Will SKC members be arrested?
News pulse, Politics | admin | May 18, 2011 at 4:00 amజస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్యులను అరెస్టు చేస్తారా?తెలంగాణ న్యాయవాదులు కొందరు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని స్వీకరించిన కోర్టు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదును పంపించి, దానిని విచారించి కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
ఆ తర్వాత ఇప్పుడు పంజగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.సెక్షన్లు 418,504, 153(u) 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఛాప్టర్ ఎనిమిది లో అభ్యంతరకర విషయాలు ఉన్నాయని చెబుతూ లాయర్లు ఫిర్యాదు చేశారు.దీనిపై మరి పోలీసులు ఢిల్లీ వెళ్లి జడ్జి హోదాలో ఉన్న జస్టిస్ శ్రీకృష్ణను అరెస్టు చేస్తారా? అలాగే వివిద హోదాలలో ఉన్న సభ్యులను అరెస్టు చేస్తారా? వారికి నివేదిక ఇచ్చే హక్కు లేదని పోలీసులు చెబుతారా? వారు ఇచ్చిన ఎనిమిదో చాప్టర్ అధికారికంగా విడుదల కాలేదు. కాకపోతే ఒక న్యాయమూర్తి తన తీర్పులో వాటిలోని కొన్ని విషయాలను ప్రస్తావించారు. ఆ తర్వాత దానిపై స్టే వచ్చింది.
మరి ఇలాంటప్పుడు పోలీసులు ఏ ప్రాతిపదికన కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారో తెలియదు. అయితే మరి వారిని అరెస్టు చేసి తీసుకు వస్తారా? అందుకు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు అనుమతిస్తాయా? ఈ విధంగా కేసులు నమోదు చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా అనుమతించారా? ఇలాంటి ఎన్నో విషయాలకు జవాబు రావల్సి ఉంది. ఏదేమైన తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇదొక మైలురాయే. తెలంగాణ ఉద్యమకారులు ఇంతవరకు ఈ వ్యవహారాన్ని తీసుకురాగలగడమే చెప్పుకోదగిన విశేషంగా భావించాలి.
Related posts:
- Tears rolled down KCR’s eyes
- Jai Telangana in TDP’s Mahanadu
- CBN’s Heritage foods attacked
- Does Chiru know poli ‘tricks’?
- Jagan’s money with Nagam Janardhan?
- 75 lakhs release order issued for Tank Bund statues
- SKC is a luccha committee – Nagam
- Kodandaram’s Delhi trips
- What did KCR do for Telangana – Erraballi
- Why don’t they file case on Yashki?


Tweet This
Digg This
Save to delicious
Stumble it