Will Cong T politicians split?
News pulse, Politics | admin | July 10, 2011 at 5:46 pmతెలంగాణ కాంగ్రెస్ నేతలలో చీలిక వస్తుందా?కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ లేదా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొత్తపార్టీని నెలకొల్పి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని భావిస్తున్నారా? వీటికి కొంతమంది ఔననే సమాధానం ఇస్తున్నారు.తెలంగాణ కాంగ్రెస్ ఎమ్ .ఎల్.ఎలు, ఎమ్.పిలు, ఎమ్మెల్సీలు దాదాపు తొంభై ఐదు శాతం మంది రాజీనామాలు సమర్పించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం తమ దారిలోకి రాకపోవడంతో ఏమి చేయాలనేదానిపై కాంగ్రెస్ నాయకులలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ సాధనలో భాగంగా తామంతా పదవులకు రాజీనామా చేశామని,అయితే అధిష్టానం ఆ చర్యను తవ్రంగా పరిగణించి ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఈ నేపధ్యంలో ఏమి చేయాలన్నది అర్ధం కాకుండా ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అయితే ఇప్పుడున్న పరిస్థితిలో తాము రాజీనామాలను వెనక్కు తీసుకుంటే తెలంగాణ ద్రోహులన్న ప్రచారం తమపైనే పడుతుందని, అందువల్ల అవసరమైతే కొత్త పార్టీని ఏర్పాటు చేసుకుని ఉద్యమించాలని కొందరు సూచిస్తున్నారు. నల్గొండ జిల్లా కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదరరెడ్డి వంటి వారు ఈ ప్రతిపాదనకు కొంత సానుకూలత ఉండగా, మరికొందరు ఈ ప్రతిపాదనపై తొందరపడరాదని అంటున్నారు. కాంగ్రెస హైకమాండ్ రాజీనామాలను ఆమోదించడంలో తొందరపడడం లేదని,ఒక వేళ ఆమోదిస్తే అప్పుడు తప్పక కొత్త పార్టీ పెట్టవలసి వస్తుందని ఒక నాయకుడు అన్నారు. కాంగ్రెస్ లో ఉండి పోటీచేస్తే తమకు ఇబ్బంది ఎదురవుతుందని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బస్ యాత్ర ద్వారా జనంలోకి వెళ్లిందని, తాము ఇంకా ఆ పని చేయలేకపోతున్నామని, కాకపోతే జనంలో తమపై రాజీనామాలు చేశారన్న సానుభూతి ఉందని వారు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లేదా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొత్తపార్టీ పెట్టే యోచన ఉందని ఒక సీనియర్ ఎమ్మెల్యే చెప్పారు.అయితే అవన్ని ఇంకా ఒక కొలిక్కి రాలేదన్నారు. కాగా అలాంటివన్ని వదంతులేనని ఎమ్.పి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నిజంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలు కలిసి కొత్తగా పార్టీని పెట్టుకుంటే ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినట్లేనని పలువురు విశ్లేషిస్తున్నారు. కాగా కేశవరావు రాజీనామాను ఆమోదించి మిగిలినవాటిని పెండింగులో పెట్టవచ్చంటూ కూడా ప్రచారం జరుగుతోంది.
Related posts:
- Is KK’s proposal valid?
- Chances of Chiranjeevi to be CM?
- Split in Cong T MPs?
- Nagam says he will support Jagan if…
- Did Cong T politicians set a deadline?
- Rebels already in YSR Cong
- Jaipal Reddy to resign for T?
- Nagam nu veli veshnam
- Did CBN change his strategy on T?
- Chiranjeevi ki inko pareshani


Tweet This
Digg This
Save to delicious
Stumble it