Vinay Kumar’s another attempt in politics
News pulse, Politics | admin | June 24, 2011 at 5:00 amకేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయకుమార్ మళ్లీ రాజకీయాలలో క్రియాశీలం కావాలని భావిస్తున్నారు.అయితే ఈసారి ఆయన రాజకీయపార్టీల ద్వారా కాకుండా సామాజిక ఉద్యమాల ద్వారా తెరపైకి రావాలని ఆయన భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే తాజాగా బిసిల వేదికను తయారుచేసి ముందుకు వెళ్లాలని ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో ప్రముఖ వైద్యునిగా పేరొందిన వినయకుమార్ కొంతకాలం పాటు ప్రజారాజ్యం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. మెగాస్టార్ , ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సన్నిహితుడుగా, ధింక్ టాంక్ గా కూడా ఆయన పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్ మీద నిజామాబాద్ లోక్ సభ సీటుకు పోటీచేసి పరాజయం చెందారు.
తదనంతర కాలంలో ప్రజారాజ్యం పార్టీకి క్రమేపి దూరం అయి తిరిగి వైద్య వృత్తిపై దృష్టి కేంద్రీకరించారు. కారణం ఏమైనప్పట్టికి తిరిగి ప్రజాజీవనంలోకి రావాలని ఆయన తలపోస్తున్నారు.దానికి తెలంగాణ ఉద్యమాన్ని ఆలంబన చేసుకోవాలని భావిస్తున్నారు. కాకపోతే కొంత ఢిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కోరుతున్న విదంగా తెలంగాణ సాధించినా బలహీన, వెనుకబడిన వర్గాలకు మేలు జరగదని వినయకుమార్ అభిప్రాయపడుతున్నారు.అందుకే వెనుకబడిన, బలహీనవర్గాలంతా ఐక్యమై రాజకీయంగా తమవంతు పాత్ర పోషించే పరిస్థితికి రావాలని ఆయన చెబుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో చిరంజీవి ప్రచారం చేసిన సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేయాలని ఆయన సంకల్పించారు.అందుకోసం ఆయన ఇప్పటికే ఆయా జిల్లాలలోపర్యటించి బిసిలను కూడగట్టుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఆయన ఇప్పటికే జిల్లాల పర్యటన కూడా చేస్తున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో ఇప్పటికే పర్యటనలు చేసి ఆయావర్గాలవారిని ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.తన ప్రయత్నాలకు మంచి స్పందన వస్తోందని వినయకుమార్ చెబుతున్నారు.ప్రజారాజ్యంలో ఉండి చేయలేని పని ఒంటరిగా చేయగలుగుతారా? ఈయన తండ్రి శివశంకర్ కు బిసిలలో కాస్త పలుకుబడి ఉంది. దానిని కూడా ఈయనవైపు తిప్పుకుని ముందుకు వెళ్లాలని వినయకుమార్ సఫలం అవుతారా! ఏమైనా ఆల్ ద బెస్ట్ చెబుదాం.
Source – Kommineni
Related posts:
- Will Cong T politicians split?
- Chances of Chiranjeevi to be CM?
- Jai Telangana in TDP’s Mahanadu
- KK’s bheeshana keka
- Jaipal Reddy to resign for T?
- Differences between Prof and KCR again?
- Does Chiru know poli ‘tricks’?
- Kodandaram’s Delhi trips
- Chiranjeevi ki inko pareshani
- Telangana increment – KCR


Tweet This
Digg This
Save to delicious
Stumble it