Telangana in cross roads

News pulse, Politics | admin | July 17, 2011 at 9:28 am


విజయ వంతం గా ముగిసిన రైల్ రోకో, మొత్తం దేశానికి సంకేతం పంపింది, 55 కోట్లకు పైగా నష్టం, 148 రైళ్ళు నిలిపి వేత..అందరి నోట్లో నానుతున్న తెలంగాణా. ఇంకా ఇక్కడ అంతే విజయవంతంగా ముగిసిన కాంగ్రెస్స్ నాయకుల దీక్ష విరమణ, బోమాయి బాంబు పేలుళ్లు అంట అందుకే రేపటిది ఇవాల్నే ముగించిన్రు , అసలు ఎంత విషాదం అంటే వాళ్ల క్లోసింగ్ సెర్మనీ చూస్తె ఎవరికైనా అర్థం అవుతుంది . బలవంతంగా విధ్యార్తులతోని దీక్ష విరమింప చేసిన నేతలు. అవును, కెసిఆర్ గారు జోస్యం చెప్పారు, రెండు వారాల్లో తెలంగాణా అంట! అన్నా! నీ నోట్లో ఘీ షక్కర్! వస్తే సరే అన్న, రాక పొతే ఏమ్చేయాల్నో చెప్పవైతివి కాదె! అవును దీక్షలు వద్దు, ఇయాల్టి లెక్ఖ నాలుగు రోజులు రైళ్ళు, హైవేలు బందు బెడితే సోనియమ్మ ఫ్లైట్ ల వచ్చి మరి తెలంగాణా ఇస్తాది కాదె, జర సోచాయించు. నువ్వు కాంగ్రెస్స్ కండువా ఎసుకున్నవని అపుడే చర్చ మొదలైంది. మాకు ఎం దౌర్భాగ్యమో కాని, అన్ని అనుమానాలే, ఎం చెప్పాలే, మోస పోయి, మోస పోయి..ఆఖరుకి మమ్మల్ని మేమే నమ్మకుండా తయారు ఐనము, తెలంగాణా రాబోతుందని, ఎవరు అయన చివిలో రహస్యంగా చెప్పి ఉంటారు? ఎంతో ఉత్సాహం గా ఉంది కదూ వింటుంటే ? లేదా ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు కదా..చిలక జోస్యం చెప్పి ఉంటుందా..కొంపదీసి సోనియమ్మ రాయబారం పంపలేదు కదా..ఎలాగు నువ్వు, నేను భై భై సారీ భాయి భాయి కదా అని? ఏది ఏమైనా, ఇవాళ కాంగ్రెస్స్ వాళ్ల డాన్సులు చూస్తుంటే అపుడే తెలంగాణా వచ్చేసినట్టుంది. అది కెసిఆర్ తమ పార్టీలో కలుస్తున్నాడు అని కావొచ్చు, లేదా ‘మేము’ అందరం ఒకటే కదా, అతి పెద్ద అడ్డంకి అన్న కెసిఆర్ మా వడిలో వచ్చి పడ్డాడు కదా అని కూడ కావొచ్చు. లేదా, విధ్యార్థులని చివరాకరికి ఒప్పించినాము అని కూడ ఉండొచ్చు..ఏది ఏమైనా ప్రజలు ఒక వైపు , రాజ కీయ నాయకులు ఒక వైపు స్పష్టంగా విదిపాయింరు అని చెప్పక తప్పదు. సెన్సెషనల్ మాటల్లో, చేతల్లో కెసిఆర్ తరువాతే ఎవరైనా..నిన్నటికి నిన్న మధు యాష్కి దశ దిశలోని మాటలు, రాజీనామాలతోటి తెలంగాణా రాదు, కెసిఆర్ పార్టీలో కలుస్తూనే వస్తుంది అని..ఇంతలో అన్న షాక్..రాజ కీయాల్లో బద్ధ శత్రువులు, మిత్రులు ఉండరంటారు..అవును, ఒకటే కులం, మతం, భావం, భావ్యం కదా!

ఒక వైపు లేక్ఖలు వేసుకుంటున్న సీమాంధ్ర..హైదరాబాద్ మరియు పోలవరం..ఇవి రెండు కాకపొతే అట్లీస్ట్ పోలవరం..మన నాయకులకి ఇప్పటిదాకా పోలవరం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు..౩౦౦ వందల ఆదివాసి గ్రామాలు..లక్షల్లో కనుమరుగు కానున్న అతి ప్రాచిన మైన జాతి, భద్రా చలం, మాయం కానున్న దండకారణ్యం అటవీ సంపద, విదేశాల్లో అందరు చరిత్రని, సంస్కృతిని, ఆదివాసిలని అత్యంత కట్టు దిట్టమైన చట్టాలతో కాపాడుకుంటారు, మనకు అవేమి లేవు, ఇప్పటికే మైనింగ్ మాఫియ ఉత్తర తెలంగాణా లో జరుపుతున్న విద్వంసానికి అనేక చారిత్రిక ఆవేశేశాలు మట్టి కరువనున్నాయి, సగం వరకు నాశనం కూడ అయినాయి , మనకు చీమైనా కుట్టదు. ఎంతో విలువైన జైన , భుద్ధ, చాళుక్య, శాతవాహన కాలం నాటి కట్టడాలు, గుర్తులు, అన్ని మాటు మాయం..ఇవి దోచుకోనేది మనవారే సుమా , కాకపొతే సీమాంధ్ర నేతల భాగస్వామ్యంతో మాత్రమె. మేము హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టినాము అని గగ్గోలు పెట్టే వారికి , మన నీళ్ళు దోచుకొని ఎంత సంపాదిన్చిన్రో అడిగితె ఇంకా ఎన్ని జన్మలు వాళ్ళు పైసల్ iyyalno లేక్ఖలు వేయొచ్చు . వాళ్ల రియల్ ఎస్టేట్లు , కార్పొరేటు చదువులు , హాస్పతల్లు మనకి ఎందుకు , తీసుకొని పొమ్మని అడుగుదాం . వాళ్ల sopati kalala కూడ అనుకుంటే , సచ్చిన అన్న తమ్ముళ్ళ ఆత్మలు భాద పడతాయి, బతికినంకా ఎట్లాగు సుకం లేక పాయె, సచ్చినంక కూడ వదిలేది లేదా? అయినా ఇవన్ని మాట్లాడే ఓపిక ఎవరికుంది..ఏమైనా దోచుకో..జస్ట్ తెలంగాణా ఇస్తే చాలు..అంత పీల్చి పిప్పి చేసి ఇచ్చిన తెలంగాణని ఏమ్చేసుకుంటారు ఈ రాజ కీయనాయకులు? మరో సోమాలియా , మరో పేద ఆఫ్రికా దేశం లాగ జీవితాంతం అడుక్కుంటూ బతుకుదామనా?

ఎండాకాలం సల్ల వాన బడ్డట్టు , మా ఉద్యోగ సంఘాలు సల్ల కబురు చెప్పిన్రు, సింగ రేని జంగు సైరన్ మోగించింది, ఎన్ని రోజులో ఏమో..మల్లా కెసిఆర్ కి కల బడితే వాళ్ళు కూడ విరమిస్తారు. అసలు ఒక రోడ్ మాప్ వేసుకొని ఒక్క పది రోజులు తెలంగాణాని దిగ్బంధం చేసే ఆలోచన ఎవరికీ వస్తలేదు..పిల్లల ప్రాణాలు భాద్యత అంతా మాదే అని చాల వింత కబుర్లు చెపుతున్రు..అన్న చెవిలో పువ్వు కనపడుతున్నాడే? ఎక్కడి పువ్వు రా బాబు ఏకంగా మహా వృక్షాలే పెడుతుంటే, అందుకే ఇయాల కూడ కరిమ్నగర్ల మా పోరగాడు సచ్చిండు..వీళ్ళ సావులు ఆగవు, వాళ్ల ఎత్తులు ఆగవు..ఎట్లా అర్థం చేసుకోవాలె ఈ చదరంగాన్ని? ఎవరు విప్పుతారు ఈ చిక్కు ముడిని, ఏదో సామెత లాగా..నాకు శత్రువు ఎవరో తెలుసు కాని , మిత్రుడిని చూపించు అని..మిత్రువు రూపం లో ఉన్న శత్రువుని ఎట్లా కనిపెట్టడం? క్రికెట్ మీద కంటే జోరుగా సాగుతున్నవి బెట్టింగులు, డబ్బులమిద, పానాల మీద..

బెస్ట్ డీల్ ఏందంటే, ఎవరు ఎవరితో ఐన కలవని..తెలంగాణా పై స్పష్టమైన ప్రకటన, పార్ల మెంట్లో బిల్లు, ఇవి రెండే ప్రజలకి కావాలి, అందరు చెప్పే జోస్యం, 2014 వరకు కాంగ్రెస్ ఇవ్వదని, పదవులు కాపాడుకోవడానికి ఏదో ఒక ‘మాజిక్ మంత్ర’ ప్రత్యక్ష మైతుందని , మనం మురిసి పోవాలి లేదా మాయ మాటలకి నోరుమూసుకోవాలి, మరి బలహీన మనస్కులు ఉంటే రాలి పోవాలి, కాస్త పౌరుషం ఎక్కువుంటే విప్లవాల బాటలో కలవాలి, రేపు ఏదో ఒక ఎన్కౌంటర్ లో చావాలి, కాని వారు బయట నిర్బయంగా తిరగ గలగాలి. అన్ని పార్టీలు కలిసినా మాకు వాచ్చే నష్టం ఏమి లేదు ఎందుకంటే రేపటి నుంచి మా వనరులని దోచుకోనేది మీరే కాబట్టి, మీ అసలు స్వరూపాలు చూసి ఇంకెంత మంది పానాలు పోగొట్టుకుంటారో అనే మా భయం. అయినా, కార్య కర్థలకి ప్రాబ్లం కాని, నాయకులకి కాదు కదా, వాళ్ళు ఎట్లాగు ఎప్పటికి మంచి మిత్రులే. ఒకటే కమ్యూనిటీ కదా!

చివరిగా, తెలంగాణని బతికించేది ఒకటే ఆశ..ఖచ్చితంగా రాజకీయ నాయకులు , వారి మాటలు కాదు, ప్రజల పోరాట పటిమ, ఉద్యమ రూపాలు.. సోనియమ్మ మీద, కాంగ్రెస్ మీద నమ్మకాలు పోయి కొన్ని తరాలు దాటింది, ఇపుడు గత్యంతరం లేక నమ్మాల్సిన పరిస్తితి, అయినా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది. విజ్ఞులు, మిత్రులు, ఉద్యమ కారులు అందరు వేయి కళ్ళతో, చెవులతో జరుగుతున్న పరిణామాలు చూసి అలెర్ట్ గా ఉండాలి అని మనవి..మరో కమిటీ కాని, మరో మాట కాని ఇపుడు పనికి రాదనీ, కేవలం పార్లమెంట్లో బిల్లు మాత్రమె అనేది మనం ఎట్టి పరిస్తితిలో మరిచి పోకూడదు..అందరు ఇదే అనుకుంటున్నారు కూడా!

నీళ్ళ మీద మాటల మూటలూ..
గుండెల్ని చీల్చే తూటాల తూఫానులు ,
రక్తపు ధారల మడుగులు,
శవాల గుట్టలు,
వికసించని ఆశలు,
వెలుగు చూడని మొలకలు..
కునుకు పట్టని రాత్రుళ్ళు, పగళ్ళు
త్యాగాలు కాదు తెగిమ్పుల తెలంగాణా..

Courtesy – Sujatha Surepally, thank you for sharing

Related posts:

  1. Ayomayam lo Azad and Co.
  2. Prajala chethila Telangana udyamam
  3. Deeksha viraminchandi – KCR
  4. Dhikkaristhunna Telangana – Deeksha Telangana
  5. KCR Hyd la thiruga ledu – Danam & Mukesh
  6. Prantheeya Mandali? Dy CM in Delhi
  7. Ningi ki egasina Telangana keratam
  8. Telangana Naatakaala mela
  9. Telangana Raktha Kanniru
  10. Madhu Yashki masthi

Leave a Reply

Spam protection by WP Captcha-Free