There will be no use with ‘Dy CM’

News pulse, Politics | admin | June 10, 2011 at 5:37 pm

రాష్ట్ర మంత్రి దామోదరరాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై తెలంగాణ నేతలు పెదవి విరుస్తున్నారు. సీనియర్‌ నాయకులు.. రాజ్యసభ సభ్యులు వీ హనుమంతారావు దామోదర రాజనర్సింహకు పదవి ఇవ్వడాన్ని తప్పుపట్టలేదు కానీ.. ఈ ఉప పదవుల వల్ల తెలంగాణకు ఒరిగేదీ లేదని.. న్యాయం జరగదని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా తెలంగాణ అంశాన్ని పరిష్కరించకుండా ఉప ముఖ్యమంత్రి వంటి చిన్న చిన్న పదవులివ్వడం మూర్ఖత్వం కాక ఇంకోటి కాదని టీఆర్ఎస్ శాసనసభా పక్ష నాయకుడు.. ఈటెల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. తమ పోరాటం వల్లే తెలంగాణ వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి వదవి వచ్చిందని ఆయన అన్నారు. కాగా మధుయాష్కి కొంత కాలం క్రితం.. సమైక్యవాది అయిన దామోదర్‌ రాజనర్సింహకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరాదని.. అధిష్టానాన్ని తాము డిమాండ్‌ చేస్తున్నామని ఆయన చెప్పారు.

అధిష్టానం మధుయాష్కి వాదనను అసలు పట్టించుకున్నట్లే లేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరిక మేరకు దామోదర రాజనర్సింహకే ఉప ముఖ్యమంత్రి పదవికి కేటాయించడానికి ఆమోదముద్ర వేసింది.

Source – Kommineni

Related posts:

  1. Harish Rao fires on Subbarami and Renuka
  2. Chances of Chiranjeevi to be CM?
  3. We will show the power of Hyderabad – Cong T ministers
  4. Split in Cong T MPs?
  5. Damodar Raja Narasimha cannot be Dy CM
  6. Nagam is in full demand
  7. Differences between Prof and KCR again?
  8. Sonia sets deadline for CM, Kiran?
  9. Who are Telangana drohis?
  10. Jupally starts his Telangana yatra

Leave a Reply

Spam protection by WP Captcha-Free