ఫ్రీజోన్ కుట్ర కొనసాగింపు
News pulse, Politics | admin | June 28, 2011 at 4:34 amఅధికార యంత్రాంగం ఉద్దేశ పూర్వకంగానే స్థానిక రిజర్వేషన్ పాటించకుండా హైదరాబాద్ పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టారు. తద్వారా సీమాంధ్ర ప్రాంతవాసులు హైదరాబాద్ పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందారు. దీంతో తెలంగాణలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.
పోలీస్ ఎసై్సల నియామకాలలో ఫ్రీజోన్ అంశం మళ్లీ వివాదాస్పదం అవుతున్నది. హైదరాబాద్ నగరా న్ని మినహాయించి ఆరవజోన్‌లోని మిగతా పోస్టులకు ఎసై్స పరీక్షలు ఆగస్టు 13, 14న నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. 2009 అక్టోబర్‌లో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణి స్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో తెలంగాణలో తీవ్ర నిరసనలు ప్రారంభమైనయి. సిద్దిపేట ఉద్యోగ గర్జనతో ప్రారంభమైన ఉద్యమం కేసీఆర్ నిరాహారదీక్షతో తీవ్ర రూపం దాల్చింది. తెలంగాణ ఉద్యమం ఉధృతికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది.
తదనంతరం మారిన పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజోన్ అంశంపై ఒక మెట్టు కిందికి దిగి, హైదరాబాద్ నగరం ఆరవ జోన్‌లో భాగమేనని ఒప్పుకొని, రాష్ట్రపతి ఉత్తర్వులోని 14ఎఫ్ క్లాజ్‌ను తొలగించుటకు గత సంవత్సరం మార్చి 18న అసెంబ్లీలో తీర్మానం చేసింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకక్షిగీవంగా దీన్ని ఆమోదించాయి. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర పరిశీలన లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి చేతులు దులుపుకుందే తప్ప, ఈ క్లాజ్ తొలగింపునకు కనీస ప్రయత్నం చేయలేదు.
నిజానికి ఫ్రీజోన్ సమస్యను సృష్టించి సుప్రీంకోర్టు తీర్పుకు కారకులు అయ్యింది సీమాంధ్ర పాలకులే. ఆరు సూత్రాలు, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో సీమాంధ్ర పాలకుల ది అడుగడుగునా వివక్షనే.వాస్తవంగా రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచే అంటే 1975 నుంచే పోలీస్ నియామకాలలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్ గా పరిగణిస్తూ వచ్చారు. ఫలితంగా హైదరాబాద్‌లో తెలంగాణకు దక్కాల్సిన ఉద్యోగాలు సీమాంవూధులు దక్కించుకున్నా రు. ఫ్రీజోన్ నెపంతో హైదరాబాద్‌లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సీమాంధ్ర పాలకుల దోపిడీకి, అక్రమాలకు వత్తాసు పలుకుతూ వచ్చారు. అది సరిపోదంటూ తెలంగాణకు సంబంధించిన కొద్దిమంది పోలీస్ సిబ్బందిపై వివక్ష చూపిస్తూ ప్రమోషన్లలో తీరని అన్యాయం చేశారు.
సీమాంధ్ర పోలీస్ ఆగడాలను తట్టుకోలేక తెలంగాణకు చెందిన కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్‌ను ఆరవజోన్‌గా పరిగణించి సీమాంధ్ర పోలీసులను బదిలీ చేసి, తమకు ప్రమోషన్లు ఇవ్వాలని 2002 లో ట్రిబ్యునల్‌ను, తర్వాత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.
రాష్ట్రపతి ఉత్తర్వులను ఆధారం చేసుకుని హైదరాబాద్‌ను ఆరవ జోన్‌గా పరిగణించి, నియమాకాలను, బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ఆధారంగానే గిర్‌గ్లానీ కమిషన్, అసెంబ్లీ కమిటీలు స్థానికేతర పోలీస్ అధికారులను బదిలీ చేసి ఆ ఖాళీలలో స్థానికులను నియమించాలని సిఫార్సులు చేశాయి. తెలంగాణ ఉద్యమానికి కొంత తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీమాంధ్ర పోలీస్ అధికారులను కొంత వరకు బదిలీ చేసింది. ఈ విధంగా బదిలీ అయిన సీమాంధ్ర అధికారులు, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు.
హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణించాలని వాదించా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో కుట్ర పూరితంగా వ్యవహరించింది. అనేక లొసుగులతో కౌంటర్‌ను దాఖలు చేసింది. ఆరుసూవూతాలు, రాష్ట్రపతి ఉత్తర్వులపై ఏ మాత్రం అవగాహన లేని గుజరాత్ రాష్ట్రానికి చెందిన న్యాయవాదిని నియమించుకుని తన వాదనలు వినిపించింది. ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చింది. ఫలితంగా సుప్రీంకోర్టు 2010 అక్టోబర్‌లో హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల ఫలితంగా ఎసై్స రాత పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. 2008లో ఎసై్స నియామకాల కోసం జోనల్ పద్ధతిన నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో హైదరాబాద్‌ను ఫ్రీజోన్ గా పరిగణిస్తూ పరీక్షలు జరపాలనుకున్నారు. ఉద్యమ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేశారు. 14ఎఫ్ క్లాజ్‌ను తొలగించకుండా పరీక్షలు జరపవద్దని తెలంగాణవాదుల డిమాండ్. కానీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తన స్వభావాన్ని బయట పెట్టుకున్నది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 14ఎఫ్ క్లాజ్ హైదరాబాద్ పోలీస్ నియామకాలకు సంబంధించినది అయినప్పటికీ, హైదరాబాద్ పోలీస్ చట్ట ప్రకారం నియామకాలు జరిగి ఉంటే స్థానిక రిజర్వేషన్ల నుంచి మినహాయింపు ఉండేది. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లో జారీ అయిన తర్వాత హైదరాబాద్ చట్టం ద్వారా కాకుండా నియామకాలన్నీ ఆంధ్రవూపదేశ్ సబ్ ఆర్డినేట్ సర్వీస్‌రూల్స్ ప్రకారం జరిగాయి. ఈ రూల్స్ ప్రకారం విధిగా స్థానిక రిజర్వేషన్ పాటించాలి. అధికార యంత్రాంగం ఈ నిబంధనలు పక్కనపెట్టి నియామకాలు చేయడం ద్వారా వివాదం మొదలైంది. అధికార యంత్రాంగం ఉద్దేశ పూర్వకంగానే స్థానిక రిజర్వేషన్ పాటించకుండా హైదరాబాద్ పోలీస్ శాఖలో నియామకాలు చేపట్టారు. తద్వారా సీమాంధ్ర ప్రాంతవాసులు హైదరాబాద్ పోలీ స్ శాఖలో ఉద్యోగాలు పొందారు. దీంతో తెలంగాణలో నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగింది.
హైదరాబాద్ పోలీస్ ఉద్యోగాలపై సీమాంధ్ర పాలకులకెందుకు మక్కువ? ఎందుకంటే.. వారి ప్రాంత పోలీసులు ఉంటే, విచ్ఛలవిడిగా భూములను కబ్జా చేసుకోవచ్చు. అక్రమ వ్యాపారాలు చేసుకోవచ్చు.వారి పోలీసులు వారికి అండగా ఉంటారు. హైదరాబాదులోతెలంగాణ ఉద్యమాన్ని వారి పోలీసులచే అణిచి వేయవచ్చు. ఇది వారి లక్ష్యం. హైదరాబాద్‌ను మినహాయించి పరీక్ష లు జరిపితే జరిగే నష్టం ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం ఎసై్స పరీక్షలు హైదరాబాద్‌ను మినహాయించి జరపాలనే నిర్ణయం వల్ల- తెలంగాణలో ముఖ్యంగా ఆరో జోన్‌లో ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్,రంగాడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల నిరుద్యోగులు హైదరాబాద్‌లో ఉన్న 250 ఎసై్స పోస్టులకు అనర్హులు అవుతారు. హైదరాబాద్‌ను మినహాయించడం ద్వారా ఆరోజోన్‌లో 70 పోస్టులు మాత్రమే ఖాళీ ఉంటాయి. పైగా హైదరాబాద్‌ను మినహాయించడం అంటే ఫ్రీజోన్‌ను కొనసాగించడమే.
అంటే ప్రస్తుతం ఖాళీలుగా ఉన్న 250 పోస్టుల ను సీమాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన పోలీస్ అధికారులను డిప్యూ ద్వారాగానీ, బదిలీ ద్వారా నింపే అవకాశం ఉంటుంది. తద్వారా హైదరాబాద్‌లో మళ్లీ ఆంధ్ర పోలీసులదే పెత్తనం. వారు తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసుకోవచ్చు. సీమాంధ్ర పెట్టుబడిదారుల అక్రమాలకు అండగా ఉండొచ్చు. ఇది సీమాంధ్ర పాలకుల లక్ష్యం.
ఎసై్స పరీక్షలు నిర్వహించొద్దు అని ఎవరు అనలేదు. తెలంగాణ ఉద్యోగ సంఘాల, తెలంగాణ విద్యార్థులు ఫ్రీ జోన్‌కు సంబంధించిన 14 ఎఫ్ తొలగించి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుని ఒత్తిడి తెస్తే 14 ఎఫ్‌ను కేంద్రవూపభుత్వం వారం రోజుల్లో తొలగిస్తుంది. ఈ క్లాజ్ తొలగింపులో ముఖ్యమంవూతి ఏనా డు చొరవ చూపలేదు. వారా నికి ఒకసారి ఢిల్లీ వెళ్లే ముఖ్యమంత్రి ఫ్రీజోన్ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంను ఏనాడూ కల వలేదు. 14ఎఫ్ అంశాన్ని త్వరగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు చిదంబరంపై ఒత్తిడి చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఒత్తిడి చేశారు. కేసీఆర్ ఫ్రీజోన్ అంశం పరిష్కారానికి కృషిచేశారు.
సీమాంధ్ర పాలకులకు మాత్రం ఈఅంశం పరిష్కా రం కావడం ఇష్టంలేదు. బహు శా ఫ్రీజోన్ సమస్య పరిష్కారం అయితే హైదరాబాద్‌పై హక్కులు కోల్పోతామని వారికి భయం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కేంద్ర పాలిత ప్రాంత డిమాండ్‌కు అవకాశం లేకపోవచ్చు. ఉమ్మడి రాజధానిగా నైనా డిమాండ్ చేసే అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఇదే పాలకులు హైదరాబాద్ ఆరవ జోన్‌లో భాగమని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. హైదరాబాద్ ఆరవ జోన్‌లోనిదైతే, వారి నిర్ణ యం ప్రకారమే హైదరాబాద్ తెలంగాణది. హైదరాబాద్ తెలంగాణలో భాగమని సీమాంధ్ర పాలకులచే అసెంబ్లీలో తీర్మానం చేయించడం తెలంగాణ ప్రజల విజ యం.రాష్ర్ట సాధనకోసం నిరంతరం పోరాడుతూనే, అప్పు డప్పుడు జరుగుతున్న నష్టాల నివారణకు సమష్టిగా కృషిచేయాలి. అందుకే 14 ఎఫ్ తొలగించిన తర్వాతనే ఎసై్స పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేయాలి. ఉద్యమించాలి.
-సి. విఠల్
(తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు)
Source – Namasthey Telangana
Related posts:
- Telangana thappademo?
- ఇంకెక్కడి సమైక్యత!
- KK’s bheeshana keka
- 75 lakhs release order issued for Tank Bund statues
- What did the Governor tell the center?
- SI exams issue again
- Kodandaram’s Delhi trips
- What did KCR do for Telangana – Erraballi
- No work, No Pay – AP govt.
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it