Parliament kaada paanam vadhilindu
News pulse, Politics | admin | July 20, 2011 at 8:03 pm
యాది , మనాది . ఒక దుఖం నుంచి బయట పడక ముందే, కంట తది ఆరక ముందే, యాది మరవక ముందే మల్లోక వార్త, మల్లోక చావు..ఎక్కడికి పోతుందీ ఉద్యమం! ఎన్ని ప్రాణాలు బలి తీసుకుంటది, తెలంగాణాల అన్ని జిల్లాలు ఐపోయినై..ఇంకా కేంద్రం దిక్కు అని, పార్లమెంట్ కాడ పానం వదిలిండు బిడ్డడు యాది రెడ్డి! ఎన్ని రాత్రులు, పగలు ఆలోచిన్చిన్దో , ఎన్ని మోసాలు, వేషాలు గుండెల్లో గునపాలై గుచ్చుకున్నవో, ప్రజా ప్రతినిధులు కారురా, వీళ్ళు పల్లేరుకాయలు, తేనే పూసిన విషపు కత్తులు, పానాలు తీసే రాక్షసులు అని అర్థం అయిందో ఏమో. ప్రజా స్వామ్యం పార్లమెంట్ ల నన్నా ఉంటది అనుకున్నడెమో పిచ్చి యది రెడ్డి, ఈ దేశం లో ఇంకా ప్రజల గోడు వినే ప్రభుత్వాలు వున్నాయని, ప్రజల కొరకు నడుచుకొనే, త్యాగాలు చేసే ప్రతినిధులు ఉన్నారని, పార్టీలంటే, రాజ్యాధికారం అంటే ప్రజలను కాపాడతాయని పుస్తకాల్ల చదువుకున్నవన్ని నిజాల్ని ఎన్ని అపోహలు పడ్డాడో..చివరకి నిజాలు తెలుసుకొని, కనీసం పార్లమెంట్ గోడలకి అన్న కళ్ళు ఉంటాయని, గాలికి చేవులున్తాయని, సోనియామ్మని కదిలిస్తాయని, అమాయకంగా పానాలు బలి పెట్టిండు, నీ త్యాగానికి అయినా డిల్లి దర్బారు పాపాలు కొట్టుకొని పోతాయి యాది రెడ్డి, నువ్వు చేసిన పనికి ప్రతినిత్యం, అక్కడ అడుగు పెట్టే మన నాయకులు, ప్రజల శవాల పైన, సమాధుల పైన కోట్లకు పడగలు ఎత్తే పధకాల కోసం రాత్రి పగలు కాపలా కాసే , పడిగాపులు కాసే నేతలకు , కనీసం ఒక్క నిముషం మనస్సు చివుక్కు మనిపిస్తది, నీ ఆవేదన, ఆర్తనాదమై, చెవుల ఇల్లు కట్టుకొని ఘీన్కరిస్తది..నీ ప్రాణం వృధా కాదు తమ్ముడు, ఇక్కడి మంచి తనానికి, పిచ్చితనానికి మీరు ప్రతికలు..మీ అమూల్యమైన ప్రాణాలు కాపాడుకోలేని మా సేగ్గులేని జీవితాలని పైనుంచి అయినా క్షమించు, పైసాకి కొరగాని వాడు, పాపాలకి కేర్ ఆఫ్ గాళ్ళు మమ్మల్ని నానా మాటలు అంటూ ఉంటె, నోరు మూసుకున్న నాయకత్వాలని, అచేతనమై చూస్తున్న ప్రేక్షకులం. కారు కూతలు వింటున్న శ్రోతలం. మహా అంటే నాలుగు మాటలు బ్లాగుల రాసి, ఫోనులు చేసి..సానుభూతి తెలిపెతోల్లం. ఇంకా చావొద్దు అని కేకలు పెట్టేతోల్లం. అంతే! అయ్యో, మీకెట్ల చెప్పాలే..మేమంతా జీవచ్చావలమై బతుకుతున్నామని, మీ చావులు మమ్మల్ని ఎంత క్రుంగ దీస్తాయో ఎట్లా చెప్పాలే.
సచ్చి సచ్చి మీకు విసుగు వస్తలేదా తమ్మి? బ్రతికున్న మాకు మాత్రం విరక్తి పుడుతుంది, ఎందుకు మీకు ఈ చావులు, తలి తండ్రులకు కడుపు కోతలు, మా లాంటి ఉద్యమ కారులకి గుండె కోతలు? మేము జీవితాంతం మీ చావులని చూసి చావలసిన్దేనా? నివాళిలు, సంస్మరణ సభలు, కొవ్వొత్తుల రాలీలు.. ..అలసి పోయినం, ఇంకా వోపిక లేదు తమ్ముల్లారా, అన్నల్లార..కలిసి బతుకుదాం, కలిసి పోరాడుదాం! మా నాయకులకి టీవిల్లో పండుగ, ఒకడిని ఒకడు తిట్టుకొని, ఎవరి తెలివి ఎంత ఉందొ చూపించు కోవడం లో బిజీ, మేము కూడ, క్రికెట్ చూసినంత క్రేజ్ తోని, ఒక్క మాట సీమ ఆంధ్ర నాయకుడిని మావోల్లు ఏమైనా అంటే జై కొడతాం, నీ చావుకు సమాధానం డిబేట్ లు కాదు, నీలాగా ఇంకొకడు చావకుండా ఉండేందుకు మార్గాలు వెదకటం..ఒక్క రక్తం చుక్క చిందకుండా ఉద్యమం చేసినం అనే వాళ్లకి ఒకటే ప్రశ్న..రక్తపు చుక్కలు కాదు, శవాలు గుట్టలు ఐ పడుతున్నై, ఇది హింస కాదు..పిరికి, పిచ్చి తనం, కదా! మీ వ్యూహాత్మక మౌనాలు, ఎవడో ఏదో చేస్తాడని చూడడాలు, దాగుడు మూతలు, తెలంగానానని కేవలం కాంగ్రెస్, టీడిపి లకు వదిలేసి, చేతులు దులుపుకున్న నాయకత్వం, సంఘాలు, జాక్లు..ఎం చేయాలే, ఎవడిని అడగాలి, ఉద్యమానికి దిక్కు లేదు, నాయకులు లేరు, అపుడపుడు మాట్లాడితే, మాట్లాడే బొమ్మలం ఐటము కాని నాయకులం కాదు. ఆనాడు రాజశేకర్ రెడ్డి ఈ గడ్డ దాటి అవతలకి పోయి, తెలంగాణాకి పోవాలంటే వీసాలు కావలె అని కూసిండు, ఇయ్యాల టిడిపి వాళ్ళు గుంటూర్ల కూసోని ఆత్మాహుతి దాడులు చేస్తాం అంటున్నారు. దోచుకున్నోడికి అంత బాధ ఉంటె, డబ్బు సంచులు పోతాయే అని బాద ఉంటె, అంత పౌరుషం ఉంటె, ఇన్ని పానాలు పోగొట్టుకున్న మనకు ఒక్కనాడన్నా పౌరుషం రాదేం? ఎందుకు మాకు ఈ మాటలు , మంతనాలు? నీ చావు పోరాటాన్ని వెనుకకు తీసుక పోతుందీ కాని ముందుకు తీసుక పోతలేదు..మీ కోరికలు, తీరని కోరికలై మిగలనున్నాయి. ఎవడు చలిస్తాడు మన చావులని చూసి? రక్తం మరిగిన పులి లెక్ఖ పదవులకి మరిగి, పైసల దాహం తీరకుండా ఉన్నారు..పార్లమెంట్ల తమ్ముడు చస్తే మనసున్నోడు ఎం చేయాలే? సోనియమ్మ బొమ్మ తగలేయ్యలె, పార్టీ సబ్యాత్వానికి రాజీనామా చెయ్యాలే..మీరు కూడు పెట్టలేక పొతే, దేశాలు పట్టుకు పోఇనం, మీరు భూములియ్యకపోతే, నీల్లియ్యకపోతే , పోరాగాన్డ్లని బిచ్చగాళ్ళుగా చేసి రోడ్ల మీద పడ్డం, ఇపుడు, మీకు కళ్ళు తెరిపించడానికి శవాలామై వ్రేలాడుతున్నాం, తమ్మి నువ్వు ఊరి వేసుకున్న చెట్టు ఎంత బాద పడ్డాడో తమ్మి, నీలాంటి మంచోళ్ళు ఈ లోకం ఇడిచి పోతున్నారని, కాల్చుకున్నం , బూడిదయినం, , కోసుకున్నాం , ముక్కలు ముక్కలు అయినం, ఏమ్చేయలె, నాచావు చూసి అయినా..ఎంత మంది రాసిన్రో అమాయకులు.., పెన్నులు గన్ను లైతాయి అంటరు..నువ్వు చనిపోయే ముందు నువ్వు రాసిన పెన్ను ఒక్కటన్నా బాంబు అయి ఒక్కొక్కడిని పెల్చలేదా? గన్నులై పెలలేవా? మాకు మాట మాత్రం అన్న చెప్పలేవా మైకులై? మాఫ్ కరో భాయియో..హమ్ హార్ గయి!
హైట్ అఫ్ చీటింగ్! హిపోక్రసి, డిసీట్! బిడ్డ పుట్టాలి అంటే పురిటి నొప్పులు పడాలే, విత్తనం మొలకేత్తలంటే భూమి చీల్చుకు రావాలే, ఒక గాయం మానాలంటే , అది కాన్సర్ కాకుండా ఉండాలంటే దానిని పెకిలించి తీయాలే..భాద అనివార్యం, కాని ఫలితం శాశ్వతం..శత్రువుని జయించాలంటే వాడి నాడీ మీద దెబ్బ కొట్టాలె..మన సీమాంద్ర కుక్కలకు ఇక్కడ ప్రాంతం మీద ప్రేమ అంటే కేవలం వారి వ్యాపారాలు, డబ్బులు..వాటికి దెబ్బ తగలకుండా..నువ్వు నేను భాయి భాయి అన్నంత కాలం తెలంగాణా రాదు! ఇంత చిన్న విషయం మనకు తెలవదా అంటే తెలుసు కాని, వాళ్ల లావా దేవిల్లో మనం కూడా ఉన్నాం కదా, నిజాలు బయట పెట్టడానికి దిలీప్ అన్న లాంటి వాళ్ళు తలచు కుంటే పెద్ద కష్టం కాదు! ఒద్దులే, ఆ పాపాలు చూసి మల్లెంత మంది చస్తారో. అమ్మ దిగి రావాలంటే మన అసలు రూపం చూపించాలే..అమ్మ బొమ్మ పెట్టుకుని, యాది రెడ్డి మారణ వార్త కు సంతాపం ప్రకటించడం కాదు నాయకుల్లార! న్యాయం వైపు ఉండండి, మీరు కుక్కల్లెక్క పదవులు ఇడవరు అని , ఆ దేవతకి తెలుసు, అన్ద్రోల్లకూ తెలుసు.. అంతా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదిన్చేతంతా గొప్ప నటులు అని మాకు తెలుసు, తెలవనిదల్లా మా పిచ్చి పోరాగాల్లకు మాత్రమె. ఒకడు చంద్రబాబు బొమ్మ పెట్టుకొని తెలంగాణా తెస్తాడు అంటడు, మేము నమ్మాలే..లేకపోతె చేసేది ఏమి లేదు..ఇక్కడ అడ్డుకునే శక్తులు కాని, నోరు మూయించే ప్రయత్నాలు జరుగవు..ఇంకొకడు సోనియమ్మ బొమ్మ కి భక్తి పూర్వకంగా పూజ చేస్తుంటాడు, యాది రెడ్డి శవం సాక్షిగా! అయినా వాడు కూడా తెలంగాణా తెస్తాడని నమ్మాలె..ఇంకొకడు దొరికిందే చాన్స్ అని దొంగ సంతకాలు, దొంగతనంగా దోచుకుంటాడు, మళ్లీ మా మౌనం, కోయి బాత్ నహిన్ భాయ్! ఆఉర్ ఎక్ లాష్! ఆజ్ నహిన్ తో కల్! యది రెడ్డి నహిన్ తో యదయ్యా! కుచ్ ఫరక్ నహి పడ్తా! ఆజ్ మరే తో కల్ దూస్ర దిన్! అసలు రాజకీయ నాయకులకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంత సోనియంమేనా లేకపోతె లగడ పాతినా, ఏదో ఒకటి తెల్చేసేయండి, సస్పెన్స్ తో మరీ చస్తున్నాం..మీది అంతా ఒకటే కులం, మతం..భాషా..డబ్బు! డబ్బు! డబ్బు!
ఆదివారాలు వంటా వార్పులు, సోమవారాలు నిరాహార దీక్షలు, ఇట్లా అన్ని వారాలు మొక్కులు మొక్కుకుంటే తెలంగాణా రాదు. ఇంత మంది మేధావులకి ఇంత చిన్న విషయం తెలవదా లేక మజాక్ గిట్ల చేస్తున్నర..పోరగాండ్లు చస్తున్నారు, ఇంకా బందు పెట్టండి చచ్చు పోరాట రూపాలు. ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు ఐతరంతా..ఇన్నేండ్లు సావాసం చేసి మీరు వారు ఐన్రా నాయకులారా? పిల్లి పిల్లలను కాపాడుకుంటది, పులి కూడా పంది కూడా, జంతువులు పక్షులు అన్ని తమ పిల్లలని ప్రాణం అడ్డు వేసి, అడ్డం వొచ్చినోడ్ని చంపి మరి కాపాడుకుంటాయి. ఇంత పెద్ద తెలంగాణాల , ఇంత బలగం పెట్టుకొని మనం మన పిల్లలని ఎందుకు కాపాడుకోలేక పోతున్నాం? వారు ఏదో కమిటీ వేస్తారట అందులో మూడు ప్రాంతాల వారు ఉంటారు అంట , . ఒక్క లగడ పాటి ఉంటె చాలు క్రిష్న కమిటీనే కొని పాడేసిండు..ఇంకా పది మంది తోటి మీ చాత కాదులే కాని, కమీటీల జోలికి పోకండి జర! రాజీనామాలు కాదు , దమ్ముంటే సభ్యత్వానికి రాజీనామా చేయండి, అందరం అన్ద్రోల్ల కి చాయ్, ఇడ్లి లు అమ్ముకుంటూ బతుకుదాం, సెక్రటేరియట్ ముందు..
హెల్ విత్ పొలిటిషియన్స్! తెలంగాణా పౌరుషం చూపే సమయం వచ్చింది..లోపట ఉన్న పులిని రెచ్చ కొట్టండి, దొంగ వెధవలు పిల్లుల్లెక్క పారి పోక పొతే చూడండ్రి..సామ ,బెద , దాన, దండోపాయాలు..పెద్దలు చెప్పినవే.
యాదిరెడ్డి ఆత్మ ఘోష , వేదన ఒక్క నాయకుడిని అన్న మార్చుతుంది అనే ఆశతో!
జై తెలంగాణా!
Courtesy – Sujatha Surepally, thank you for sharing.
Related posts:
- Resignations are not valid – Assembly Speaker
- ‘Andhra’ bhavan arachakam
- Samaikyandhra – oka portatam kadu, it is a poti
- Deeksha viraminchandi – KCR
- Dhikkaristhunna Telangana – Deeksha Telangana
- KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
- Eulogy on Prof. Jayashankar – ఏమైతవు నువ్వు నాకు
- Telangana Raktha Kanniru
- Icchedhi meerey… Natteta munchedhi meerey
- CBN, kottha vesham


Tweet This
Digg This
Save to delicious
Stumble it