Chances of Chiranjeevi to be CM?

News pulse, Politics | admin | June 28, 2011 at 5:31 pm

మెగాస్టార్ చిరంజీవికి కాంగ్రెస్ నేతలు కొందరి నుంచి మద్దతు లభిస్తోంది.అందులోను తెలంగాణ కు చెందిన సీనియర్ నేత వి.హనుమంతరావు నుంచి మద్దతు రావడం విశేషం. తాను కాంగ్రెస్ లో చిరంజీవి అయ్యే అవకాశం ఉందని , నిజ జీవితంలోనే ఆ అవకాశం ఉంటే,సినిమాలలో నటించడం ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ వర్గాలలో తర్జనభర్జనలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ అధిష్టానం ఏమైనా చిరంజీవికి హామీ ఇచ్చిందా అన్న అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. అదేమీ కాదు , ఏదో మాట వరసకు అన్నారులే అని మరికొందరు అంటున్నారు.కాంగ్రెస్ లో ఇలాంటి ప్రకటనలు సమస్యకు దారి తీస్తాయి. వర్గ శత్రువులను పెంచుతాయి. అందులోను కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి ఆశించే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అక్కడిదాకా ఎందుకు వి.హనుమంతరావు కూడా సి.ఎమ్.

పదవి ఆశిస్తున్నవారే.కాని అధిష్టానం అవకాశం ఇవ్వడం లేదు. అది వేరే విషయం.కొద్ది రోజుల క్రితమే బొత్స సత్యనారాయణ తన లక్ష్యం సి.ఎమ్. పదవి అన్నారు. అలాగే జానారెడ్డి,జైపాల్ రెడ్డి వంటివారు ఉండనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వి.హనుమంతరావు చిరంజీవి అన్నమాటలలో తప్పులేదని,కాంగ్రెస్ లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. లోపల ఎలాంటి అభిప్రాయం ఉన్న్పప్పటికీ ,పైకి ఈ మాట చెప్పడం కూడా చిరంజీవికి సంతోషం కలిగించే అంశమే.

Related posts:

  1. There will be no use with ‘Dy CM’
  2. Damodar Raja Narasimha cannot be Dy CM
  3. Jayasudha avoiding Jagan’s party?
  4. Sonia sets deadline for CM, Kiran?
  5. Will CM, Kiran be a CM until 2014?
  6. Chiranjeevi to be CWC member?
  7. Chiranjeevi ki inko pareshani
  8. Congress ku August bhayam
  9. Telangana increment – KCR
  10. Kandula brothers jump into Congress

Leave a Reply

Spam protection by WP Captcha-Free