Ningi ki egasina Telangana keratam

News pulse, Politics | admin | June 22, 2011 at 4:10 am


పోరాటం తప్ప మార్గం లేదు! ఉద్యమానికి విశ్రాంతి లేదు!(1934 -2011 ) ప్రో. జయశంకర్-తెలంగాణా- ఉద్యమం విడదీయలేని అంశాలు, పదాలు..అద్యాపకులు, ఆర్థిక వేత్త, సిద్ధాంత కర్త, రాజకీయ విశ్లేషకులు, రచయితా, వక్త..త్యాగాల బాటలో నడిచినా జాతి రత్నం. తెలంగాణా ని ఒక సమస్య గా చూసినపుడు గుర్తొచ్చే పెద్ద మనిషి,సమస్య కాదు పరిష్కారం అని చెప్పే మనిషి .. ఆంధ్ర వాళ్లకి కూడ అర్థమయ్యే రీతిలో అయన మాటలు, రచనలు, పనులు. ఇవాళ కనపడే ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నేతలు తెలంగాణా ఉద్యమాక్షరాలు నేర్చుకుంది అయన ఒడిలోనే. అసలు తెలంగాణా అంటే ఏమిటో తెలీని వాడికి కూడ, అయన మాటలు ఒక్క సారి వింటే చాలు, ఉద్యమ స్పూర్తి తన్నుకుంటూ వస్తుంది. చిన్నపుడు జయశంకర్ సార్ దగ్గరకి పోవాలంటే భయం, దూరంగా ఉండి చూసే వాళ్ళం, వినే వాళ్ళం, కొద్దిగా అడుగులు వేయడం నేర్చుకున్నాకా అయన చెప్పే మాటల కోసం ఎంతో ఆత్రుత..మరింత తెలంగాణా పై అవగాహనా నేర్చుకున్నంక , ప్రతి మీటింగ్ లో సార్ తెలంగాణా వస్తుందా? వరుస పట్టి అడిగే వాళ్ళు ఎందరో నాలాగ. ఒక చిరునవ్వు, ఒక అర్ద్రత, ఒక భరోసా, ఒక ఆశ..ఆయనే జయ శంకర్ సార్! తప్పకుండ వస్తుంది! ఇదే ప్రశ్న, సమాధానం ఎన్ని సార్లు అడిగామో, విన్నమో గుర్తు లేదు..కాస్త మనసు కుదుట పడేది. ఎన్నో విషయాల పై కొద్దిగా తెలిసి, కొద్దిగా తెలియకుండా సగం అర్థ మైనపుడు , తప్పకుండ తలచు కొనే మనిషి సార్. ముల్కి , 1969 ఉద్యమం, నిజాం రాజులు, చెన్నా రెడ్డి రాజకీయాలు, , ఫజల్ అలీ కమిషన్ , కెసిఆర్ పై అనుమానాలు , కాంగ్రెస్ దాగుడు మూతలు..ఒకటి కాదు రెండు కాదు..తెలంగాణా కి సంబందించిన ఏ విషయ మైన..తెలుసుకోవాలంటే -సార్! ఇంక విశేష మైన గుణం, అన్ని రకాల వారికి అయన అనుభవాలు ఒక వరం, ఒక ఆసరా. అవును, తెరవెనుక ఉండి నడిపించారు ఉద్యమం అనే వాళ్ళు కొందరైతే, అయన లేకపోతె ఉద్యమమే లేదు అనేవాళ్ళు ఎందరో.

కొద్ది రోజుల క్రితం జయ శంకర్ సార్ కి కాన్సర్ అన్న వార్త ఎంతో భయాన్ని కలిగించింది. ఆయనకు కాన్సర్ వచ్చినందుకు కాదు, కనీసం, అయన పోయే లోపట అన్న తెలంగాణాని చూసి పోతాడా అని! తెలంగాణా లో అతి ముఖ్యమైన వారు, జీవితాన్ని అంకితం చేసిన వారు, నిరంతరం తెలంగాణా కొరకు తపించి శ్రమించే వారు, తన జీవితం, మాట, తపన అంత తెలంగాణా కోసమే అని లేక్ఖలు వేస్తె మొట్ట మొదటి వ్యక్తీ జయశంకర్ సరే అని చెప్పాలేమో..అలసి పోకుండా, నిరాశ పడకుండా, నిరంతరం తెలంగాణా కే అంకితమైన మహోన్నత మైన వ్యక్తీ! నడుస్తున్న చరిత్ర.

ఈరోజు, కన్నీళ్లు పెట్టని వాళ్ళు, లోలోపట బాద పడని వాళ్ళు లేరేమో, ఇవాళ తెలంగాణా చిన్నబొఇనది , పానం ఉసూరు మంటున్నది..ఇంకా కొన్ని రోజులన్న ఉంటె తెలంగాణా కళ్ళ చూస్తుండేనేమో..ఇట్లా చూడ కుండ పొఇన వాళ్లకి ఏమని పిస్తదో పాపం! ఎవడికి ఈ పాపం తగులుకుంటది? మన ఇంటి దొంగలే కదా? వాళ్ళు ఏరూపంలో ఉంటారు? ఇన్ని అసలు పెట్టుకున్న వాళ్ళు చావు బతుకుల్లో ఉన్నాకూడా, చని పొఇన వాళ్ళ సంక్య వందల్లో దాటుతున్న కూడ జాలి కాని, పౌరుషం కాని రాదు కదా! హనమకొండ పట్టణం ఒక శూన్యానికి లోనైంది. ఏకశిలా పార్క్ జనం తో నిండి ఉంది. రాజకీయ నాయకులు, విద్యార్థులు, కళాకారులు, అద్యాపకులు, అనేక మంది తెలంగాణా వాదులు..రా లేని వారు, రాని వాళ్ళు లేరేమో, చివరి చూపుకు ఉన్న ప్రత్యేకత అదేనేమో. ఒకరిని ఒకరు ఒదార్చుకుంటూ పలకరింపులు, దుక్కాన్ని పంచుకుంటూ , దూరమైన వాళ్ళు కూడ దగ్గరైతూ..గతాన్ని నెమరేసుకుంటూ..ఎవరు చెప్పినా ఒకటే మాట, తెలంగాణా కై వెనుతిరగకుండా పోరాడిన సైనికుడు, ముచ్చటైన మూడు తరాలు, అన్ని రకాల ఉద్యమ ధోరణులు ప్రత్యక్షంగా చూసి,పాల్గొన్న వ్యక్తీ. తెలంగాణా ఉద్యమంలో మకుటం లేని మహారాజు. ఏది ఆశించని మహా మనిషి. అసలు తెలంగాణ లక్షణాలు అంటే ఇవే, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణం పొఎ వరకు కొట్లాడడం.. న్యాయం వైపు నిలబడడం. అవును రేపటి చరిత్రలో ఆయ లేకుండా పోవచ్చు, కొద్ది మందే తెలంగాణా చరిత్రని ఆక్ర మించు కోవచ్చు..అయిన ఇప్పటి తరం ఎప్పటికి నివాళిలు అర్పిస్తూనే ఉంటది. సీమాంద్ర చేసిన తప్పులు మనం ఎపుడు చేయము..మన చరిత్రని, ఉద్యమ కారులని భద్రంగా దాచుకుంటాం, బావి తరాలకి అందిస్తాం..

మద్దెల సూరి, ఫ్యాక్షనిస్ట్ హత్య మీడియాని కదిలిస్తుంది…లైవ్ కెమెరాలు, రోజుల తరబడి చర్చలు ..అవును ఆంధ్ర కెమెరాలు, అపుడపుడు చిన్న స్టోరీలు , చూడాలి ఏ మాత్రం ఈ తెలంగాణా తేజం కి నివాళులు అర్పిస్తారో..

కాకతీయ విద్యార్థులు కాంగ్రెస్ దగా కోరులని ఆఖరి చూపు కి అర్హత లేదని అడ్డుకున్నారు, అవును అడ్డుకోవాల్సిందే, తెలంగాణా రాకుండా ఆలస్యం చేసినందుకు, ఆరు వందల ప్రాణాలు గాల్లో కలిసినా ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నందుకు..ఇప్పటికి ..ఇప్పటికి కూడా నోరు విప్పనందుకు. ఉద్యమాల గడ్డ ఉస్మానియా మూగ పోఇనా, కనీసం మలి దశ ఉద్యమం లో అయినా మళ్లీ ఒక కెరటం గా, తెలంగాణా వచ్చే వరకు పోరాదతారేమో! ఇప్పటికైతే కనీసం కాకతీయ పౌరుషం తెలంగాణాకి మేమున్నాం అని వెన్ను దన్నుగా నిలబడింది.

బాద, ఉక్రోషం, కోపం..నిరాశతో నిండిన క్షణాలు! అమర్ హై! జయ శంకర్ సార్ అమర్ హై! వినిపిస్తున్న గొంతులు, పాటలు, మీడియా కోసం మాటలు..నేతల నివాళులు, కార్య కర్తల నినాదాలు! ఏకశిలా పార్క్ చేసుకున్న పుణ్యం..

సుద్దాల అశోక్ గళం లోంచి జలువారుతున్నారు సారూ..

“నీకు లేదు అస్తమయం, తెలంగాణా భాస్కర! జయ శంకరా..నీ స్వప్నం, యజ్ఞం నెరవేరే తుది సమయంలో ,

ఎకాకులను చేసి వదిలి వేళ్ళ లేదు మమ్మల్ని, ఏకం చేసావు నాలుగు కోట్ల ప్రజల గుండెల్ని

నీకు లేదు అస్తమయం..జయహో జోహార్ జయ శంకర! తెలంగాణా భాస్కర..నీకు లేదు మరణం!

ఇపుడున్నది ఒకటే కర్తవ్యం, నేథలకి చివరి కోరికను కూడ తీర్చ లేని మన ఉద్యమ నేపద్యాన్ని సమీక్షించుకొని, దొంగలకి, దగాకోరులకి దెబ్బ పడేలా, కనీసం భయం కలిగేల, తెలంగాణా ఇవ్వక తప్పని పరిస్తితి కల్పించ కుంటే..ఇంకా ఎన్ని మారణ మృదంగాలు వినాల్సి వస్తుందో. మన బాధ్యతని గుర్తు చేస్తూ, మనకి వెన్నంటి నిలిచిన వాళ్లకి మనం ఇచే ఘన మైన నివాళి..అయన ఆశయాలను సాధించడమే!

జోహార్ ప్రొఫ్. జయశంకర్ కి!జోహార్ జోహార్!

అశ్రు నయనాలతో..

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Rajakeeya ‘Laphangilu’
  2. Ayomayam lo Azad and Co.
  3. Prajala chethila Telangana udyamam
  4. ‘Andhra’ bhavan arachakam
  5. Samaikyandhra – oka portatam kadu, it is a poti
  6. Telangana in cross roads
  7. Dhikkaristhunna Telangana – Deeksha Telangana
  8. Telangana Naatakaala mela
  9. Exams are done, now summer vacation?
  10. Telangana katha modhatiki vacchindhi

Leave a Reply

Spam protection by WP Captcha-Free