధనాలు వినిపిస్తున్నాయి.ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమం నేపద్యంలో కెవిపిని గవర్నర్ సలహాలు కోరారన్న ప్రచారం ఉంది.

శాంతి భద్రతల పరిరక్షణ సలహాదారుగానే కెవిపి ఉన్న సంగతి తెలిసిందే.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెవిపి కీలక పాత్ర పోషించారు. అలాగే కాంగ్రెస్ రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని అంటున్నారు. కాగా కెవిపి మాత్రం తనకు ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నది తెలియదని, తాను సలహాదారు పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారని అంటున్నారు.మొత్తం మీద రాజకీయవర్గాలలో కెవిపి, గవర్నర్ నరసింహన్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.

Related posts:

  1. CBN and his men meet Governor
  2. Jaipal Reddy to resign for T?
  3. TDP challenges Jagan’s YSR Cong
  4. Jayasudha avoiding Jagan’s party?
  5. Sonia sets deadline for CM, Kiran?
  6. PRP MLA sends his resignation
  7. What did the Governor tell the center?
  8. Pocharam’s resignation accepted
  9. No work, No Pay – AP govt.
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free