KCR and Nagam at Cong deeksha

News pulse, Politics | admin | July 14, 2011 at 4:14 am

తెలంగాణ కాంగ్రెస్ నేతల నిరాహార దీక్ష శిబిరానికి ర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు,తెలుగుదేశం నుంచి సస్పెండైన సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ నాగం జనార్ధనరెడ్డి తదితరులు హాజరయ్యారు.గులాబి కండువాతో పాటు కాంగ్రెస్ కండువా వేసుకుని కెసిఆర్ శిబిరంలో కూర్చోవడం విశేషం.ఈ సందర్భంగా నాగం జనార్ధనరెడ్డి ఒక్కసారి అంతా లేచి నిలబడి చేతులెత్తుదామని ప్రతిపాదించారు. కాని మంత్రి జానారెడ్డి,రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను లేచి నిలబడాలని విజ్ఞప్తి చేశారు. కాని జానారెడ్డి, కేశవరావులు దానికి ఒప్పుకోలేదు. వారిపక్కనే కెసిఆర్ కూడా కూర్చుని ఉన్నారు. వీరిద్దరూ లేచి నిలబడకపోవడంతో కెసిఆర్ కూడా లేచి నిలబడలేదు.అయితే కూర్చుని అయినా చేతులెత్తవలసిందిగా కోరగా అందుకు సమ్మతించి జానారెడ్డి, కేశవరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు వారి చెంతనే ఉన్న కెసిఆర్ కూడా చేతులెత్తి సంఘీభావం తెలిపారు. కాగా అందరం కలిసి తెలంగాణ కోసం పోరాటం చేద్దామని అన్నారు.జానారెడ్డి, కేశవరావు ఎందుకు లేచి నిలబడడానికి వెనుకాడారన్నది ఆసక్తికరం.ఇప్పటికే కెసిఆర్ ఉచ్చులో కాంగ్రెస్ నేతలు పడ్డారని విమర్శలు వస్తున్నందున వారితో కలిసి లేచి చేతులెత్తి నిలబడితే అది ఇబ్బందిగా మారుతుందని భావించి ఉండవచ్చు.

కాగా నాగం ప్రసంగం తర్వాత పాడిన పాటకు పలువురు నేతలు నృత్యం చేశారు.వరంగల్ ఎమ్.పి సిరిసిల్ల రాజయ్య , నాగర్ కర్నూల్ ఎమ్.పి మందా జగన్నాధం, , ఎమ్మెలయయే రాజయ్య తదితరులు లయబద్దంగా నృత్యం వేశారు.తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఈటెల రాజేందర్ , హరీష్ రావు, వినోద్ తదితరులు కూడా శిబిరానికి హాజరయ్యారు.

Related posts:

  1. Will Cong T politicians split?
  2. I dare Nagendar, Mukesh to come out of Hyd
  3. Nagam says he will support Jagan if…
  4. KK’s bheeshana keka
  5. Nagam is in full demand
  6. Differences between Prof and KCR again?
  7. Jagan’s money with Nagam Janardhan?
  8. Nagam nu veli veshnam
  9. SKC is a luccha committee – Nagam
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free