Rebels already in YSR Cong

News pulse, Politics | admin | June 2, 2011 at 4:22 am

కాంగ్రెస్‌ పార్టీపై తిరుగుబాటు చేసిన జగన్‌కు.. అసంతృప్తి సెగ అంటుకుంటోంది. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కనందుకు.. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు.. శివకుమార్‌ ఏకంగా తన పార్టీ తనకిచ్చేయ్యాలంటూ కొ్త్త గొల షురూ చేశాడు. వైఎస్‌ మరణించిన తర్వాత కొద్ది రోజులకే శివకుమార్‌ వైఎస్ఆర్ పేరు వచ్చే విధంగా కొత్త పేరుతో రాజకీయపార్టీని స్థాపించి ఈసీకి అప్లై చేసుకున్నారు. దీనిపై స్పందించిన ఈసీ యువజన ( Y ) శ్రామిక ( S ) రైతు ( R ) రైతు పేరుతో శివకుమార్‌కు కేటాయించింది.

అయితే తర్వాతి కాలంలో జగన్‌ పార్టీ పెట్టడం.. దానికి శివకుమార్‌కు కేటాయించిన పార్టీని జగన్‌ బదలాయించుకున్నారు. అప్పుడు శివకుమార్‌ కూడా దానికి ఆమోదం తెలిపారు. అదే పార్టీ పేరుతో జగన్‌, విజయమ్మలు కడప ఎన్నికల్లో కూడా పోటీచేశారు. అయితే జగన్‌ పార్టీ పునర్వవ్యస్థీకరణలో భాగంగా.. శివకుమార్‌కు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో.. అసంతృప్తి రాజుకుంది.

దాంతో ఆగ్రహంతో ఉన్న శివకుమార్‌.. తన పార్టీ పేరును జగన్‌ వాడుకుంటున్నారని.. ఢిల్లీలోని ఈసీకి ఫిర్యాదు చేశారు. తన పార్టీని తనకిచ్చేయాలని కోరుతున్నారు. దీనిపై పార్టీ ముఖ్యనేతలతో సాగర్‌ సొసైటీలో భేటీ కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే శివకుమార్‌కు అప్పట్లోనే కొంత ఆర్థికంగా కూడా గిట్టుబాటైందన్న ప్రచారం కూడా ఉంది.. ఆ తర్వాత పార్టీ తమ ఇష్టంగా నడుపుతాం కానీ..

శివకుమార్‌ ప్రకారం నడుచుకోలేమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts:

  1. KCR and Nagam at Cong deeksha
  2. Will Cong T politicians split?
  3. Nagam says he will support Jagan if…
  4. Jagan’s loyalist Gone, dumps Jagan?
  5. TDP challenges Jagan’s YSR Cong
  6. Jagan gives shock to Ambati and Gone
  7. Jayasudha avoiding Jagan’s party?
  8. Balanaagi Reddy drama
  9. Jagan towards BJP?
  10. Congress ku August bhayam

Leave a Reply

Spam protection by WP Captcha-Free