We will show the power of Hyderabad – Cong T ministers
News pulse, Politics | admin | June 28, 2011 at 4:23 amమెట్రో రైలు ప్రాజెక్టు వ్యవహారంలో ముఖ్యమంత్రి కిరణ్ క ఉమార్ రెడ్డికి ముడుపులు ముట్టాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు ఆరోపించడంపై హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్దరు మంత్రులు దానం నాగేందర్, ముకేష్ లు తీవ్రంగా మండిపడ్డారు. టిఆర్ ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడానికి యత్నిస్తున్నారని దానం నాగేందర్ ఆరోపించారు.
మెట్రో రైలు వస్తే రక్తపాతం సృష్టిస్తానని కెసిఆర్ అంటున్నారని, ఆయన రౌడీనా,సంఘ విద్రోహ శక్తా అని ప్రశ్నించారు.మట్రో ప్రాజెక్టును చేపట్టిన ఎల్.అండ్ టి నుంచి కెసిఆర్ డబ్బులు డిమాండు చేశారని, వారు ఇవ్వకపోవడంతోమెట్రో లైలుపై రాద్దాంతం చేస్తున్నారని మంత్రులు ఆరోపించారు.కిరణ్ కు తెలంగాణ తడాఖా చూపితే తాము హైదరాబాద్ తడాఖా చూపుతామని వారు హెచ్చరించారు.
తాము కెసిఆర్ కుటుంబానిక డెడ్ లైన్ పెడితే వారి కుటుంబం హైదరాబాద్ లో తిరగలేరని మంత్రులు హెచ్చరించారు. హైదరాబాదు నగరంలో ప్రశాంతతకు భగ్నం చేస్తేసహించే ప్రస్తకి లేదని మంత్రులు నాగేందర్ ,ముకేష్ లు హెచ్చరించారు.వై.ఎస్.రాజశేఖరరెడ్డి పధకాల అమలులో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని,రెండువేల పద్నాలుగులో రాహుల్ గాంధీని ప్రధాని అవడం ఖాయమని వారు జోస్యం చెప్పారు.కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వచ్చమైన నేత అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి వ్యాఖ్యానించారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Will Cong T politicians split?
- I dare Nagendar, Mukesh to come out of Hyd
- There will be no use with ‘Dy CM’
- Damodar Raja Narasimha cannot be Dy CM
- Will CM, Kiran be a CM until 2014?
- Who are Telangana drohis?
- Harish Rao gets importance?
- Jupally starts his Telangana yatra
- CM bows down to pressure from ministers


Tweet This
Digg This
Save to delicious
Stumble it