Resignations are not valid – Assembly Speaker

News pulse, Politics | admin | July 23, 2011 at 3:58 pm


అనుకున్నంతా ఐతుంది, కాంగ్రెస్ మళ్లీ మోసాలకు, ద్రోహాలకు పాల్పడుతుంది, ఆజాద్ అడ్డగోలు మాటలకి పిల్లలు పిట్టల్లగా చచ్చి పోతున్నారు , ఇవాళ కరీంనగర్ లో రాజి రెడ్డి అనే అటో డ్రైవర్ , ఆజాద్ కాలయాపన మాటలకి మనస్తాపం చెంది పోతున్నాను అని రాసి పెట్టి అందనంత దూరాలకు పోయిండు. యాది రెడ్డి మరణం కలిచి వేసిందేమో, అట్లనే ఉరి పెట్టుకుని పాయిండు..ఇది పిరికి చర్య? అవును దైర్య పూరితమైన చర్యలు , కనుచూపు మేరలో ఎక్కడా కూడా తెలంగాణా జాడలు కనపడనపుడు ఎంచేయాలి, ఎం చేస్తారు? చేయగలరు, ఒక బలహీన పరిస్తితిలోకి నెట్టి వేయబడుతున్న పరిస్తితుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలె? కళ్ళ ముందే రాలి పడుతున్న యువ ఉద్యమ తారలను, తెలంగాణా ముందు మా ప్రాణాలు లెక్ఖ కాదు అని వందల్లో ఎగిరి పోతున్న ప్రాణాలను ఎట్లా కాపాడాలే? చనిపొఇన వాడు పేద వాడు ఐతే, ఆకలి , అప్పుల కోసం చని పోయాడు అంట,పోలీసుల కొత్త భాష. అంతో కొంతో సూసైడ్ నోట్ రాసి పెట్టి చని పోతున్రు పిల్లలు, లేకపోతె ఏన్ని కథలు అల్లుతున్దేనో. ఇవాళ శవాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ ల ధర్నా చేస్తామని స్తానిక ప్రజా ప్రతినిధులు కొద్దిగా ప్రయతినిన్చిన్రు, అందులో గంగుల కమలాకర్, టిడిపి ఎమెల్యే, టిఅరేస్ కార్యకర్తలు, కాని పోలీసులు ఎట్టి పరిస్తితిలో కూడా వొప్పుకోలేదు , చివరకి అ’జాదూ’ పేరు ఉంది కాబట్టి , ఈ చావుకి ఆయనే కారణం అని ఎఫైఅర్ బుక్ చేయమని అడుక్కున్నారు ,ఈ దేశంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడి మీద కేసులా? అందునా తెలంగాణా వాడు పెడితేనా? నాట్ పాస్సిబుల్! ప్రపంచంలో అతి పెద్ద డెమోక్రసీ అని మురిసే గొప్ప మేధావులకి, తెలంగాణాల పర్యతించమని చెప్పండ్రి మిత్రులారా! తమ్ముడు ఒక్కడే అమాయకంగా మార్చురీలో పడి ఉన్నాడు రాజి రెడ్డి, కడుపులో దేవినట్టైంది, ఒక కాలు పొఇన తండ్రి, ఒక్కగానొక్క కొడుకుని పొగుట్టుకొని గుండె పగిలేల రోదిస్తున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు బిక్కు బిక్కుమంటూ, ఊర్ల ఉంటె తెలంగాణా అని తిరుగుతున్దమ్మ , అందుకే ఈడ బెట్టిన, కాని ఇట్లచేసి పోయిండు అని శూన్యం ల చూస్తూ లోపట లోపట గోనుక్కొంటుఉండు నాయన ,ఈ భాదని ఏమంటారు? ఇది హింస కాదా అని ఒక్కసారిగా గట్టిగా అరవాలని పించింది, అక్కడ శవ రాజీకీయాలు చేయాలని చూసే నాయకులను చూస్తె , ఎవ్వరి మీదనో పట్టరాంత కోపం , బాదా! ఇంకా ది గ్రేట్ తెలంగాణా అని గర్వ పడాల్నా ఇవన్ని చూసి . కూడ కల్గినై. అవును, ఇవి పిరికి చావులు, అమరుల జాబితాలలోకి రావు, ఆత్మ హత్యలు గా కాదు, కనీసం హత్యలుగా గుర్తించాలి కదా..అసలు చచ్చినంక ఇక్కడి రాజకీయాలు చూసి ఇంకెంత ఆగమైతాయో తమ్ముళ్ళ ఆత్మలు.

అన్న నాదెండ్ల హాయిగా విదేశాలకి పోయిండు, నూటొక్క ఎమెల్యేలు/రాజీనామాలు చెల్లవు అంట ! వాళ్ళు చెల్లని నోట్లు అని మాకు తెలుస్తనే ఉంది, కాంగ్రెస్ ఆడే నూతన అద్యాయంలో అన్ని పార్టీలు పావులు అని అర్థం అయితూనే ఉంది, ఎమ్మెల్యేలు లోలోపల ఎంత ఖుష్ అయింరో, ఎగిరి గంతేసి ఉంటారు బహుషా: కాంగ్రెస్ కావలసినంత కాలయాపన చేసి, ఎటు చెప్పకుండా రోజులు గడుపుతున్న అధిష్టానం చూస్తుంటే ఎవరికీ అనుమానం కలగ పోవడం నిజంగా ఆశ్చర్యం. ఒక్క మెతుకు పట్టుకుని చూస్తె తెలవదా, అన్నం ఉడికిందో లేదో? చివరికి తెలంగాణా ఉద్యమం, రాజీనామాలు భావోద్వేగం తో కూడినది అని తెల్చేసిన్రు. నిన్నటికి నిన్న ది గ్రేట్ ఆజాద్ గారు అసలు తెలంగాణా ఎందుకు అని ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న వేసారు అంట ? అన్న ఆజాదు, నీ జాదులకి ఇంకా నూకలు చెల్లిపొఇనై, ఇక్కడ ఆత్మహత్యలు ఇంకొక రూపం తీసుకుంటే, నువ్వు , నీ అధిష్టానం ఇక్కడనే తిష్ట వేసుకొని, తెలంగాణాని పువ్వుల పెట్టి ఇచ్చి పోతారు, అది కూడా అలోచిన్చుకొంద్రి, మా పోరగాండ్ల తలితండ్రుల ఉసురు తగిలి మీ పార్టీలన్నీ నాశనం అయి పోతాయి రా, ఆ రోజు ఎంతో దూరం లేదు.

కాలయాపన కాలక్షేపాల రాజకీయాలు నేర్చుకోవాలంటే కాంగ్రెస్ స్కూల్ లో చేరండి, స్పెషల్ ట్రైనర్ , అల్ ది వే ఫ్రం ఇటలీ, కాల్ల్ద్ సోనియా, ది హై కమాండ్ ! మన దళితులను పట్టుకొని తలలు పగల కొడితే మాకు చీమ కుట్టలేదు, ఒక్క చానల్ ప్రసారం చేయది, పేపర్ రాయది, ఒక్క దళిత నాయకుడికి ఆంధ్ర ల కాని, తెలంగాణాల కాని అసలు వినపడది, కనపడది, కృష్ణన్న జర చూడ రాదే! పౌరుషం సచ్చి పోయింది కదా, కాళ్ళు మొక్కి మొక్కి, అడుక్క తిని తిని, చచ్చు పడి పోఇనం, పాపం ఒక గర్బిని పిల్లని కింద పడేసి కొడితే రక్తస్రావం అయింది, ఒక్క పూట మొక్కు కోసం పొతే పట్టలేని ద్వేషం వాళ్లకు ఉంటె, మనల్ని జలగల్లాగా పట్టి పీడిస్తున్న వాళ్ళని దశాబ్దాలుగా ఎట్లా భరిస్తున్నాం? భరిస్తాం? ఇప్పటికే కులాల చిచ్చు రేపిన్రు, మన మధ్య మనకే లొల్లి షురూ చేసింరు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్రు, ఎంతకైనా తెగించే నీతి జాతి లేని మనుషులని మనకందరికీ తెలుసు, ఇంకా శాంతి, సహనం, సహనం.

అయ్య, జాకుల్లార! రాజకీయ నాయకుల్లార, సంగాల్లారా! ఇంకా కుక్కల్లెక్క పడి గాపులు ఆపండి, ఊహాల్లోకాలలో విహరిన్చొద్దు, కొద్ది రోజులైతే ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని కూడ మాయ చేసి రాజీనామాలని వాపసు తీసుకోమ్మంటారని మాకు తెలుసు, మీరు కూడ మొక కోసం చూస్తుండి ఉండొచ్చు. ఇంకా మీకు ఇట్లాంటి పార్టీలు అవసరమా? పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయండి, మేమందరం మిమ్మల్నే గెలిపిస్తాం. ఇంతా జరుగుతుంటే ఒకాయన జెండా పండుగ చేస్తా అంటడు, ఏమిటికో అర్థం కాదు, కనీసం ఉద్యోగ సంగాలు ప్రభుత్వాలని స్తంబింప చేస్తాయని ఆశ, ఇవాళ టీవి నైన్ చానలు కథ అయిపాయింది, అట్లనే అన్ని చానల్లకి, పేపర్లకి, వస్తువులకి, సినిమాలకి మనమందరం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందాం, ఉడతా భక్తిగా.

ఇపుడు చర్చలు ఇందిరా భై! అది కూడా అన్ని ప్రాంతాల వారిగా, కథ మళ్లీ మొదటికి, పండగ చేసుకోండి రా! మా చావుల మీద పేలాలు ఏరుకుంటూ, ఎంజాయ్ చేయండి, మా పోరాగాల్లె ఏదో ఒకటి చేస్తారు, అప్పటిదాకా..వెయిట్ అండ్ వాచ్ డైలీ స్టోరీస్.

నా దగ్గర నీకేం దొరుకుతుంది
ఒక గాయం దొరుకుతుంది
ఒక గేయం దొరుకుతుంది
మాటల ఈటెల భావాల బాంబులున్నై
ఇవి ఎక్కడ పెలతాయో తెలుసా
చెమటతో సిరిచెట్టు పెంచబడే చోట
రక్తంతో రాహువుల పొట్టలు నిండే చోట(శివా రెడ్డి)

ఒక్కో శవం ఒక్కో బాంబై పెలేచోటు..
నా మట్టి మీదా నీ ముద్ర పడిన ప్రతి చోటు

Courtesy – Sujatha Surepally, thank you for sharing.

Related posts:

  1. Prajala chethila Telangana udyamam
  2. ‘Andhra’ bhavan arachakam
  3. Parliament kaada paanam vadhilindu
  4. Is KK’s proposal valid?
  5. I dare Nagendar, Mukesh to come out of Hyd
  6. Chances of Chiranjeevi to be CM?
  7. Prantheeya Mandali? Dy CM in Delhi
  8. Jayasudha avoiding Jagan’s party?
  9. Chalo Assembly on Feb 21 – TSJAC
  10. Madhu Yashki masthi

Leave a Reply

Spam protection by WP Captcha-Free