Is KK’s proposal valid?
News pulse, Politics | admin | July 10, 2011 at 6:48 pmరాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె.కేశవరావు పరస్పర విరుద్ద ప్రకటనలు ఇవ్వడంలో సిద్దహస్తుడు.అందరికి అర్దం కాకుండా గందరగోళం చేయడంలోకూడా ఆయనకు నేర్పరితనం ఉంది. అమెరికాకుకూడా వెళ్లి యూనివర్శిటీలలో కూడా ఉపన్యాసాలు ఇచ్చి వచ్చిన కేశవరావు తెలంగాణ ఉద్యమంలో ఈ మధ్యకాలంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఆయన కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. తెలంగాణ కోరుతూ అత్మహత్యలు చేసుకున్నవారికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని సూచిస్తున్నారు. కొంతమంది యువకులు చనిపోయిన మాట నిజం.తెలంగాణ రావాలన్న ఆవేశంలో కొందరు అలా ప్రవర్తించారు. ఇది దురదృష్టకరం. అయితే ఎంతమంది అన్నదానిపై భిన్నవాదనలు ఉన్నాయి.రాజకీయ నాయకులు పదే,పదే ఒక పెద్ద సంఖ్య చెబుతూ అలాంటి ఘటనలను ప్రోత్సహిస్తుంటారు. అది వారి స్వార్ధ రాజకీయం . అది అందరికి తెలిసినా , సెంటిమెంటుకు సంబందించిన సమస్య కావడంతో ఎవరూ దాని గురించి ప్రశ్నించరు.అయితే ఇప్పుడు అలా మరణించినవారందరికి పరిహారం ఇవ్వాలని అంటున్నారు.మరి కాంగ్రెస్ ఎమ్.పిలు గతంలో ఆవేశంగా తాము ఇలా మరణించినవారికి పరిహారం ఇస్తామని చెప్పి రెండు,మూడు జిల్లాలలో కొంత పరిహారం ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు.
ఇప్పుడు కేశవరావు ఈ వాదన తీసుకువస్తున్నారు. ప్రభుత్వపరంగా అది సాధ్యమయ్యేదికాదని తెలిసి కూడా ఆయన ఈ వాదన చేస్తున్నారు. లేదా కాంగ్రెస్ ఎమ్.పిలుగా ఆ ఖర్చును భరించకుండా తప్పించుకోవడానికి ఆయన యత్నిస్తున్నారన్న విమర్శలు వస్తాయి. అయితే ఆయన మరో మాట అన్నారు. రాష్ట్రం విడిపోతే ఎంత నష్టం జరుగుతుందో చెబితే ఆ మొత్తాన్ని తాము ఇస్తామంటున్నారు. అది మరి ప్రభుత్వపరంగా ఇస్తారో, మరెలా ఇస్తారో తెలియదు.ఇక మళ్లీ ఉస్మానియాలో ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు తంటాలు పడుతుంటే కేశవరావు మాత్రం దానిని తప్పుపడుతున్నారు. బయటివారిని ఉస్మానియాలోకి ఎందుకు వెళ్ళనివ్వరని ప్రశ్నిస్తున్నారు.
Related posts:
- KCR and Nagam at Cong deeksha
- Will Cong T politicians split?
- Nagam says he will support Jagan if…
- Damodar Raja Narasimha cannot be Dy CM
- KK’s bheeshana keka
- Jaipal Reddy to resign for T?
- Who are Jagan’s coverts in cabinet?
- What did the Governor tell the center?
- Kodandaram’s Delhi trips
- Chiranjeevi ki inko pareshani


Tweet This
Digg This
Save to delicious
Stumble it