I dare Nagendar, Mukesh to come out of Hyd

News pulse, Politics | admin | July 4, 2011 at 9:27 am


హైదరాబాద్ మంత్రులు దానం నాగేందర్, ముకేష్ లు దమ్ముంటే హైదరాబాద్ వదలి రావాలని మాజీ మంత్రి నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదరరెడ్డి సవాలు విసిరారు.వారు తెలంగాణ వాదులా, సమైక్యవాదులా అన్నది తేల్చాలని ఆయన అన్నారు. దానం నాగేందర్, ముకేష్ లు గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా ఉన్న నేతలు.వారు గతంలోనే అలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్టం ఇచ్చే పక్షంలో తమ అబిప్రాయాలు కూడా తెలుసుకోవాలని గతంలోనే వారు చెప్పారు. అయిత ఒక సందర్భంలో దానం నాగేందర్ కూడా తెలంగాణకు అనుకూలగా ప్రకటన చేసినప్పటికీ, తాజాగా హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తెలంగాణ అంశంపై రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ముకేష్ అయితే రాజీనామాలు చేయడం అంటే, కాంగ్రెస్ కు ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్యానించారు.

ఈ నేపధ్యంలో తెలంగాణకు గుండె కాయ వంటి హైదరాబాదులో మెజార్టీ ప్రజాప్రతినిధులు తెలంగాణకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం నష్టమేనని శాసనసభ్యుడు రాజయ్య అన్నారు. అయితే మొదట గ్రేటర్ పరిధిలోని ఒక్క జూబ్లి హిల్స్ ఎమ్మెల్యే తప్ప మిగిలినవారెవ్వరూ రాజీనామాలకు ముందుకు రాలేదు . అయితే ఆ తర్వాత ఏమి జరిగిందో కాని సాయంత్రానికి మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో శశిధర్ రెడ్డి మినహా అంతా రాజీనామా చేసేశారు. దామోదర రెడ్డి ఇలా హెచ్చరించడం తగునా అంటే నోరు గట్టిగా ఉంటే ఎవరినైనా భయపెట్టవచ్చన్నది ఆయన సిద్దాంతం. ఏమి చేయగలం.

Related posts:

  1. Will Cong T politicians split?
  2. We will show the power of Hyderabad – Cong T ministers
  3. Nagam says he will support Jagan if…
  4. Damodar Raja Narasimha cannot be Dy CM
  5. Jagan’s loyalist Gone, dumps Jagan?
  6. Jaipal Reddy to resign for T?
  7. T supporters pull mike from Revanth Reddy
  8. PRP MLA sends his resignation
  9. SKC is a luccha committee – Nagam
  10. Pocharam’s resignation accepted

Leave a Reply

Spam protection by WP Captcha-Free