Damodar Raja Narasimha cannot be Dy CM
News pulse, Politics | admin | June 5, 2011 at 2:08 pm
ఉప ముఖ్యమంత్రి పదవి వ్యవహారం కాంగ్రెస్ లో రగడ సృష్టిస్తోంది. మెదక్ జిల్లా కు చెందిన సీనియర్ నాయకుడు దామోదర్ రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని అంతా భావిస్తున్నారు.నిజానికి అలాంటి సమాచారం దామోదర రాజనరసింహకు కూడా ఉండడంతో ఆయన తనకు ఈ పదవి ఇచ్చే ప్రతిపాదనపట్ల సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా నిజామాబాద్ ఎమ్.పి మధుయాష్కి ఆయనపై వివాదాన్నిసృష్టించారు.
దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి వీలు లేదని తాము అధిష్టానానికి చెప్పామని యాష్కి ప్రకటించారు. దానికి కారణం ఏమిటంటే ఆయన సమైక్యవాది కాబట్టి ఆయనకు ఆ పదవి ఇవ్వరాదన్నది మధు యాష్కి డిమండుగా ఉంది. దామోదర రాజనరసింహకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే సహించేది లేదని కూడా ఆయన హెచ్చరించారు.
సమైక్యవాదులుగా పేరొందిన ముగ్గురు తెలంగాణ నాయకులకు పదవులు ఇవ్వరాదని కూడా తాము స్పష్టం చేశామని ఆయన తెలిపారు.మంత్రులలో ఉన్నవారు అయితే దామోదర రాజనరసింహ ఒకరుకాగా, మరొకరు ముకేష్ అయి ఉంటారు.వేరొకరు దానం నాగేందర్ కాని మరొకరు కాని అయి ఉంటారు. ఆయన పేర్లు వెల్లడించలేదు.కాకపోతే దామోదర రాజనరసిహ కు వ్యతిరేకంగా మాట్లాడడం విశేషం.
ఇక్కడ కనీసం ఆయన షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి అన్న విషయాన్ని మధుయాష్కి పరిగణనలోకి తీసుకోవడం లేదు.దామోదర సమైక్యవాది అన్న అబిప్రాయాన్ని వ్యక్తం చేసి ఆయనకు పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేశారు.
Related posts:
- Telangana thappademo?
- Chances of Chiranjeevi to be CM?
- Split in Cong T MPs?
- Nagam says he will support Jagan if…
- Damodar Raja Narasimha is ‘Dy CM’
- There will be no use with ‘Dy CM’
- Will CM, Kiran be a CM until 2014?
- Who are Telangana drohis?
- Chiranjeevi to be CWC member?
- Jupally starts his Telangana yatra


Tweet This
Digg This
Save to delicious
Stumble it