Prof. Kodandaram doubts center’s stand

News pulse, Politics | admin | June 27, 2011 at 6:30 pm

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరామ్ కు కేంద్ర ప్రభుత్వం వ్యవహారశైలిపై అనుమానాలు కలుగుతున్నాయి. తెలంగాణ ఇవ్వడానికి కేంద్రం సిద్దంగా లేదన్న భావన కోదండరామ్ కు ఏర్పడుతున్నట్లుంది. కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్ళి రీజినల్ కమిటీని పట్టుకు వచ్చారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ నాయకుల వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టుకున్నట్లుగా ఉందని అన్నారు.రీజినల్ కమిటీ ప్రతిపాదనకు తెలంగాణ అంతటా నిరసనలు తెలపాలని కోదండరామ్ పిలుపు ఇచ్చారు.తెలంగాణ అంతటా కేంద్ర బలగాలను మొహరించిన తీరు అనేక అనుమానాలు కలిగిస్తున్నదని ఆయన చెప్పారు.

తాము రీజినల్ కమిటీని ఆమోదించబోమని ఆయన స్పష్టం చేశారు.ఈనెల ఇరవై ఐదోతేదీన జెఎసి విధించిన డెడ్ లైన్ ముగిసిందని,తదుపరి కార్యాచరణ జూలై రెండో తేదీన నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. కోదండరామ్ నేతృత్వంలోని జెఎసి డెడ్ లైన్ పెట్టినప్పటికీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకోలేదు. దానితో ఏమి చేయాలన్నదానిపై వీరు చర్చించి ఆందోళన కార్యక్రమాలను నిర్ణయిస్తారు.

Related posts:

  1. Telangana thappademo?
  2. Did Cong T politicians set a deadline?
  3. KK’s bheeshana keka
  4. Differences between Prof and KCR again?
  5. Jagan’s money with Nagam Janardhan?
  6. Sonia sets deadline for CM, Kiran?
  7. KCR and Prof. Kodandaram compromise
  8. What did the Governor tell the center?
  9. Kodandaram’s Delhi trips
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free