L Rajagopal avatharaalu velladistha

News pulse, Politics | admin | June 24, 2011 at 7:20 am

విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకున్నట్లు రుజువు చేసినా తాను ఏ శిక్షకైనా సిద్దమేనని కరీంనగర్ లోక్ సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. తాను రాజగోపాల్ నుంచి ఆర్ధిక సాయం పొందినట్లు ఆరోపించారని, దానికి ఆధారాలు చూపాలని ఆయన డిమాండు చేశారు. తెలంగాణ నాయకులు అందరికి తాను సలహా ఇస్తున్నానని, ఎవరూ కూడా వ్యాపారులు, పెట్టుబడిదారుల నుంచి డబ్బు తీసుకోవద్దని ప్రభాకర్ సలహా ఇచ్చారు.

రాజగోపాల్ లేనిపోని ఆరోపణలు చేస్తూ లగడపాటి వ్యవహారాలపై రోజుకు ఒక ఆరోపణ చేయబోతున్నానని, రాజగోపాల్ పై విజయవాడ నుంచి తనకు అనేకమంది సమాచారం పంపుతున్నారని ఆయన అన్నారు. ఒక రోజు నిత్యానంతస్వామిలా, మరో రోజు హర్షద్ మెహతాలా, ఇంకో రోజు రాజకీయ బ్రోకర్ గా, వేరొక రోజు మామ ఉపేంద్రను ఇబ్బందిపెట్టిన విషయంపై అనేక విషయాలను చెబుతానని లగడపాటి అన్నారు. రాజగోపాల్ తాను పెట్టుబడిదారుడా? ప్రజాసేవకుడా అన్నది తేల్చాలని అన్నారు.ఇలాంటి పెట్టుబడిదారులు రాజకీయాలలోకి రావడం వల్లనే రాజకీయాలు అవినీతిమయం అయిపోతున్నాయని ప్రభాకర్ విమర్శించారు.దీనిపై పార్టీ వేదికలపై మాట్లాడతానని అన్నారు.తన సోదరుడు అర్హతలు ఉండబట్టే హైకోర్టులో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ పదవి ఇచ్చారని ప్రభాకర్ చెప్పారు.

Related posts:

  1. I dare Nagendar, Mukesh to come out of Hyd
  2. Chances of Chiranjeevi to be CM?
  3. Prof. Kodandaram doubts center’s stand
  4. Did Cong T politicians set a deadline?
  5. Jai Telangana in TDP’s Mahanadu
  6. Jagan gives shock to Ambati and Gone
  7. SKC is a luccha committee – Nagam
  8. SI exams issue again
  9. Jagan towards BJP?
  10. CM bows down to pressure from ministers

Leave a Reply

Spam protection by WP Captcha-Free