Jayashankaraa, nee aalochanale maa aayudhaalu
News pulse, Politics | admin | June 29, 2011 at 5:21 pm
జయ శంకరా!
త్యాగాల గడ్డ ,
పోరాటాల అడ్డా
వో(పో) రుగల్లు బిడ్డ..
ఒంటరిగా తెలంగాణా శిలువ
మోసి మోసి అలసి పాయినవా తండ్రి!
నెత్తురోడు తున్న ఈ నేల
శవాలను మోయలేక
కుంగి పోతున్న తల్లిని చూడలేక
కంటి మీద కునుకు లేకుండా
కొవ్వొత్తి లెక్ఖ కరిగి పోయినవా అయ్యా!
పోరాట యోదుడివై
తెలంగాణా జాతికి
ఉద్యమాక్షరాలు దిద్ది
గడప గడపకి
వీర తిలకం అద్ది
బిడ్డలని ఉద్యమానికి ఉసిగొల్పి
చిరకాలపు వాంచ
చివరికోరిక అయినా
చూడకుండా పోయినావ!
నువ్వు చేసిన బొమ్మలే
తాయారు చేసిన యోదులే
ని ఇంటి వారసులే
గుండెలో తూట్లు పొడుస్తుంటే
ఉక్కిరి బిక్కిరి అయి ఊపిరి ఆగి పోయినదా !
చివరికి నీ మరణం కూడా
వృధా పోలేదు తండ్రి!
నువ్వు లేని బాధని తట్టు కోలేక
నీ కడసారి కోరికను కూడ
తీర్చలేకపోయిన దుఖం తో
సిగ్గుతో, పౌరుషంతో
ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి
నువ్వు రగిల్చిన ఈ నిప్పుల కుప్పలు
అగ్గి రగల్చడానికి ,
యుద్దానికి సిద్దం అయినం
మాకు తెలుసు..నువ్వు మమ్మల్ని
విడిచి పోలేదని..
నిరంతరం వెన్నంటే ఉంటావని
తెలంగాణా సాధించే వరకు
నీ నిబద్దత దివిటీలతో
న్యాయం జయించేవరకు
మా గుండె చప్పుడై ఉంటావని
చెరిగి పోనీ నీ చిరునవ్వే
నీ సిద్దంతాన్నే ఆయుధంగా
మలచుకొని ముందుకు సాగుతున్నం..
ఆశీర్వదించు తండ్రి!
అప్పటిదాకా ఏడనో ఒక్కాడ పైలంగుండు!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Resignations are not valid – Assembly Speaker
- Deeksha viraminchandi – KCR
- Prantheeya Mandali? Dy CM in Delhi
- Eulogy on Prof. Jayashankar – ఏమైతవు నువ్వు నాకు
- Vinay Kumar’s another attempt in politics
- Nirantharam paarey Netthuti Dhaara
- Vi ‘grahala’ vidwamsam
- Banchan kaadu Doraa… Baakulam
- Aakari poratam
- CBN, kottha vesham


Tweet This
Digg This
Save to delicious
Stumble it