KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
News pulse, Politics | admin | July 1, 2011 at 2:34 amనిజాములు పతనమై నయానవాబులు
ఆంధ్రబాద్ లో అడ్డ వేశాక
ఈస్ట్ సిటీ,వెస్ట్ సిటీ మొత్తం
పరాయి వాడి సొత్తుగా మరి పోయింది (క్రి. శే. జనార్ధనరావ్)
చలో! చివరాకరికి మా దానం అన్న, ముకేష్ కూడ మాట్లాడ బట్టే..ఇంకా ఎంత మంది దగుల్బాజిలతోటి మాటలు బడాల్నో ఏమో. అసలు లగాదపాతిల తోటి మీరు కూడ ఆంద్రాల పోయి ఉండున్డిరా అంటే వినరు, ఇక్కడ వాళ్లకి భజనలు చేయడం కాదు, భూములు ఇప్పియడం కాదు, చాతనైతే ఆ ప్రాంతం ల పోయి ఉంటె తెలుస్తది..ఎం నాయకులుర భై, ఒక్కొక్కల్లను మ్యుసియం ల బెట్టొచ్చు. పోరగాల్లు చస్తున్నరన్న అంటే ఒక్కడు ఉలకడు , పలకడు, కనీసం అన్ద్రోల్లను చూసి ఐన బుద్ధి తెచ్చుకోడు. అన్న జానారెడ్డి, దామోదరన్న లాంటి వాళ్ళందరూ తెలంగాణా పేరు చెప్పుకొని మంత్రి పదవులు కొట్టేస్తిరి. ఇవాళ మా సోనియమ్మ ఎం చెపితే గదే చేస్తాం అంటరు, మా హై కమ్మాండ్ నిర్ణయమే శిరోధార్యం అంటరు. ఇదెక్కడి న్యాయం అన్న, మేము గెలిపిస్తే అక్కడేక్కడినుంచో వచ్చిన ‘అమ్మ’ అంటరెందె , తల్లి తెలంగాణా గోస కనపడ్త లేదా అన్న? లగడపాటి కాడ ఎన్ని డబ్బులు తిన్నారో ఏమో కాని వాడు కారు కూతలు కూస్తుంటే ఒక్కనాడు బయటికి రాని అన్నలు ఇయ్యాల కెసిఆర్ ని హైదరాబాద్ ల తిరగొద్దు అంటారా, మీ నాలుకలు తెగ్గొయ్య, మీరు సంపాదించినా ఆస్తులన్నీ ఏట్ల గొట్టుక పోను, మిమ్మల్ని మా వోల్లు చీపుర్లతోటి, కోడి గుడ్ల తోటి , కారం పోల్లతోటి ఊరవతల బడ్డదాక గొట్ట, మల్లా జీవితంల వోట్ల జోలికి వచ్చిన్రో బిడ్డల్లారా..అపుడు తెలుతడి మీకు తెలంగాణా పౌరుషం అంటే….ఎట్లనో లేక లేక అన్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేతిల పడకుండా భూములు కాపాడానికి, హైదరాబాద్ కి తలమానికం అయిన సుల్తాన్ బజార్ కి మచ్చ తేకుండా ఉండనీకి మెట్రో ప్రాజెక్ట్ అడ్డుకుంట అంటే వీళ్ళకు రోషం వచ్చింది. అన్న గులాబి దళం ని ఒక్కసారన్న ఈ ఎదవల నోర్లు మోఇన్చనికి వాడు కోరాదే! ఈ అమ్ముడు పొఇన నాయకులకి ఎస్సై రాత పరీక్షలు కనపడవు, ఫ్రీజోనే వినపడదు, అన్న దమ్ములు గల్ఫ్ దేశాల్ల శవాలు అయి మక్కి పోతున్నరు, ప్రాజెక్టులు లేక గుక్కెడు నీళ్ళు లేక గొంతెండి పోతున్న కనపడు, అక్క చెల్లెళ్ళు ఆగమై పోతూనే అస్సలు పట్టది. ..తెలంగాణా అంత అట్టుడుకుతుంటే ఎసి రూములు దాటి బయటకు రారు..అన్నో! నువ్వు ఎపుడు ఏమ్మాట్లదతవో గాని, ఈ గాడిదలని రాజీనామా చేస్తే మల్లా గెలిపిస్త అని మాటిచ్చేవు..ఈ రక్త పిసాచులని మేము ఇంకా మోయలేము. ఇప్పటికే రాజకీయాలంటే, నాయకులు అంటే పారి పోతున్నాం, అసహ్యిన్చుకున్తున్నాం, అయిన తప్పక నోరు మూసుకుని భరిస్తున్నాం, తెలంగాణాని అన్ద్రోల్లకి, కార్పోరేట్లకి అమ్ముకుని బతికే ఈ దద్దమ్మలు తెలంగాణా తేలేరు..తేరు. అసలు మాకు ఇంత సహనం ఎందుకో అర్థం అయితలేదు..బలగాలను దిమ్పుతనే ఉంటారు, దామోదర్ లాంటోడు, సోనియమ్మ కి జై అంటడు..విచిత్రంగా అమ్మ ఏది చెపితే అదే అంటడు, అమ్మ నో తెలంగాణా అంటే? నో అంటారనే కదా అర్థం..అపుడు మనం వీళ్ళందరినీ హైదరాబాద్ ల అడుగు పెట్టనీయాల్న?
బ్రేకింగ్ న్యూస్! రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలు! కావాలంటె నిరాహార దీక్షలు చేస్తారంట! మల్లా ఆగస్ట్ ఫస్ట్ వరకు చూస్తారంట, ఇపుడు మనం వీళ్ళని తిరగనీయోద్దు కదా! ఇంత వెధవ, చచ్చు, పుచ్చు దద్దమ్మలని మల్లా మల్లా గెలిపించాలని అనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని కూడ మ్యుసియం లో పెట్టలే సార్లు..మా కులపోడు, ప్రాంతపోడు అంటే ఎట్లా నెత్తిన పాలు పోస్తున్నారో చూసినం కదా! నాగం అన్న చిన్నగా జగన్ కి కూడ మద్దతు ఇస్తా అంటున్నాడు, వాడేందుకు జై తెలంగాణా అనాలే? తీసుకున్న భూములని గుంజక రండ్రి చాతనైతే …అన్న నువ్వు గనక అట్ల ఇంకొక సారి అన్నావంటే నువ్వు జగన్ స్పాన్సర్ చేసిన వాడివి అని అంటున్న మీ వొళ్ళ మాటలకు బలం ఇచ్చినోడివి ఐతావు..దయ చేసి మాకు ఈ ఫ్యాక్షన్ నాయకులని అంటగట్టకు అన్న ! మాకు తెలుసు ఒక్కొక్కడిని ఏట్ల తన్ని తెలంగాణా ని తెచ్చుకోవాలనో, కొత్త కొత్త నాయకులు , అది కూడ రాయల సీమ రెడ్లు అసలు వద్దు..ఇప్పటికే చరిత్ర పాటాలు నేర్పిన నిజాలు చాలు, ఇంకా మల్లా మల్లా మమ్మల్ని దెబ్బ కొట్టొద్దు.. ఇన్ని పానాలు తీసిన ఈ రాజకీయ నాయకులకి కళ్ళు తెరిపించ కుంటే సచ్చిన నా వోల్లు మళ్లీ మళ్లీ సస్తారు మనల్ని చూసి, మన చాత కాని తనం చూసి, నిజంగా మనకు చీము నెత్తురు ఉందా? ఎక్కడనో కోపం , పగ, సిగ్గు, శరం లాంటివి ఉన్నాయా? ఏమో కోట్లాడి కోట్లాడి అన్ని ఫీలింగ్లు సచ్చి పోయినట్టున్నాయి..అన్న జై అంటేనే మనకు ఎమన్నా రోషం వస్తదేమో..తెలంగాణా ఉద్యమము ఎంతో మంది నాయకులని తయారు చేసింది..ఒక్కొక్కలు జాతి రత్నాలు, తెలంగాణాని ప్రపంచంల నే గొప్పదిగా నిలబెట్టేతోల్లు ..ఈసారి ఎలక్షన్ల మాత్రం తెలంగాణకి సేవలు చేసినోల్లనే ఎన్నుకుందాం..రాత్రి పగలు కష్ట పడ్దోల్లె మనోళ్ళు..మనసున్నోల్లు..
ఏమో వొక వైపు బలగాలు, మరో వైపు ఈ సీమ సిఎం గారు మంత్రి వర్గ విస్తరణ అంటడు, ఎస్సై పరీక్షలు అంటడు..మన చెత్త మోకాలు రాజీనామాలు చేయం అంటరు..అసలు ఎం జరుగుతుంది తెలంగాణా లో..తెలంగాణా తెలగన అనుకుంట మొత్తం వేరే విషయాలను పట్టించుకుంట లేము..అడ్డికి పావు శేరుకి ఆంధ్రోల్లు మనకున్న భూములన్నీ కొనుక్కుంటే కళ్ళప్పగించి చూస్తున్నాం..ఇంకా సామాజిక సంగతులు..ఎం చెప్పాలే! చదువులు అమ్ముకున్తున్నాం..అసలు చైతన్యలు, విజ్ఞాన్లు ఎందుకున్దాలే తెలంగాణలో? అండ్ల చాన మంది మనోల్లె చెప్తారు కాదా..ఈ మధ్య మా కరిమ్నగర్ల ఒక ఊర్ల పిల్లలని ప్రైవేట్ స్కూల్ కి పంపించం , అందరం సర్కార్ బల్లకే పంపుతాం అని ప్రమాణం చేసింరు..గా మొన్న తమిళ నాడుల ఒక కలెక్టర్ వాళ్ల చిన్న బిడ్డని సర్కారి బల్ల చేర్పించి , మధ్యాన్నం భోజనం కూడ బెట్టమని చెప్పిందంతా..ఎందరో మహాను భావులు! మనం మాత్రమె మధ్య తరగతి..త్రిశంకు స్వర్గం ల ఉంటాము..ఎటూ తేల్చుకోకుండా.. ఏది ఏమైనా..జర! ఈ కాంగ్రేసోల్ల సొల్లు ని కంట్రోల్ చేయకుంటే, తెలుగు దేసపోల్ల దుమ్ము దులపకుంటే రేపు నిన్ను నన్ను కూడా తెలంగాణాల తిరగ నీయమంటారు. మీ ఇష్టం మరి..ఇంకా భారిద్దామా! ఏందో నాకు మాత్రమె ఈ తీర్గ బాద ఐతది ఎందుకో..నేను కూడ ఏదో ఒక దేశం పట్టుకొని పోత అన్నల్లార! ఎమన్నా కొలువుంటే చూడున్ద్రి..జర పౌరుషం ఉన్న దేశంల పని చేస్తా..
నల్ల రేగడి చాళ్ళు ..రక్తపుటేరులు అయి పారుతున్నది అన్న !
బతుకమ్మ నేడు పరాయోల్ల పాలనలో బంది అయితున్నదన్నా !
ఇంకొక దారిలేదు…అగ్ని ధారలు కురవనీ అన్నా! అన్యాయం మాడి మసి కాని!
జై తెలంగాణా!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Prajala chethila Telangana udyamam
- Resignations are not valid – Assembly Speaker
- ‘Andhra’ bhavan arachakam
- Telangana in cross roads
- Deeksha viraminchandi – KCR
- Dhikkaristhunna Telangana – Deeksha Telangana
- I dare Nagendar, Mukesh to come out of Hyd
- Prantheeya Mandali? Dy CM in Delhi
- Telangana Naatakaala mela
- Danam and Mukesh get warnings


Tweet This
Digg This
Save to delicious
Stumble it