Prantheeya Mandali? Dy CM in Delhi
News pulse, Politics | admin | June 28, 2011 at 4:37 amజాక్ ల డేడ్ లైన్లు-కాంగ్రెస్ డేడ్ లైను????? అరే మజాక్ చేస్తున్నరెంది రా భై, మీకళ్ళకి మేమంతా బేకార్ గాళ్ళ లెక్ఖ కనపడుతున్నామా? ఇయాల , రేపు అనుకుంట ఎన్నేండ్లు సాగ తీస్తారు? ఉవ్వెత్తున లేచిన పోరాటాన్ని జాక్ అని పేరు పెట్టి , మసి పూసి మారేడు కాయ చేసి, పనికి రాకుండా, పక్కన పెడ్తిరి. ప్రజలు సిద్దంగా ఉన్న కూడ, హింస , అహింస అనుకుంట కొత్త కొత్త పేర్లు పెట్టి ఎడేసిన గొంగళి ఆడనే ఉన్నట్టు చేస్తిరి. మేదావుల్లార , రాజకీయ విశ్లేషకుల్లార , ఉద్యమ రధసారదుల్లార, జర ఒక్క సారి ఇతర రాష్ట్రాల ఉద్యమాలు చూడండి, చదవండి..అవి ఎంత వత్తిడి తీసుకు వస్తే ఫలితాలు సాధించాయో మీకు అర్థం అవుతుంది. ఇన్నేండ్ల పాలనలో మాకు మిగిలింది కన్నీళ్ళే, శవాలు మావి, కేసులు మావి, ఇరిగిన బొక్కలు , చిందిన రక్తం మాదే..శవాల మీద పేలాలు ఏరుకునే మీలాంటి కుటిల నాయకులని నమ్ముకొని మా చావులన్ని వృధా అయితున్నాయి. మీకు ఎట్లా చెప్పాలే, మా లొల్లి మాకు వోదిలేయండ్రి అంటే మా మద్యల దూరి పైసలు ఇచ్హి , పదవులు ఇస్తామని చెప్పి మమ్మల్ని ఆగం ఆగం చేస్తిరి. మ్మేరేమన్న తక్కువ తిన్నార అన్ద్రోల్ల కంటే?
మానోడిని మనం ఏమనొద్దు అని మా నోటికి తాళాలు ఇస్తే, నిజం దాగుతుందా అన్నల్లార! ఇది పిల్లలను పోగొట్టుకున్న కడుపుకోత, రక్త సంబదీకులని దూరచేసుకున్న గుండె కోత, అన్నిటి కన్న ముఖ్యంగా మీరు చేస్తూన్న మోసాలను చూస్తూ తట్టు కోలేక పడుతున్న నరక యాతన. ఒక్క ప్రకటన వినంగానే ఆంధ్రోల్లందరూ, పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేసిన వాళ్ళు గొప్ప వాళ్లా? పార్టీలకు అతీతంగా దొంగ ఏషాలు ఎసి ఉద్యమాన్ని నీరు కారుస్తున్న మీరు గొప్పనా? , ఇన్ని పానాలు పోఇనా ఇంకా మిమ్మల్ని మోసి మోసి పున్డ్లుకాస్తున్న మా శరీరాలు గొప్పవా? అవును మాకు సిగ్గులేదు, మీరు రాజీనామాలు చేస్తే మళ్లీ లక్షల వోట్లతో గెలిపిస్తము అనే కాడికి దిగ జారినము. మల్లా కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నా, భూములు పోతున్న, వలసల వారసత్వం కొనసాగుతున్న, గుట్టలు పుట్టలు కూడ వదలకుండా మీరు మా కడుపు కొడుతుంటే చూస్తూ ఉండడానికి ముందుగాని మా చావు పత్రాల్ని మీకు రాసిస్తం అని చెపుతున్నాం..అయినా మనసు కరుగుత లేదు కదా!
అయ్యల్లారా ఒక్క మాట చెప్పుండ్రి, మేము మిమ్మల్ని ఎందుకు బతిమిలాడాలె? మీకు బాద్యత లేదా? మీరు ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు కాదా?మా వొట్లతోటి కాదా మీరు గెలిచింది. ఎన్ని సార్లు రాజీనామాలు చేస్తే, నెట్టిన పెట్టుకొని గెలిపియ్యలేదు..మీరు గెలవాలని కూడ మొక్కుకొని పానాలు తీసుకున్నాం..మరిచి పాయింరా! సక్చిపొఇనొల్ల ఆత్మ ఎంట తల్లడిల్లుతుందో.. మీరు ఉద్యమాలు చేయకండి కాని కనీసం మాకు అడ్డు రాకండి. ఇవాళ మనోడు, పరాయోడు , దొంగేవడో దొర ఎవడో తెలుస్తలేదు. ఎన్ని మోసాలు చేస్తారు ఇంకా? అవును మా అమాయకత్వమే మిమ్మల్ని కాపాడుతుందని మీకు తెలుసు, మా ప్రేమాభిమానాలని తూకం వేసి అమ్ముకోవచ్చు అనుకుంటున్నారు..అనుకొన్నారు. కాని మాకు కోపం వస్తే ఏమైతదో వొక్కసారి అలోచిన్చిన్రా? బహుషా: మీరు కలలో కూడ ఊహించక పోవచ్చు. మా పోరాటాలు మీకు తెలవదా? మా నాయకులు అమ్ముడు పాయినంత మాత్రాన ప్రజలు అమ్ముడు పోతారు అనుకోవద్దు. తెలంగాణా ఇస్తే ఏమైతదో మా దోపిడీ నాయకులకు తెలుసు అందుకే మొసలి కన్నీళ్లు మాదగ్గర కారుస్తూ, తిట్ల పురాణాలతో పొద్దు గడుపుతున్నారు.
ఎన్టిఆర్ బొమ్మ పగల కొడ్తే మా టిడిపి తెలంగాణా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఆ పెద్ద మనిషి ‘ఆంధ్ర బుద్దుడు’ అని పొగిడే అతి వీర ఆంధ్ర అభిమానుల్లార! మీరెట్ల తెలంగాణా వాళ్ళు ఐతారు? కొంప దీసి మానాయకులు మీరు రాజీనామా చేస్తే కూడా మెజార్టీతో గెలిపిస్తామని మాటిస్తారో ఏమో..మా ఖర్మ! జాతి కోసం అంకితం అయిన నా అన్న తమ్ముళ్ళని ఏమంటారు మీరు? మీలాంటి వాళ్ళని వదిలివేసి వాళ్ల అమాయక పానాలు తీసుకున్న పిచ్చి పోరగాల్లని ఎమానల్నో కూడా చెప్పుండ్రి జర.
పదవులు కాదు ప్రాంతం అంటే మా వోనికి డిపుటి సిఎం ఇస్తిరి. దీంట్ల ఏదో కుట్ర ఉంది అనుకోక ముందే ఇయ్యాల ప్రణబ్ తో కూసోని రహస్య మంతనాలు జరిపినాడు ..ఆంధ్ర చానల్లు ఇక తెలంగాణా రానట్టే అని మళ్ళా విషం కక్కు తున్నాయి. కాంగ్రెస్ బతికి బట్ట కట్టాలని చూస్తుంది అట. నా తల్లి తెలంగాణా తోడు, అట్ల ఇట్లా చేసి ఈసారి కూడ మోసం చేస్తే, బజాట్ల నిలబెట్టి బట్టలూడ దీసి కొట్టకపోతే చూడున్ద్రి. మీ కులం, ప్రాంతం మాకు అనవసరం..మా పానాలతోని, మా ఆశలతోటి ఆడుకుంటే మాత్రం ఇంకా ఊరుకొనేది లేదు.
జీవితంలో ఒకసారో రెండు సార్లో మోసపోతారు కాని మళ్లీ మళ్లీ అంటే కష్టం. ఇప్పటికే దశాబ్దం దాటింది, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరని ఇపుడిపుడే అర్థం ఐతుంది. తెలంగాణా అంటే వోట్లు, సీట్లు కాదు..అని చెప్పే రోజులు దగ్గర బడినాయి . వీడు చేస్తడు, వాడు చేస్తడు అని చూసే వోపికలు కూడ లేవు ఇపుడు. ప్రజలు పిచోళ్ళు అని అనుకుంటే మాతం పొరపాటే బ్రదర్! మళ్లీ మండలి అని, 2014 అని పొడిగిస్తే మాత్రం మాకు ఈ జాక్లు అక్కర్లేదు, మా పార్టీలు అసలే వొద్దు. ప్రజలే పోరాటం చేసుకుంటారు. ఇపుడు మాయావతి, మమత, అడ్డం కాదని తేలింది. నాగం అన్న రాజీనామా చేయడు అంట కాని, నిరాహార దీక్ష చేస్తాడంట, అయినా పరవాలేదు, ఏదో ఒకటి చేస్తా అంటుండు. మరి మీరు పెట్టిన డేడ్ లైన్లు ఏమైనాయో మాకు తెలుస్తలేవు. అసలు మేము పోరాటాల గడ్డ తెలంగాణాల ఉన్నమా లేక ఆంధ్ర ప్రాంతంల ఉన్నమా అని కూడ అనుమానం వొస్తుంది. ఆఖరికి ఇంత దిగజారింది మా బతుకు.
ఇపుడు రాళ్ళతో కొట్టి, చెప్పులు ఇసిరేసి, దుమ్మెత్తి పోస్తున్న కూడ మీకు సిగ్గు వస్తలేదు అని అర్థం అయింది. ఈ సిగ్గులేని నాయకులు మాకు రేపు కూడ అవసరమా? ప్రజలను కాపాడుకోలేని, ప్రాంతాన్ని ఎలుకోలేని నపుంసకులు ఇంకా మాకు వొద్దు అనే రోజులు కూడ దగ్గరలో ఉన్నాయి. పోలేపల్లిల పేద, చదువు రాని ప్రజలు భూములు పోతున్నయి అని నిరసనగా రాజకీయాల్లో నిలబడి మంచి వోట్లు తెచ్చుకున్నారు..ఈసారి తెలంగాణాల గల్లి గల్లి ల నుండి నాయకులు తయారు అయి, రాజకీయాలలో నిలబడి, కొత్త రక్తం తెస్తరేమో చూడున్ద్రి. మీకు కొత్త ఆలోచనలు లేకపోతె, రాకపోతే ప్రజలే చూసుకుంటారు ప్రత్యామ్నాయాలు. ఇపుడున్న పడి మంది మా నాయకులు కూడ భూస్తాపితం కాకా తప్పదు.
చివరిగా, సోనియమ్మ మౌనం, రాజీనామాలు చేయలేని దద్దమ్మలను ఏమి అనలేని , చేయలేని ఉద్యమ పార్టీలు, వేదికలు అన్ని కూడ మాకు సమానమే. ఒకడిని ఒకడు తిట్టుకోనేకంటే, రోడ్ల మీద పడి ఉద్యమాలు చేయండ్రి. పొఇన పానాలు మీకు హింస లాగ కనపడత లేవా, ఇక్కడ పొట్ట గడవక దేశాలు పట్టుకొని పోయి, శవాలుగా మారుతున్న, బతికి చస్తున్న మావాళ్ళ బతుకుల్లో మీకు హింస కనపడట లేదా, ఆగమైతున్న ఆదివాసీలు..అడ్డ మీద బతుకున్న కూలన్నలు..అంత హింసనే..మళ్లీ మళ్లీ ..మేమేదో సుఖ శాంతులతో ఉన్నట్టు మీరు పాఠాలు చెప్పి మమ్మల్ని మోసం చేయకున్ద్రి.
ఉద్యమాన్ని చల్లార్చిన వాళ్ళే ఉద్యమాన్ని తిరిగి లేపాలి..లేకుంటే ప్రజలుగా మేము విఫలం అయినట్టే..నాగం తోటి అందరు కూర్చొని దీక్షలు చేయున్ద్రి..నమ్మకాలు లేవు కాని ఏదో ఒకటి చేయటం బెట్టర్. ఈ పనికి మాలిన దీక్షలు ఎన్ని చూడలేదు..మొన్నటికి మొన్న రామ్దేవ్ బాబా ని చూసినం కదా..పోలీసులు వస్తారు, బగ్నం చేస్తారు..మీరు బతుకుతారు, మిమ్మల్ని నమ్ముకున్న మేము చస్తాం..అంతె జరుగుతది.
మండళ్ళు, మంత్రులు, కంత్రులు అని మాయ మాటలు చెప్తే మర్యాదగుండది..ఇక్కడ మీ పార్టీ వోల్లు మీటింగ్ పెట్టి డేడ్ లైన్ పెడతారు , అక్కడ మీ మంత్రి సోనియమ్మ తో మంతనాలు ఆడతాడు..ఎవడికి తెలవావు మీ నాటకాలు..తాడో పేడో తేల్చుకొనే రోజులు మీకు కాదు..మాకు వచ్చినాయ్..ప్రజలుగా ఏకం అయితేనే, పార్టీలుగా మీరు ఏకం ఐతారు..కాకపొతే..కాకమ్మ కబుర్లు చెప్తే..కాటికే అన్నల్లార!
నేనేక్కడున్నానని వెతుకుతుంది ఈ లోకం!
నిషాలన్నీ విడిచి పెట్టి ఇపుడు ఏ నిషాలో ఉన్నానో ఎలా తెలుసు కుంటుంది?
జేబులో ఏ జ్ఞాపకాలు వేసుకొచ్చానో ఎవరికీ తెలుసు ?
ఏ రాళ్ల కుటుంబాల్లో గుండె రెండు చేతులతో పుచ్చుకొని కన్నీటి బిందువుల కోసం
బిక్షాటన చేస్తున్నానో ఎవరికీ తెలుసు?
భాదలన్ని ఖాళి చేసుకున్న గుండె
మళ్లీ భాదల్ని నిపుకుంటుంది
నన్ను నేను వదిలి మరొకరితో లీనమవుదామనుకుంటే
తనను తాను వదిలి నాలో లీనమయ్యే
మరొకరు లభించక పోయారు
(శేషేంద్ర)
జై తెలంగాణా!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Rajakeeya ‘Laphangilu’
- Prajala chethila Telangana udyamam
- Resignations are not valid – Assembly Speaker
- Parliament kaada paanam vadhilindu
- Deeksha viraminchandi – KCR
- KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
- G-andh(i/ra) giri
- ఎవరక్కడ …రా(ణి)జు గారి ఆజ్ఞ!
- Madhu Yashki masthi
- Marana saasanam raasina T MLAs


Tweet This
Digg This
Save to delicious
Stumble it