Prajala chethila Telangana udyamam
News pulse, Politics | admin | August 8, 2011 at 4:31 am
పోయిన సంవత్సరం ఎక్కడ ఆగి పోయినమో అక్కడనే ఉన్నాం, ప్రజల చేతిలోంచి రాజకేయ నాయకులు గుంజుకుని, మేమంటే మేము తెస్తాం అని ఎన్ని రకాలుగా మోసం చేయాలనో అన్ని రకాలుగా చేసింరు. అప్పటినుంచి ఇప్పటిదాకా నిక్కచ్చిగా నిలబడ్డది ప్రజలు మాత్రమే. అన్యాయంగా ప్రాణాలు బలి చేసుకున్నది కూడా ఈ ప్రజలే. ప్రతి ఒక్క సంఘటనకి ఒకరో ఇద్దరో బలి, నిన్నటి చాతకాని చిదంబరం మాటలకి ఇవాళ ఆదిలాబాద్ శ్రీకాంత్ బలి. పాగల్ గాళ్ళకి రాజ్యాంగం కాని, ప్రజాస్వామ్యం కాని, ప్రజలు వారి పట్ల నిబద్దత గాని ఏది తెలవదు. మన నాయకులు చోద్యం చూడడం , ఇంకాస్త చతురతతో మాట్లాడడం తప్ప్పితే చేసేది పెద్దగా ఏమి లేదు. ఎవరు ఈ ఆత్మ హత్యలకు బాద్యులు? ఎందుకు చని పోవాలి? మా పార్టీ అనుకున్న వాళ్లకి బలం లేదు, కనీసం అందరిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కలిపి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేయరు.
ఇవాళ పెద్ద సారూ, మన ఒకే ఒక్క అన్న, నాయకుడు, అపరిచితుడు లెవెల్లో , 2014 వరకు ఉంటె నష్టం లేదు, అపుడు చూసుకుందాం అని అనకనే అంటున్నారు..అప్పటిదాకా రోజుకు ఒకరు, ఇద్దరు చచ్చినా పరవాలేదు అని అర్థం ? నిజంగా కేంద్రం పై వత్తిడి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నామా? ఒక సారి ఆలోచించండి. ఇప్పటి వరకు పోయిన ప్రాణాల మీద ప్రేమ లేక పోయిన పరవాలేదు కనీసం ఉద్యమ కార్యా చరణ అన్న బలంగా ఉండక్కర్లేదా?
చిదంబరం ఎవరిని నిర్నయిన్చుకోమంటున్నాడు? కాంగ్రెస్ పార్టీ రెండు చీలికలు కనిపించడం లేదా? అసలు రెండు వర్గాలు ఉన్నవారిని , సస్పెండ్ చేయక్కర్లేదా? ఎం తమాషా చూస్తున్నారు? ఎవడిని పిచ్చి వాళ్ళను చేస్తున్నారు? ఒక్క టీఅరెస్ తప్పిస్తే అన్ని పార్టీలు రెండు నాల్కల ధోరణితో ఉండవచ్చా? అసలు ఎక్కడన్నా ఈ నీతి ఉందా..ఒకే రాష్ట్రంలో , ఒకే పార్టీలో రెండు నాల్కలు..మనం మౌనంగా చూస్తూ ఉంటాం! కనీసం జాక్, టీఅరెస్ కలిసి వీరిని ఒక్క తాటిపైకి తెచ్చే పనులు చేయోద్దా ? ఇటు బందు పిలుపు కాల్ ఇస్తే అటునుంచి నో అని వస్తుంది సమాధానం. ఎందుకు? తెలిసిన వారికి తెలుసు, అంత తెలుసు..అయినా మాట్లాడం.
ఇపుడు సకల జనుల సమ్మె అయినా చివరి వరకు కొన సాగానిస్తారా? టీఅరెస్ మా చేతిలో ఉంది , తెలంగాణాకి ఏమి పరవాలేదు అని అన్ద్రోల్లు కోడై కూస్తున్నారు, దీనికి మన సమాధానం ఏమిటి? మౌనం అంగీకరమా? నాలుగు రోజులు ట్రైన్లు , బస్సులు బందు పెడితే? శాంతం శతం..అని చెపుతారు, నష్టాలు , లాభాలు అంటారు, ఎవడికి నష్టం? ఎవడి ప్రాణాలు పోతున్నయి? ఎన్ని ప్రాణాలు అయినా పోనీ శాంతం ! కనీసం గాంధి గారి లాగా సహాయా నిరాకరణ చేయలేమ? వాళ్ల వస్తువులు , సినిమాలు, ప్రభుత్వానికి కొంచెం వత్తిడి తెచ్చే కార్యకలాపాలు చేయలేమా? ఒక్కో ప్రోగ్రాం ఒక ప్రాణాన్ని తీసుకుంటుంది
అక్క సుష్మా స్వరాజ్ కి వేల కోట్ల దండాలు, పది ఏండ్ల ఉద్యమం ఒక ఎత్తు, నిన్నటి పార్లమెంట్ సంఘటన ఒక ఎత్తు, మొత్తం భారత దేశం కి ఒకే ఒక్క కంచు ఖంటం వినిపించింది. ఒక అక్క, తల్లి, భార్య, బిడ్డ , ప్రేమికురాలు, స్నేహితురాలు ..ఆవేదన ..ఆ తల్లి రూపం లో కన పడింది. ఎంత వైవిధ్యం , అదే ఇంకొక తల్లి , వేరే దేసస్తురాలైనా కూడా నెత్తిన పెట్టుకుని పూజిస్తుంటే, కసాయి వాడి కంటే ఘోరంగా బలి దానాలు చూస్తుంది, కనీసం రాక్షస జాతి లో నైనా ఒక్క నర బలితో మొక్కు తీరతాయి అని అంటరు. ఎన్ని ప్రాణాలు పోఇనా ఈ రక్తం తాగే పులులకు మనసు కరుగుతలేరు . ఇపుడు ఇంకా నాలుగు ఏండ్లు అంటున్నారు. ఇంకా నాలుగు ఎండ్లకి మాకు రాజకీయ పార్టీలు ఎందుకు? మీకు చాతనైతే, ఇపుడు కేంద్రం దిగి వచ్చేటట్టు చేయండి, లేకపోతె నాయకులుగా కాదు, ప్రజలుగా కలిసి , ప్రజలతో ఉండి పోరాటం చేయండి..పని చేయని పార్టీలు ఏవైనా మాకు ఒక్కటె. అవతలి వాళ్ళని కదిలించలేని, భయ పెట్టలేని పార్టీలు మాకు ఎందుకు, ఇదేమి హరి కథా పురాణం కాదు, రోజు పారాయణం చేయడానికి.
అవును, ఇంకా నాలుగు ఏండ్ల తరువాత మళ్లీ గెలిపిస్తాము, అపుడు కూడా అందరిని గెలిపించాం, ఏమైంది? ఏమైతది? తెలంగాణా అంటే లెక్ఖ తెలవాలే అంటే మన పౌరుషం చూపాల్సిందే, మనమో వాళ్ళో తేల్చుకోవాల్సిందే..మనం తయారుగా ఉన్నామా..లేకపోతె అందరం ఆంధ్రల పోయి బతుకుదాం..బయట దేశాల్లో కూడా బతక నిస్తలేరు. రేపటి తెలంగాణాల ఎట్లాగు జాగలేదు. బొంద పెట్టనీకి కూడా..నిన్నటికి నిన్న పోలేపల్లి ల బొంద పెట్టనికి పొతే జాగా లేదని ఎల్లగోట్టిన్రు..తాతల తండ్రుల సమాధులు కూడా సెజ్జులకి అమ్ముకున్నారు. జగన్ అన్న కి కట్టబెట్టిన్రు..ఎవరూ మాట్లాదరూ..లగడపాటిని తిట్టడం కాదు తెలంగాణా అంటే , ఉన్న భూములను కాపాడుకోవడం, దొంగలా భరతం పట్టడం..అది చాతకాదు, ఇది చాతకాదు..ఎమన్నా అంటే మాలాంటి వాళ్ల ని ఆడి పోసుకుంటారు.
తెలంగాణా ప్రజలు మరో లిబియా, ఇజిప్టు దేశాలకంటే గొప్పగా పోరాటం చేయగలరు, ఒక్క సారి ఈ రాజకీయ నాయకుల పీడా వదిలితే, మాకు ఎవడు లేడు, అందరు చాత కాని వాళ్ళు అని తేలితే అంతా ప్రజలే నాయకులు.మరో పోరాట రూపానికి తెర తీస్తున్నారు ప్రజలు, ఇపుడు వేసే వేషాలు అన్ని ఏదో ఒక రోజు భస్మా సుర హస్తం అయి అందరిని బూడిద చేయక మానవు..ఇన్ని ఆత్మల గోసలు ఊరికే పోవూ.
అవును మౌనం అంగీకారమే, రాజీనామాల డ్రామాలు ఆడి , ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకుని హాయిగా ఉన్నామని భ్రమ పడవద్దు. ఇంకా ముందు ఉంది ముసుర్ల పండగ . కాంగ్రెస్, టీడిపి లను బహిష్కరిద్దాం..మన పార్తీలతోని కలిసి మనమే ప్రణాలికలు తయారు చేద్దాం..ఒక్కొక్క ప్రాణం ఖరీదు మన గుడ్డి నమ్మకాలు, ప్రేమలు, ఆప్యాయతలు కాకూడదు. దయచేసి, ఒక డేడ్ లైన్ పెట్టుకొని పని చేద్దాం..లేదా 2014 వరకు నోరు మూసుకొని ఉందాం.
మా తల్లుల కళ్ళళ్ల రక్తాలు కారుతున్నాయి,
కడుపు చించుకుని పుట్టిన బిడ్డ
కడుపార దుక్ఖం పంచి పెట్టి పోతున్నడు..
కండ్ల నీళ్ళు, కాష్టాలు, బొందల గడ్డలు
ఎవడిని కదిలించవు..
బిడ్డల్లారా..ఇంకా చావొద్దు..
మీ బొందలకి జాగాలు లేవు ఇక్కడ..
లేవండి..సమాదుల్లోంచి
కదిలి రాండ్రి ..
తెలంగాణా తల్లిని ఈ దొంగ
నాయకుల చేతిల్లోంచి రక్షించండి..
Related posts:
- Ayomayam lo Azad and Co.
- Telangana in cross roads
- Deeksha viraminchandi – KCR
- Dhikkaristhunna Telangana – Deeksha Telangana
- Ningi ki egasina Telangana keratam
- G-andh(i/ra) giri
- Exams are done, now summer vacation?
- Telangana katha modhatiki vacchindhi
- New story ‘Jai Bolo Telangana’
- Marana saasanam raasina T MLAs


Tweet This
Digg This
Save to delicious
Stumble it