Jayashankar blessed me – Errabelli

Politics | admin | June 21, 2011 at 3:44 am

ఎందరినో విద్యావంతులను చేసిన వ్యక్తి జయశంకర్ అని, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వ్యక్తి జయశంకర్ అని తెలంగాణ టిడిపి పోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు నివాళి అర్పించారు. పార్టీలతో సంబందం లేదని, ఎవరు తెలంగాణ కోసం కృషి చేస్తానని చెప్పిన వ్యక్తి జయశంకర్ అని దయాకరరావు తెలిపారు..

నాలుగురోజుల క్రితం జయశంకర్ ను కలిశానని, తెలంగాణ పోరాటం చేస్తున్నందున తన ఆశీస్సులు ఉంటాయని చెప్పారని దయాకరరావు తెలిపారు. చనిపోతున్నానని తెలిసినా కూడా పోరాటంలో ముందున్న వ్యక్తి ఫ్రొఫెసర్ జయశంకర్ అనిఆయన అన్నారు. జయశంకర్ స్పూర్తితో అందరం కలిసి ఐక్యమత్యంగా పోరాటం చేసి ఆయన కన్నకలలు నెరవేర్చాలన్నదే తన విజ్ఞప్తి అని దయాకరరావు తెలిపారు. తెలంగాణ విద్యార్దులు, ఆయన ఆశయాన్ని నమ్మిన వారంతా మనోధైర్యం కోల్పోరాదని, ఆయన బాటలో పోరాడదామని అన్నారు.తెలంగాణ వచ్చేవరకు పదవులు తీసుకోకుండా ఉండి పోరాడాలన్నది తమ ఆలోచన అని ఒక ప్రశ్నకు సమాధానం గా చెప్పారు. రౌండ్ టేబుల్ పెట్టి పిలిస్తే, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు.

Related posts:

  1. We will not contest from Banswada – TDP
  2. KCR and Nagam at Cong deeksha
  3. Tribute to Prof. Jayashankar Sir
  4. Emirates T Cultural Association santhapa sabha
  5. Tears rolled down KCR’s eyes
  6. Jai Telangana in TDP’s Mahanadu
  7. Nagam nu veli veshnam
  8. SKC is a luccha committee – Nagam
  9. SI exams issue again
  10. Kodandaram’s Delhi trips

Leave a Reply

Spam protection by WP Captcha-Free