Payyavula ‘Kasab’

News pulse, Politics | admin | July 21, 2011 at 4:02 am


- మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానీయం
- సమైక్య రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి
- అనాలోచిత నిర్ణయాలను సహించం
- విభజనకు ఒప్పుకునేదే లేదు
- సమైక్య రాష్ట్రంపై సోనియా ప్రకటన చేయాలి
- గుంటూరులో పయ్యావుల కేశవ్

‘‘మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానీయం. కేంద్రం
తెలంగాణ ప్రకటిస్తే ఆత్మబలిదానాలే కాదు.. అవసరమైతే
ఆత్మాహుతి దాడులకు సిద్ధం. అనాలోచిత నిర్ణయాలు
తీసుకోవద్దు. అవసరమైతే దాడులు జరుపుతాం….’’
- పయ్యావుల కేశవ్

నిన్నగాకమొన్న ఢిల్లీలో సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు మూడు రోజుల పాటు మకాం వేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునేందుకు ఆఖరి ప్రయత్నాలు చేశారు. భారీ ఎత్తున గ్రంథం నడిపారు. ఇక్కడ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు సైతం తామేమీ తక్కువ తినలేదన్నట్లు రెచ్చిపోయారు. తెలంగాణపై సానుకూల సంకేతాలను ఓర్వలేక.. తమ నిరాశ నిస్పృహలను బయటపెట్టుకున్నారు. ప్రత్యేక ఆకాంక్షపై నిప్పులుగక్కారు. గుంటూరులో సభ పెట్టుకుని శివాపూత్తారు. రెండడుగులు ముందుకేసిన కేశవ్… తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడానికి అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సైతం సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

‘‘తెలుగు జాతి సమైక్యత కోసం రాజీనామాలే కాదు.. దేనికైనా సిద్ధం. కేంద్రం ఆత్మ విమర్శ చేసుకోవాలి. కేంద్రం తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. సమైక్య రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందనే విషయం మర్చిపోవద్దు. మా దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానీయం. కేంద్రం తెలంగాణ ప్రకటిస్తే ఆత్మబలిదానాలే కాదు.. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు సిద్ధం. రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మారిస్తే ఊరుకోం. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. అవసరమైతే దాడులు జరుపుతాం. రాష్ట్ర విభజనకు ఒప్పుకునే పరిస్థితి లేదు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని సోనియా స్పష్టమైన ప్రకటన చేయాలి. తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేసిన టీడీపీని దెబ్బ తీయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. 2009 డిసెంబరు 9న కేంద్రం ప్రకటన తరువాత ఆంధ్రలో ఉద్యమాలు చేసి 20 రోజుల్లో కేంద్రం మెడలు వంచి రాష్ట్ర విభజనను అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటే. కేసీఆర్ బెదిరింపులు చెల్లవు. మీరు అందరితో రాజీనామాలు చేయించడానికి రెండేళ్లు పట్టింది. తెలుగుజాతి సమైక్యత కోసం రాజీనామాలే కాదు దేనికైనా మేం సిద్ధం. కేసీఆర్… సీమాంధ్ర నేతలపై విరుచుకుపడుతున్నావు. చరివూతలో కలిసిపోయే రోజులు వచ్చాయి’’ అని పయ్యావుల హెచ్చరించారు.

తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగు జాతి మనది.. అంటూ పాటలు పాడుకున్న తెలుగుదేశం నాయకులు.. తమ నిజస్వరూపాన్ని ఇప్పుడు నగ్నంగా బయటపెట్టుకున్నారు. తెలుగు జాతి విడిపోవడం అన్యాయమన్నట్లు ఆక్రోశం వెళ్లగక్కారు. తెలంగాణవాదులు అడుగుతున్నది ఒకప్పటి రాష్ట్రాన్ని మళ్లీ ఇవ్వమనే! ఒకప్పుడు దగాకోరు ఒప్పందాలతో కలిపేసుకున్న ప్రాంతాన్ని మళ్లీ విడదీయమనే! దీనిని గుర్తించనిరాకరిస్తున్న టీడీపీ నేతలు.. బెదిరింపులకు దిగుతున్నారు.
పదేళ్ల మలి విడత తెలంగాణ ఉద్యమంలో గానీ.. రెండేళ్లుగా ఉధృతమైన పోరాటంలో గానీ తెలంగాణ బిడ్డలు రాష్ట్ర ఆకాంక్షను వెల్లడించేందుకు తమను తాము కాల్చుకుని ఆహుతయ్యారు తప్పించి.. ఏ ఒక్క సీమాంవూధుడిపైనా దాడికి దిగింది లేదు.

ఆవేశంలో అద్దాలు పగలగొట్టారేమోగానీ.. తెలంగాణ వనరులను కొల్లగొడుతున్న సీమాంధ్ర పెట్టుబడిదారుల ఆర్థిక ప్రయోజనాలను అడ్డుకున్నది లేదు! ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న టీఆర్‌ఎస్ కూడా పార్లమెంటరీ పోరాటాలకు, ప్రజాస్వామ్యయుత ఆందోళనలకే మొగ్గు చూపింది తప్పించి.. ఏనాడూ సీమాంధ్ర నేతలపై భౌతిక దాడులకు పిలుపునిచ్చింది లేదు.

కానీ.. తెలుగుజాతి ఐక్యత ముసుగులో వెంపర్లాడుతున్న సీమాంధ్ర టీడీపీ నేతలు మాత్రం.. వారు ప్రవచించే ‘తెలుగు జాతి’ మధ్య విద్వేషాలు రెచ్చగొ సిద్ధపడటమే దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. వారి అసలు ఉద్దేశాలపై అనుమానాలు రేకెత్తిస్తోంది. తెలుగుజాతిలోని తెలంగాణ ప్రజల పట్ల టీడీపీ నేతల అసహనాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది ఏ తరహా ‘తెలుగు జాతి ఐక్యత’కు దోహదం చేస్తుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమని కోరుతుంటే.. ఆత్మాహుతి దాడులు చేస్తామని బెదిరించడం ఏ తెలుగు జాతికి నిండుతనం తెస్తుంది? రెండు రాష్ట్రాలుగా తెలుగుజాతి మనలేదా? రెండు నిండు తెలుగు రాష్ట్రాలుగా తెలుగుజాతి అభివృద్ధి పథాన దూసుకపోలేదా? పచ్చపార్టీ సారథులారా.. ఏమిటీ మీ సమాధానం?

‘మా సహనాన్ని పరీక్షించొద్దు. ఇక్కడ ఎవరూ గాజులు తొడుక్కొని కూర్చోలేదు. దాడులను తిప్పి కొట్టే శక్తి మాకుంది. పిచ్చెక్కి, మదమెక్కి మాట్లాడుతున్నారు. టీజీలు, కేశవ్‌లు, రేణుకాలు… వీరంతా పేపర్ టైగర్లే. మేం ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు’
- మధుయాష్కీ, ఎంపీ

కేశవ్ ప్రకటన చాలా బాధాకరం. ఆయన మాటలను రాయలసీమ ఫాక్షన్ మాటలుగానే భావించాల్సి ఉంటుంది. ఆత్మాహుతి దాడులు వంటి మాటలు రాయలసీమ జిల్లాలకు పరిమితం చేసుకోవడం ఆయనకే మంచిది.
- కె.స్వామిగౌడ్, ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్

Source – NamastheTelangaana

Related posts:

  1. We will not contest from Banswada – TDP
  2. Telangana thappademo?
  3. Will Coastal Andhra and Rayalseema be together?
  4. Harish Rao fires on Subbarami and Renuka
  5. Tears rolled down KCR’s eyes
  6. Asalu doshi Congress
  7. T supporters pull mike from Revanth Reddy
  8. What did KCR do for Telangana – Erraballi
  9. Panthulla madhya chicchu
  10. Telangana increment – KCR

Leave a Reply

Spam protection by WP Captcha-Free