Tears rolled down KCR’s eyes
News pulse, Politics | admin | June 21, 2011 at 4:00 am
ప్రొఫెసర్ జయశంకర్ మృతదేహాన్ని చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కన్నీరు పెట్టుకున్నారు. వరంగల్ లో జయశంకర్ కు కేసీఆర్ నివాళులు అర్పించారు. మృతదేహం ముందు కాసేపు మౌనం పాటించిన కేసీఆర్.. తర్వాత మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ లేకపోవడం వ్యక్తిగతంగా తీరని లోటు అని కేసీఆర్ చెప్పారు. ఇక నేనెంతో నష్టపోయాయని.. ఆయన ఆవేదన చెందారు. ఉద్యమం ప్రారంభించిన నాటి నుంచి తనకు వెన్నంటే ఉండి.. ధైర్యం నూరిపోశారని కేసీఆర్ అన్నారు. ఎన్నో సలహాలు.. సూచనలు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇక ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు మూడు రోజుల పాటు సంతాప దినాలు జరుపుకోవాలని జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అంత్యక్రియల తర్వాత కొవ్వొత్తుల ప్రదర్శన.. ఆ తర్వాత సంతాప సూచకంగా సంస్మరణ సభలు నిర్వహించాలని.. ఆయన కోరారు. అలాగే బుధవారం ఉదయం 8 గంటల నుంచి జయశంకర్ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తర్వాత పద్మాక్షమ్మ గుట్టపై ఉదయం 11 గంటలకు జయశంకర్ అంత్యక్రియలు జరుగుతాయి.
Related posts:
- Prof. Kodandaram doubts center’s stand
- Emirates T Cultural Association santhapa sabha
- Jayashankar blessed me – Errabelli
- Jai Telangana in TDP’s Mahanadu
- Nagam is in full demand
- Differences between Prof and KCR again?
- T supporters pull mike from Revanth Reddy
- KCR and Prof. Kodandaram compromise
- Kodandaram’s Delhi trips
- Panthulla madhya chicchu


Tweet This
Digg This
Save to delicious
Stumble it