Split in Cong T MPs?

News pulse, Politics | admin | June 28, 2011 at 4:21 am

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, కేంద్ర మంత్రి , రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జీ గులాం నబీ అజాద్ తో భేటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయన ఒంటరిగా కలిస్తే అది వేరే విషయం కాని ఇద్దరు ఎమ్.పిలు బలరాం నాయక్,సురేష్ షెట్కర్, ఎస్.రాజయ్యలను కూడా తీసుకుని ఆయన గులాం నబీ అజాద్ ను కలిశారు.ఆజ్మీర్ లోని దర్గాను సందర్శించి వచ్చిన దామోదర రాజనరసింహ ఢిల్లీలో ఏమి మంత్రాంగం చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి వారిద్దరు కలిసి ఏ వ్యూహాన్ని చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాంగ్రెస్ తెలంగాణ ఎమ్.పిలంతా ఒక్కమాట మీద ఉంటాం అన్న చందంగావ్యవహరించేవారు.నిజామాబాద్ ఎమ్.పి మధుయాష్కి అయితే దామోదర రాజనరసింహను సమైక్యవాదిగా ముద్రవేశారు. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే సహించబోమని కూడా హెచ్చరించారు.

అయినా అదిష్టానం మదు యాష్కి మాటను పట్టించుకోలేదు.దామోదరకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఇప్పుడు హోం శాఖ మంత్రి పదవిని కూడా ఇవ్వాలని యోచిస్తున్నారు.ఇక ఇద్దరు ఎమ్.పిలను తనతో వెంటబెట్టుకుని వెళ్లడం ద్వారా రాజనరసింహ తనతో బలహీన వర్గాల ఎమ్.పిలు ఉన్నారన్న సంకేతాన్ని అధిష్టానానికి ఇవ్వగలిగారు. ఫ్రొఫెసర్ జయశంకర్ మరణించిన నాడు ఆయనకు నివాళి అర్పించడానికి వెళ్లిన ఎమ్.పి రాజయ్యపై దుమ్ముపోసి, రాళ్లు వేయడమే కాకుండా చొక్కా కూడా చించి కొందరు ఆందోళనకారులు అవమానించారు.

దళితులను ఈ రకంగా అవమానిస్తారా అంటూ అప్పుడు విమర్శలు వచ్చాయి. పైకి ఉద్యమకారుల ఆందోళనగానే అప్పటికి రాజయ్య భావించినా సహజంగానే దీనిపై గట్టిగానే ఆలోచించి ఉండాలి.ఆ తర్వాత ఏమైనా కాస్త మార్పు వచ్చిందా అన్న సందేహం కలిగే లా పరిస్థితి కనబడుతోంది. దామోదర రాజనరసింహతో వెళ్లడం ద్వారా తనకు జరిగిన పరాభవానికి ఆయన సమాధానం చెప్పదలిచారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. పైగా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా వీరి వెంట ఉండడం పుండు మీద కారం చల్లినట్లే అవుతుంది.ఇదంతా చూస్తుంటే కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణపై తన గేమ్ ఆరంభించిందనే అనుకోవాలా?

Related posts:

  1. Harish Rao fires on Subbarami and Renuka
  2. Will Cong T politicians split?
  3. Chances of Chiranjeevi to be CM?
  4. There will be no use with ‘Dy CM’
  5. Damodar Raja Narasimha cannot be Dy CM
  6. Sonia sets deadline for CM, Kiran?
  7. Will CM, Kiran be a CM until 2014?
  8. Who are Telangana drohis?
  9. Jupally starts his Telangana yatra
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free