Anna Bailenninado… Ellanna Bailenninado…
News pulse, Politics | admin | July 26, 2011 at 4:00 amదరువు ఎల్లన్న ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ! ఎవరిదో అయితే మనకెందుకని ? అయినా మనమెందుకు యాదికి చేసుకోవాలని అనుకుంటాం. ఇది ఒక నిత్య నూతన నియంత, వివాదాల విరాట్ మరియు దళిత వర్గీకరణ ఉద్యమానికి కారకుడై ఇతర సామాజిక వర్గాలకు కులం పేరుతో సవాళ్లు విసిరే సంచలన సామ్రాట్ శ్రీ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి జన్మ నామం. ఎవరి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం క్రిష్ణన్న లీలల ముందు అందరూ దిగదుడుపే, లేడేక్కడ ఇంతటి ఘనాపాటి. పేరు మార్పులో ఏమున్నది లెండి.
సామాజిక న్యాయం పేరుతో తనను నమ్ముకున్న పి.ఆర్.పి. సమాజాన్ని సమాధి చేసిన శ్రీ చిరంజీవి గారు కూడా ఒకనాడు సినిమా వేషాల కొరకై తన జన్మ నామాన్ని మార్చుకున్న వారే. అవసరాన్ని బట్టి పార్టీల సిద్ధాంతాలు, నాయకుల పార్టీలు మారుతుంటాయి. అట్లాగే కొందరు తమ పేర్లు మార్చుకుంటారు అవసరాన్నిబట్టి. అన్నను పోద్దున్నే సీమాంధ్ర టి.వి.డబ్బాలు తెలంగాణకు వ్యతిరేకంగా చర్చకు దింపినపుడు ఆయన దర్పం, చొప్పదంటు ప్రశ్నలు వేస్తూ కెమెరాల వైపు కవ్వింపుగా చూస్తూ, మధ్య-మధ్యలో సెల్ ఫోనులో అందించే ఎస్. ఎం.ఎస్.లు చదువుతూ ముసి-ముసి నవ్వులు చిందిస్తుంటే నా సామి రంగా అచ్చం అపర జయచంద్రుడిలా ఉంటుంది ఆ దర్జా మరియు దరహాసం. అన్నను అందరూ నువ్వు తెలంగాణ ద్రోహివి, సీమాంధ్ర తొత్తువు అంటుంటారు ఆయన తర్కం విని. పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు చెప్పండి ?తన కుటుంబం ప్రకాశం జిల్లా నుండి వరంగల్ జిల్లా శాయంపేటకు వలస వచ్చింది, ఎదిగింది ఇక్కడే అయినా మూలాల పరంగానో, సీమాంధ్రలో దాచుకున్న సొత్తువల్లనో లేక చేస్తున్న చీకటి వ్యాపారాల వల్లనో గాని అభిమానం-ఆప్యాయతలు, ధ్యాస అటువైపుండడంలో తప్పేముంది?. మనందరికీ ఒక ఇల్లు ఉండటమే ఎంతో కష్టం అన్నకు మాత్రం సీమాంధ్రలో ఎన్ని చిన్న ఇళ్లో! అందుకే అవసరాన్నిబట్టి మనకు అప్పుడప్పుడు దర్శనం చేయిస్తుంటారు సీమాంధ్ర దొరలు. అన్న పూర్వావతారాలెన్నో! ఒకనాడు నక్ సల్ వాదిగ మారి నాణ్యమైన, నాజూకైన బ్రతుకు అరణ్యంలో లేదని గ్రహించి పల్లె-పట్టణాలలో తనదైన శైలిలో ప్రజా కోర్టులు నిర్వహిస్తూ శిక్షలు మరియు శుంకాలు విధించడం, జల్సాలు చెయ్యడం మొదలెట్టెను.
సిద్దాంతం చిగురించక, ఆశలు చచ్చిపోక ,బ్రతుకు భారమై అన్నల ఆశయాలకు వెన్నుపోట్లు పొడవటం ఆరంభించాడు. జలాలు లేని చోట జీవనం ఎంత దుర్భరమో జులాయి వెధవలతో సహచర్యం అంతకు మించి ప్రమాదమని తలంచి అడవిలోని అన్నలు దేహశుద్ది చేసి, మరీ-మరీ హితబోధ చేసి పంపిరి. లాఠీ దెబ్బలు తిని-తిని చోరుడు తుదకు వీరుడయ్యిండన్నట్లుగా మన కృష్ణన్న వర్గీకరణ ఉద్యమకారుడాయెను. మాదిగలే కాదు సాటి బడుగు-బలహీన వర్గాలంటే అన్నకు వల్లమాలిన ప్రాణం. కాని ఒక పాము, నక్క, అగ్రవర్ణస్తుడు మరియు మాల వర్గస్తుడు త్రోవలో ఎదురు పడితే మొదటి మూడింటిని వదిలేసి మాల.ను నరికేయ్యండని సహచరులకు చెప్పిన బహు దొడ్డ మనసు అన్నది. అన్న ‘ఛీ-ఛీ’ నెహ్రూను మించిన శృంగార పురుషుడని మేరీ అను ఒక అబల తనను వంచించి ఎలా శీలం దోచెనో ప్రసార మాధ్యమాల ద్వార ఖమ్మం నుండి రోధిస్తూ విన్నవించు కొనెను. భోగి కాలేనోడు యోగి కాలేడు అనే శృంగార సిద్దాంతాన్ని అన్న బాగా వంట పట్టించుకున్నాడు. అన్న మీద ఎన్ని పోలీసు కేసులున్నా, ఎంత కనకం, ఖ్యాతి సంపాదించుకున్నా ఓటు సమరంలో మాత్రం ఘోరంగా మధిర బరిలో ఓడిపోయెను. అన్నకు చవితి చంద్రుడి లాంటి చంద్రబాబన్నా, సచ్చిపోయిన సామ్యుల్ రెడ్డన్నా ఎంతో ఇష్టం. కాంత, కనకాదులను సమకూర్చు సీమాంధ్ర వాదులంటే అన్నకు ఎనలేని గౌరవం మరియు ప్రాణం. అన్నకు తనను తలదన్నే వాడంటే అస్సలు గిట్టదు. సమయం చూసి వాళ్ళ చీటీ చింపేస్తాడు, ఆనవాళ్ళు లేకుండా చేసేస్తాడు. అందుకే అన్నా! మజాకా ! అంటారు తెలిసిన వారు, ముఖ్యంగా బాధితులు. స్వర్గీయ ఎన్.టి.ఆర్. తానే కృష్ణుడు – రాముడు అని కాళ్ళు మొక్కించుకున్నట్లుగా మన అన్న కూడా స్వర్గీయ అంబేద్కర్ తన తర్వాతే అని ఊహించుకుని పులకించి పోతాడు. అన్న అదృష్టమో, దుర దృష్టమో గాని వర్గీకరణ
అంశం డిల్లీ కోర్టులో బాబ్రి కేసు మాదిరి భద్రంగా నాన్చి పెట్ట బడింది. వీటన్నింటిని మించిన పాత కేసు తెలంగాణ అంశమని అన్నకు తెలియక వెనుకొచ్చిన కొమ్ముల మాదిరి ఎగిరెగిరి పడుతుంటాడు. దేశానికి స్వాతంత్ర్యం వస్తే ప్రజలకూ వచ్చినట్లేనన్న సత్యం గుర్తెరుగుతే తెలంగాణకు, వర్గీకరణకు గల సాంపత్యం బోధ పడుతుంది. రాజకీయాల్లో కుల-మతాలను పాచికలుగా వాడవచ్చునేమొగాని యుద్దాల్లో – ఉద్యమాల్లో అవి ఉపయోగపడవు అలా అనుకున్న వాడి మూర్ఖత్వానికి
చింతించవలె, ఖర్మకు వదిలి వేయవలె. తెలంగాణ ఉద్యమంలో కుల మతాలకు అతీతంగా ద్రోహులు ఏ విధంగా శిక్షింప బడుతున్నారో. వీరులు, అమరులు ఏ విధంగా సత్కరింప బడుతున్నారో గుర్తుంచుకుని మసలుకుంటే అన్న లాంటి వారికి ఎంతో శ్రేయస్కరం.
సీమాంధ్ర దొరల దరువేసి తెలంగాణా దళితుల పరువు తీయకే ఎల్లన్న!
‘రణ నీతి లేని రాకుమారుడు – గుణ హీనుడైన గురు పుత్రుడు విరిగిన పాలు, కుళ్ళిన తులసితో సమానం!’
‘ఏకాదశికి ఒక్కపొద్దు ఉండనోడికి, శివరాత్రికి జాగరణ చేయనోడికి జన్మ ధన్యం కాదు, మోక్షం లభించదన్నట్టుగా ఈ మహత్తర ప్రజా ఉద్యమంలో పాల్గొనని వాడు వట్టి నిరర్థుడు, నిష్ప్రయోజకుడు మరియు నిర్జీవుడు.’
జై జయ శంకర్ – జై తెలంగాణ,
Cuortesy – Anil Maddirala, thank you for sharing.
Related posts:
- Telangana thappademo?
- Hyd is not obstacle for bifurcation of state
- Nagam says he will support Jagan if…
- Emirates T Cultural Association santhapa sabha
- Who are Telangana drohis?
- 75 lakhs release order issued for Tank Bund statues
- What did KCR do for Telangana – Erraballi
- Panthulla madhya chicchu
- Telangana katha modhatiki vacchindhi
- Is this the way SKC report was made (funny)


Tweet This
Digg This
Save to delicious
Stumble it