Telangana thappademo?
News pulse, Politics | admin | September 20, 2011 at 5:58 pmపార్టీ హైకమాండ్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందేమోననే భయం సీమాంధ్ర నేతల్ని పట్టి పీడిస్తోంది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల దృష్టా కాంగ్రెస్ హైకమాండ్, యుపిఏ సంకీర్ణ సర్కారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అంగీకరించక తప్పదేమోనని సీమాంధ్ర నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ హైకమాండ్‌కు అందించనున్న నివేదికలో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా సిఫార్సు చేసేపక్షంలో తాము ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై కూడా సీమాంధ్ర నేతలు సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి ఒకరు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ పార్టీ హైకమాండ్ తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు. తనకీ విషయం ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? అనే ప్రశ్నలు తనను అడగవద్దని కూడా స్పష్టం చేశారు. నాకు తెలిసింది మీతో పంచుకుంటున్నా.
ఇంతకుమించి ననే్నమీ అడగవద్దని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పరిస్థితి రోజురోజుకు చేయి దాటుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందుముందు మరింత విషమించే ప్రమాదం ఉందని పార్టీ హైకమాండ్ ఆందోళన చెందుతున్నట్టు చెప్తున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య పూడ్చలేనంత అగాధం ఏర్పడిందని, దీన్ని పూడ్చటం సాధ్యం కాకపోవచ్చనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్, యుపిఏ సంకీర్ణ సర్కారు తెలంగాణ ఏర్పాటుకు ఎట్టకేలకు అంగీకరించినా, దాన్ని ఎప్పుడు ఎలా అమలు చేస్తారనేది ఇప్పుడే చెప్పటం సాధ్యం కాదని సీమాంధ్రకు చెందిన మంత్రి అంటున్నారు.
ఎంతకాలం తెలంగాణ గొడవ అని ఆయన విసుగు ప్రదర్శించారు. తెలంగాణ ఏర్పాటు వివాదం ఇప్పుడు కొనసాగుతున్న విధంగా మరికొంత కాలం కొనసాగితే, తెలంగాణతోపాటు మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిపోతుందనే ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటు వివాదం నిరంతరం కొనసాగటం ఎవరికీ మంచిది కాదని, దీనికి ఎక్కడో ఒకచోట ఫుల్‌స్టాప్ పెట్టక తప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఇతరత్రా ఏర్పాట్లు, రాజ్యాంగ పరమైన హామీలు, భద్రతలు కల్పించటం ద్వారా సమస్యను పరిష్కరించేందుకు పెద్దగా అవకాశాలు కల్పించటం లేదని సీమాంధ్రకు చెందిన కొందరు ఎంపీలు కూడా భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ సానుకూలత వ్యక్తం చేసినా, యుపిఏ సంకీర్ణ సర్కారు దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని సీమాంధ్ర ఎంపీలు వాదిస్తున్నారు. ఉద్యమబాటలో సాగుతున్న తెలంగాణ ప్రజలకు ఊరట కలిగించేందుకు కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలత వ్యక్తం చేసినంత మాత్రాన, తెలంగాణ ఏర్పడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
Related posts:
- Will Cong T politicians split?
- Hyderabad is part of Telangana – GK Pillai
- Chances of Chiranjeevi to be CM?
- Nagam says he will support Jagan if…
- Damodar Raja Narasimha cannot be Dy CM
- T supporters pull mike from Revanth Reddy
- Did CBN change his strategy on T?
- 75 lakhs release order issued for Tank Bund statues
- Panthulla madhya chicchu
- We need development of Telangana


Tweet This
Digg This
Save to delicious
Stumble it