Nagam says he will support Jagan if…
News pulse, Politics | admin | June 27, 2011 at 6:30 pmతెలంగాణ విషయంలో వై.ఎస్.జగన్ మద్దతు తెలిపితే ఆయన పార్టీని కూడా ఆదరిస్తామని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధనరెడ్డి బృందం వ్యాఖ్యానించింది.తాము జూలై మూడు,నాలుగు తేదీలలోచేపట్టిన నిరశన దీక్షకు మద్దతుగా ఆయా పార్టీలవారిని కలుస్తున్నామని నాగం జనార్ధనరెడ్డి, హరీశ్వర్ రెడ్డి చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ కోసం ఏ రాజకీయ పార్టీ ముందుకు వచ్చినా ఆ పార్టీతో తాము పనిచేస్తామని నాగం చెప్పారు. ఇదే సందర్భంలో జగన్ పార్టీ గురించి ప్రస్తావన రాగా నాగం, హరీశ్వర్ రెడ్డిలు ఈ వ్యాఖ్య చేశారు. జగన్ తో నాగం జనార్ధనరెడ్డి బృందం సంబంధాలు పెట్టుకుందని టిడిపి నేతలు ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలో వీరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే తెలంగాణ కోసం మాత్రమే తాము రాజకీయ పార్టీలతో పనిచేస్తామని, తమ రాజకీయ భవిష్యత్తు కోసం కాదని నాగం అంటున్నారు.
నాగం బృందం తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావును కలిసిన సందర్భంలో ఆయన వీరిని తన పార్టీలోకి ఆహ్వానించారు.కాని వీరు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.అయితే ఇప్పటికిప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకునే కన్నా, మరికొంతకాలం వేచి ఉంటే బెటర్ అని వారు అనుకుని, ఇప్పుడు తాము ఏ పార్టీలోకి వెళ్లబోమని ప్రకటించారు.అయితే ఇంతకాలం తెలుగుదేశం సభ్యులుగా ఉన్నంతకాలం జగన్ పార్టీని ఒక శత్రుపక్షంగా భావించిన నాగం జనార్ధనరెడ్డి ఇప్పుడు తెలంగాణ ప్రకటిస్తే మిత్ర పక్షంగా పరిగణించడానికి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇప్పుడున్నపరిస్థితులలో తెలంగాణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలత వ్యక్తం చేస్తే, టిఆర్ఎస్ కన్నా, జగన్ పార్టీనే బెటర్ అని వీరు భావిస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది.అయితే నాగం గతంలో వై.ఎస్.ఆర్.పై అనేక విమర్శలు చేసిన నేపద్యంలో అది సాధ్యమా అన్న సందేహం వ్యక్తం అవుతుంది.
రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Jagan’s loyalist Gone, dumps Jagan?
- Nagam is in full demand
- Jagan’s money with Nagam Janardhan?
- Nagam nu veli veshnam
- Who are Jagan’s coverts in cabinet?
- Jagan behind me, no no – Nagam
- Another MLA gives shock to CBN
- SKC is a luccha committee – Nagam
- Did Nagam get off the cycle?


Tweet This
Digg This
Save to delicious
Stumble it