Deeksha viraminchandi – KCR
News pulse, Politics | admin | July 13, 2011 at 4:00 am
మోసాలు, బుజ్జగింపులు, నజరానాలు, నయా వంచనలు..అన్నల్లార! చివరి దాక వచ్చిన ఉద్యమాన్ని మీ మీ స్వార్థ ప్రయోజనాల కోసం బలి పెట్టకండి..ఒక సారి పెట్టినరు, కొన్ని వందల పానాలు గాల్లో కలిసి పోయేందుకు మీ వంతు కృషి చేసింరు..మళ్ళినా? ఇంకా మీకు రక్త దాహం, ప్రాణ దాహం తీరలేదా? మీరు ఎన్ని సార్లు రాజీనామాలు చేసినా గెలిపించాము కదా,మీ సీట్లకు, నోట్లకు , వోట్లకు ధోకా లేదు అని మా శవాల సాక్షిగా చెప్పినము కదా, ఇంకా గెలిపిస్తాము అని అంటున్నాము కదా..విద్యార్థులు ఎందుకు విడిపోయారో మీకు తెలుసు , మాకూ తెలుసు, ఎన్నో కష్టాలు పడితే మళ్లీ ఒక తాటి పైకి వచ్చి మీరు చేయవలసిన పని వాళ్ళే చేస్తున్రు. ఎందుకు దీక్ష విరమించాలి పెద్దన్నా? ఇపుడు వాళ్ల ఆరోగ్యం పాడు అయిపోతుంది అని గుర్తొచ్చిందా? నువ్వు చూపిన దారే కదా తండ్రి! ఇంకొక రూపం నువ్వు చూపి ఉంటె తప్పకుండ నీ బాటనే పట్టే వాళ్ళు..ఈ దినం అవినాష్ చివరి శ్వాస విడిచిండు అయినా మీకు స్వాంతన కలగ లేదా పితా మహా! పొఇన సారి చిదంబరం కి తలొగ్గి, ఉద్యమం విద్యార్థుల చేతిలోకి పొతే నీకు నాకు గతి ఉండదు అని అయన అంటే, విద్యార్తులని చెడ గొట్టటానికి ఎన్ని పన్నాగాలు ఈ రాజకీయ నాయకులు పన్నారో, మాట్లాడారో, ఆర్ట్స్ కాలేజి, ఏ చెట్టూ , పుట్ట ని అడిగినా చెపుతాయి..గాయ పడ్డ హృదయాలు, దగా పడ్డ తమ్ముళ్ళు…చిన్న బోఇన వదనాలతో, చితికి పొఇన మనస్సు తో ..మీ కుళ్ళు , కుట్రల ముందు , చని పొఇన శ్రీకాంతులని , వేణుగోపాల్, యాదయ్య లాంటి ఎందరో త్యాగాలని తలచుకుంటూ, గుడ్లల్లో నీళ్ళు కుక్కుకుని, నిశ్సబ్దంగా, నిశ్చేష్టులై ఉన్నారు..మీ మీద గౌరవం కొద్ది, తెలంగాణా మీద ప్రేమ కొద్ది ఒక్కరూ నోరు విప్పలేదు. మీరు దయచేసి మళ్లీ పావులు కదపకండి..ఇపాటికే మీరు అధిష్టానం ఒక్కటయ్యారని, జగన్ తో కూడా చేతులు కలిపారని, కాంగ్రెస్ మీతో మాట్లాడి పిస్తుందని ఎన్నో వింటున్నాము, సీమాంద్ర మీడియా కోడై కూస్తుంది, మేము నమ్మకాలు కోల్పోతే నష్ట పోఎది మీరే..ఇపుడు మావద్ద పోగొట్టుకోవడానికి ఏమి లేదు, బిడ్డల్ని కోల్పోయాం, భూములు కోల్పోయాం, నీళ్ళని పోగొట్టుకున్నాం , అతి విలువైన సంపద కోల్పోయాము..మా దగ్గర ఉన్నది ఒక్కటె, కాళోజి మాటల మూటలూ, కొమరం భీమ్, ఐలమ్మల, దొడ్డికోమరయ్య సాహసం..బందగిలు, షోయెబ్ లు అందరు మా వెంటే, మామీద మేము నమ్మకం ఇంకా కోల్పోలేదు, విశ్వాసం వీగి పోలేదు, ప్రాణాలకు తెగించిన మాకు మీ మెత్తని మాటలు ఆపలేవు, మా తెలంగాణా ముందు మాకు ఏ బంధుత్వాలు, ప్రేమలు వద్దు, ఏవి మమ్మల్ని ఆపలేవు..ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, విద్యార్థుల , ఉద్యమ కారుల ముందు ఎంతటి రాజకీయ నాయకులైన తక్కువే, ఈ త్యాగాలే లేకపోతె తెలంగాణా లేదు అన్న విషయం మీకు తెలుసు, ఈ విషయాన్నీ మా జయ శంకర్ సారూ ఎన్నోసార్లు చెప్పిన్రు..నాయకులని ఉద్యమం నిలబెడుతుంది, తయారు చేస్తుంది కాని ఉద్యమాలని నాయకులు తయారు చేయలేరు..చరిత్ర పుస్తకాలు తిరగేయండి, ఇదంతా మీ ప్రేమే కావొచ్చు..మాకు తెలంగాణా తప్ప ఏది కూడా ఇపుడు విషం లాగానే కన పడుతుంది. అసలే మీరు తెర వెనుక ఎందుకు ఉన్నారో తెలుస్త లేదు, సీమాంద్ర వాళ్ళు అందరూ కన పడుతున్నారు కాని మీరు మాత్రం మౌన ముద్రలో ఉన్నారు, మీ టీవి కాని, పేపర్ కాని అసలు తెలంగాణా ఉద్యమాన్ని ప్రతి ఫలిస్తలేవు అని ఇక్కడ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు..శంకం లో పోస్తే తీర్థం లాగ, మీడియా లైన్ లోకి వస్తే మనమూ మారతామా..ఒక్క సారి ఆలోచించడి. మిమ్మల్ని ఎవరు అవమానించినా మాకు బాద ఐతది సారూ! మిమ్మల్ని ఇంత పెద్ద గా నిల బెట్టింది మేమే, మరిచి పోవద్దు! చెన్నారెడ్డిలు, చిదంబరాలు, రోశయ్యలు, కిరణ్ కుమార్ లు, బోత్సలు, దామోదర్లు, బోత్సలు ..మా కన్నును మా వేలితో పొడుచు కొము. చీప్ ట్రిక్లు వేయకండ్రి.. ఇపుడు మేము ఎవరిని నమ్మం, నమ్మం! ఇదొక్కటే సత్యం, ఒక వేల నమ్మితే మా బొందలు మేము తవ్వుకున్నట్లే! ఉద్యమం ముందుకు, కెసిఆర్, రాజకీయ నాయకులు వెనక్కు..ఇదే తెలంగాణా ఉద్యమం.
ఒక వైపు బొత్స తో హై కమాండ్ బుజ్జగింపులు, మరో వైపు సిఎం తో బేటీలు, నోటికి వచ్చినట్టు ఆజాద్ కూతలు, పిల్లికి , ఎలుకకి సమ్మతం కావాలంట..పాముకి , ముంగిసకి..వీరు ఎక్కడి నాయకులు, అసలు ఎంత నీచ, కమీన్, కుత్తే గాళ్ళని ఎట్లా ఎన్నుకున్నాము..ఏదో సినిమాలో చెప్పినట్టు , ఒక్క సారి వోటుకి అమ్ముడు పొతే , ఐదు ఏండ్లు వాళ్ల చెప్పు చేతల్లో ఉండాలి కాదూ కాదూ చచ్చే వరకు వాళ్ల చేతిలో ఉండాలి, అయినా ఎన్ని సార్లు మోస పోతం ? ఇంకా ఆ అవకాశం లేదు లేదు, కాంగ్రెస్ నాయకులని ఇపుడు కాస్త మెచ్చుకోవాలి, కనీసం వాళ్ళు మాట పై నిలబడుతున్నారు. మీమీద మాకు నమ్మకం లేదు కాని, ఆంధ్ర వారి పై ఉంది, వారు తప్పకుండా మనలో ఉన్న మోసగాల్లని పట్టి, డబ్బు మూటలూ చూపెట్టి మల్లా ఉద్యమాన్ని వెనక్కి తీసుకు పోగలరు..కాని ఇపుడు పరిస్తితి చేయి దాటి పోయింది..మంచి మాటలతో మాయ చేయలేరు , తేనే పూసిన కత్తులతో మా గొంతులు ఎవరు కోయ లేరు..
జర ఓపిక పట్తండ్రి, ఇంకా చివరి దశలో ఉన్నాం, సోనియమ్మకి ఇపుడే చుక్కలు కనపడుతున్నై, ఇంకా మా విద్యార్థులు, తెలంగాణా , మూడో కన్ను తెరిస్తే? ఇటలికి పారి పోతదో ఏమో చూడాలి, రాహుల్ గాంధి దేశ నాయకుడు ఏమో గాని, గల్లి లో గెలవడం కూడ కష్టమే…ఇపుడు రంగులు మార్చిన వారు ఎవరైనా వారి వారి సమాదులకి వారే భాధ్యులు..తెలంగాణా పుండు సలుపుతుంది, దానిపై పై కారం చల్లోద్దు దయచేసి, ఓపిక నశించింది, ఇంకా శాంతి , సహనం మాటలు డిక్షనరీ లో లేకుండా పోతాయి జాగ్రత్త! తెలంగాణా అగ్గిగుండం లాగున్నది..దగ్గరికి రావొద్దు, పార హుషార్!
చికట్లని తూట్లు పొడుస్తూ, ప్రేమల మాటున మోసాలని నరుక్కుంటూ, ఒక్కో అడుగు వెలుగుకై వేస్తూ, పడుతూ లేస్తూ..నిశ్శబ్దంగా, శత్రువు ని కనిపెడుతూ.. నిర్భయంగా నడుస్తుంది నా తెలంగాణా ! నాలుగు దిక్కులా ప్రసరిస్తూ దావాలనంలా!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Prajala chethila Telangana udyamam
- Parliament kaada paanam vadhilindu
- Dhikkaristhunna Telangana – Deeksha Telangana
- Prantheeya Mandali? Dy CM in Delhi
- G-andh(i/ra) giri
- Telangana Raktha Kanniru
- Madhu Yashki masthi
- Telangana Amaraveerulu
- New story ‘Jai Bolo Telangana’
- Ekkada Paareskunnamoo Akkadney Vetthukovaleyy


Tweet This
Digg This
Save to delicious
Stumble it